31 నిమిషాల్లో ఛార్జింగ్, 600 కి.మీ మైలేజ్: రూ. 5 లక్షలకే ఆడి కార్.. !

First Published | Aug 28, 2023, 3:54 PM IST

ఇండియాలోని  ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో కొత్త కార్లు విడుదల అవుతున్నాయి. ఇప్పుడు లగ్జరీ కార్ బ్రాండ్ ఆడి సరికొత్త Q8 E-Tron ఎలక్ట్రిక్ కారును విడుదల చేసింది. అయితే ఈ కారు ఛార్జింగ్ సమస్యను పరిష్కరించింది. కేవలం 31 నిమిషాల్లో ఛార్జ్ చేయబడుతుంది. అంతే కాదు 600 కి.మీ మైలేజీని ఇస్తుంది.
 

భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లలో అనేక అప్షన్స్ ఉన్నాయి. టాటా మోటార్స్, MG మోటార్స్‌తో సహా అనేక లగ్జరీ కంపెనీల నుండి ఎలక్ట్రిక్ కార్లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు ఆడి కంపెనీ సరికొత్త ఆడి క్యూ8 ఇ-ట్రాన్ ఎలక్ట్రిక్ కారును తీసుకొచ్చింది.
 

సరికొత్త ఆడి క్యూ8 ఇ-ట్రాన్ ఎలక్ట్రిక్ కారులో అనేక ఫీచర్లు, లేటెస్ట్  టెక్నాలజీ, మాక్స్  సేఫ్టీ ఉన్నాయి. ముఖ్యంగా EVలకు ఛార్జింగ్ అనేది పెద్ద సమస్య. అయితే  80 శాతానికి ఛార్జ్ చేయడానికి కారుకి కనీసం 1 గంట సమయం పడుతుంది. కానీ ఆడి క్యూ8 ఇట్రాన్ ఈ సమస్యను పరిష్కరించింది.
 


ఆడి క్యూ8 ఇ-ట్రాన్ కారు కేవలం 31 నిమిషాల్లో 80 శాతం జార్జ్ అయిపోతుంది. ఈ విధంగా, ఎలక్ట్రిక్ కార్లను ఉపయోగించే వినియోగదారులు ఛార్జింగ్ కోసం ఎక్కువ సమయం వెచ్చించాల్సిన అవసరం లేదు

బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ అయినట్లయితే, ఆడి క్యూ8 ఇ-ట్రాన్ కారు 600 కి.మీ మైలేజీని ఇస్తుంది. Audi Q8 e-tron ప్రస్తుతం భారతదేశంలో అందుబాటులో ఉన్న టాప్ మైలేజ్ EV.
 

ఈ కొత్త కారులో రెండు వేరియంట్లు ఉన్నాయి. ఆడి క్యూ8 ఇ-ట్రాన్ అండ్  ఆడి క్యూ8 ఇ-ట్రాన్ స్పోర్ట్స్‌బ్యాక్. దినికి 114kWh బ్యాటరీ ప్యాక్ ఇంకా 95kWh సామర్ధ్యం ఉంది.

రెండు కార్ల బ్యాటరీ ప్యాక్ భిన్నంగా ఉంటుంది. అందువల్ల రెండు కార్ల పనితీరు కూడా భిన్నంగా ఉంటుంది. 340bhp పవర్, 664Nm టార్క్ అండ్ కారు మరొక వేరియంట్ 408bhp పవర్, 664Nm పీక్ టార్క్ సామర్ధ్యం  ఉంటుంది.
 

కొత్త Audi Q8 e-tron కేవలం 5.5 సెకన్లలో 0-100 kmph స్పీడ్ అందుకుంటుంది. అందువల్ల  ఈ కారు పెట్రోల్ డీజిల్ కార్ల కంటే వేగంగా కదిలే సామర్థ్యాన్ని  ఉంటుంది. అయితే  5 లక్షలతో సరికొత్త కారును బుక్ చేసుకోవచ్చు. ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ.1.14 కోట్లు
 

Latest Videos

click me!