కొత్త హ్యుందాయ్ వెన్యూ ఫేస్‌లిఫ్ట్ బుకింగ్స్ ఓపెన్.. ఆకట్టుకునే అప్ డేట్ ఫీచర్లుతో వచ్చేస్తుంది..

First Published | Jun 4, 2022, 12:48 PM IST

 తాజాగా టీజర్ ఫోటోలను లాంచ్ చేసిన తర్వాత హ్యుందాయ్ మోటార్ ఇండియా చాలా కాలంగా ఎదురుచూస్తున్న వెన్యూ సబ్-కాంపాక్ట్ SUV ఫేస్‌లిఫ్ట్ వెర్షన్  అఫిషియల్ ఫోటోలను విడుదల చేసింది. అప్ డెటెడ్ 2022 హ్యుందాయ్ వెన్యూ ఫేస్‌లిఫ్ట్ జూన్ 16న ఇండియాలో లాంచ్ కానుంది. 2022 హ్యుందాయ్ వెన్యూ ఫేస్‌లిఫ్ట్ కోసం శుక్రవారం నుండి బుకింగ్‌లను ప్రారంభించనున్నట్లు వాహన తయారీ సంస్థ ప్రకటించింది.

అయితే, కొత్త 2022 హ్యుందాయ్ వెన్యూ ఫేస్‌లిఫ్ట్ కోసం ఆన్ అఫిషియల్ బుకింగ్‌లు ఇప్పటికే సెలెక్ట్ చేసిన డీలర్‌షిప్‌లలో ప్రారంభమయ్యాయి. సబ్-కాంపాక్ట్ SUV కొన్ని కాస్మెటిక్ మార్పులు అండ్ ఫీచర్ అప్‌గ్రేడ్‌లతో వస్తుంది, అయితే ఇంజిన్-గేర్‌బాక్స్ ఒకేలా ఉంటుంది. 

ఈ కొత్త ఫీచర్లు
2022 హ్యుందాయ్ వెన్యూ గొప్ప డిజైన్ మార్పులు అండ్ ఇంటీరియర్ అప్‌గ్రేడ్‌లతో పాటు ఎన్నో సెగ్మెంట్-ఫస్ట్ ఫీచర్లతో వస్తుంది. ఇంటీరియర్ అండ్ ఇంజన్ వివరాలు అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది. కొత్త వెన్యూ కస్టమర్‌లు ఇప్పుడు అలెక్సా అండ్ గూగుల్ వాయిస్ అసిస్టెంట్‌తో హోమ్ టు కార్ (H2C) ద్వారా మల్టీ కార్ ఫంక్షన్‌లను కంట్రోల్ చేయవచ్చు.  ఈ కొత్త మోడల్‌లో 60 కంటే ఎక్కువ బ్లూలింక్ కనెక్ట్ చేయబడిన ఫీచర్లు  ఉన్నాయి. కొత్త వెన్యూ సెగ్మెంట్-ఫస్ట్ 2-స్టెప్స్  బ్యాక్ రిక్లైనింగ్ సీటుతో వస్తుందని కంపెనీ ధృవీకరించింది. 
 

2022 హ్యుందాయ్ వెన్యూ సరికొత్త సెన్సుయస్ స్పోర్టినెస్ డిజైన్ ఫిలాసఫీతో వస్తుంది. అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయించబడుతున్న హ్యుందాయ్ కార్లలో ఇది కనిపిస్తుంది. ఈ SUV సరికొత్త ఫ్రంట్ ఫేస్ తో వస్తుంది, కొత్త టక్సన్ అండ్ పాలిసేడ్ SUV నుండి ప్రేరణ పొందిన రీడిజైన్ చేయబడిన గ్రిల్ డార్క్ క్రోమ్‌ను పొందుతుంది, అయితే కింద బంపర్ స్పోర్టీ లుక్ కోసం ఆకర్షణీయమైన ఫాక్స్ స్కిడ్ ప్లేట్‌ను ఉంటుంది.


ఈ SUV స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ సెటప్‌ ఉంది. అయితే పైన లైటింగ్ ఎలిమెంట్స్ అప్ డేట్ చేయబడ్డాయి. పై లైటింగ్ ఎలిమెంట్స్  టర్నింగ్ ఇండికేటర్స్ గ్రిల్  ఎక్స్టెంషన్ లాగా కనిపిస్తాయి. సైడ్ ప్రొఫైల్ ప్రస్తుత మోడల్ లాగానే కనిపిస్తుంది. అయితే, ఇప్పుడు  కొత్త అల్లాయ్ వీల్స్ అండ్ వీల్ క్యాప్‌ పొందింది. 

కారు వెనుక ప్రొఫైల్‌కు వస్తే, కొత్త వెన్యూ పూర్తిగా రీడిజైన్ చేయబడిన టెయిల్‌గేట్‌తో వస్తుంది.  ఇప్పుడు LED లైట్ బార్ ద్వారా కనెక్ట్ చేయబడిన కొత్త టెయిల్-ల్యాంప్‌లను పొందుతుంది. ఈ SUV కొత్త బంపర్‌, రెండు మూలల వద్ద బ్రేక్ లైటింగ్‌తో  కింద బంపర్‌లో పెద్ద ఫాక్స్ సిల్వర్ స్కిడ్ ప్లేట్ ఉంది. 
 

ఎన్-లైన్ వేరియంట్
హ్యుందాయ్ వెన్యూ  ఎన్-లైన్ వేరియంట్‌ను కూడా పరీక్షిస్తోంది. కంపెనీ దినిని తరువాత దశలో ప్రారంభించవచ్చు. N-లైన్ వేరియంట్ విభిన్నంగా డిజైన్ చేయబడిన ఫ్రంట్ అండ్ రియర్ బంపర్స్, అల్లాయ్ వీల్స్ ఇంకా రెడ్ స్టిచింగ్ అల్యూమినియం పెడల్స్ అలాగే N-లైన్ బ్యాడ్జింగ్‌తో కూడిన ప్రత్యేకమైన ఇంటీరియర్‌ను పొందుతుంది. 
 

ఇంజన్
కంపెనీ వెన్యూ ఫేస్‌లిఫ్ట్  ఇంటర్నల్ ఫోటోలను విడుదల చేయలేదు.  సీట్లకు కొత్త అప్హోల్స్టరీ మరిన్ని ఫీచర్లు, అప్‌డేట్ చేయబడిన ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను పొందే అవకాశం ఉంది. 2022 హ్యుందాయ్ వెన్యూ ఫేస్‌లిఫ్ట్ 1.2-లీటర్ పెట్రోల్, 1.0-లీటర్ టర్బో పెట్రోల్ అండ్ 1.5-లీటర్ డీజిల్‌ ఉన్న ప్రస్తుత ఇంజిన్ లైనప్‌తో అందించబడుతోంది. 

భారత మార్కెట్లో సబ్-కాంపాక్ట్ SUV విభాగంలో పోటీ
కొత్త 2022 హ్యుందాయ్ వెన్యూ ఫేస్‌లిఫ్ట్ టాటా నెక్సాన్, మహీంద్రా XUV300, కియా సోనెట్, టయోటా అర్బన్ క్రూయిజర్ తో పోటీపడుతుంది.  

Latest Videos

click me!