రూ.25 వేలకే కొత్త హ్యుందాయ్ కార్.. ఎలా, ఎక్కడ బుక్ చేసుకోవచ్చో తెలుసా..?

First Published | Mar 2, 2024, 1:22 PM IST

భారతదేశంలోని SUVలలో హ్యుందాయ్ క్రెటాకు భారీ డిమాండ్ ఉన్న సంగతి మీకు తెలిసిందే. అయితే  ఇప్పుడు హ్యుందాయ్ సరికొత్త క్రెటా ఎన్ లైన్ ప్రత్యేక వేరియంట్ కారును విడుదల చేస్తోంది. కేవలం 25,000 రూపాయలు చెల్లించి ఈ కారును బుక్ చేసుకోవచ్చు. 
 

హ్యుందాయ్ కార్లలో క్రెటా అత్యంతగా  ప్రజాదరణ పొందింది. ఇప్పుడు కొత్త డిజైన్, అదనపు ఫీచర్లు, అత్యుత్తమ పనితీరుతో హ్యుందాయ్ క్రెటా ఎన్ లైన్ కారు లాంచ్ కావడానికి సిద్ధంగా ఉంది.
 

క్రెటా ఎన్ లైన్ కార్లలో ఈ కారు 3వ మోడల్. 2N లైన్ మోడల్ ఇప్పటికే విడుదలై భారీ విజయాన్ని సాధించింది. ఇప్పుడు క్రెటా ఎన్ లైన్ కొత్త కలర్  ఇంకా అనేక అప్‌డేట్‌లతో రాబోతుంది. 
 


సరికొత్త క్రెటా ఎన్ లైన్ కారును రూ. 25,000 టోకెన్ మొత్తం చెల్లించి బుక్ చేసుకోవచ్చు.   ఫిబ్రవరి 29  నుండి బుకింగ్‌లు ఓపెన్ అయ్యాయి.

క్రెటా ఎన్ లైన్ కార్ బుకింగ్ ఆథరైజేడ్  హ్యుందాయ్ డీలర్‌షిప్‌ను సందర్శించడం ద్వారా చేసుకోవచ్చు. ఇంకా ఇప్పుడు హ్యుందాయ్ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా కూడా కారును బుక్ చేసుకునే అవకాశం ఉంది.
 

కొత్త క్రెటా ఎన్ లైన్ మరింత స్పోర్టీ లుక్‌తో  ఉంది. హ్యుందాయ్ ఇప్పటికే కారు ఫోటోలను విడుదల చేసింది. సోషల్ మీడియాలో ఈ కారుకు విశేష ఆదరణ లభించింది.

ఫిబ్రవరి 29 నుంచి బుకింగ్ ప్రారంభించిన హ్యుందాయ్ క్రెటా ఎన్ లైన్ కారు మార్చి 11న విడుదల కానుంది. ఎన్ లైన్ బ్యాడ్జ్ ఉన్న ఈ కారులో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి.

ఫ్రంట్ గ్రిల్ రి డిజైన్ చేయబడింది. అంగుళర్ డిజైన్ బంపర్, అదనపు వైడ్ ఎయిర్ ఇన్‌లెట్లు కారు రూపాన్ని పెంచుతాయి. హెడ్‌ల్యాండ్‌లు ఇంకా డే టైం  రన్నింగ్ LED లలో ఎక్కువ తేడా లేదు.

కొత్త కారు ధర రూ.17.50 లక్షల నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ 160 bhp శక్తిని, 253 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

Latest Videos

click me!