ఆ వ్యక్తి తన ఎస్‌యూవీని కావేరీ నదిలో పడేసినప్పుడు అతను తన తల్లి మరణంతో చాలా బాధపడుతున్నడని అక్కడి మత్స్యకారులు, బాటసారులు తెలిపారు. నదిలో కూరుకుపోతున్న ఈ లగ్జరీ కారును నది చుట్టూ ఉన్న మత్స్యకారులు, బాటసారులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు.