నిని ఆక్టివేట్ చేసినప్పుడు ఎలెక్ట్రోఫోరేటిక్ టెక్నాలజి కారుని వివిధ రంగులకి మారుస్తుంది దీంతో కార్ బాడీ కావలసిన రంగులోకి మార్చుకోవచ్చు.
బిఎండబల్యూ గ్రూప్ ప్రస్తుతం ఈ ఇంక్(Eink)టెక్నాలజీని అభివృద్ధి చేయడంలో ముందుంది. బిఎండబల్యూ ఐఎక్స్ ఫ్లో విత్ ఈ ఇంక్ ప్రాజెక్ట్ హెడ్ స్టెల్లా క్లార్క్ మీడియాతో మాట్లాడుతూ డ్రైవర్‌లు వారి పర్సనాలిటీ విభిన్న కోణాలను తెలియజేయడానికి లేదా మార్పు పట్ల వారి అభిరుచి తెలియజేయడానికి ఇంకా కారులో కూర్చున్న ప్రతిసారీ దీనిని రీడిఫైన్ చేయడానికి అనుమతిస్తుంది. సోషల్ మీడియాలో ఫ్యాషన్ లేదా స్టేటస్ అప్‌డేట్‌ల లాగానే ఉంటుంది అని చెప్పింది. ఇంకా కారు ప్రతిరోజు జీవితంలో ఎన్నో మనోభావాలు, పరిస్థితులకు ప్రతిబింబంలా అవుతుంది.