వాహనాల వేస్ట్/ పాత టైర్లు ఏమౌతాయో తెలుసా..? అలా చేయడం వల్ల నిజంగా క్యాన్సర్ వస్తుందా..?

First Published | Jan 7, 2022, 4:46 PM IST

ఈ రోజుల్లో చాలా ఇళ్లలో ఏదో ఒక వాహనం (vehicle)తప్పకుండ ఉంటుంది. మీ ఇంట్లో కూడా ఏదైనా వాహనం ఉంటే  వాటి టైర్లు(tires) ఏదో ఒక కారణంగా పాడైపోతుంటాయి. తరువాత మెకానిక్ ద్వారా వాటిని కొత్త టైర్లతో భర్తీ చేసి పాత టైర్లు తొలగిస్తాము.

ఆ పాత టైర్లను ఏం చేస్తారని మీరు ఎప్పుడైనా ఆలోచించారా..? ఈ ప్రశ్న మీలో కూడా  మదిలో మెదులుతూ ఉంటే దీనికి సమాధానం తెలియకపోతే తెలుసుకొండి. వాస్తవానికి, ఈ పాత టైర్లకు సంబంధించి ప్రభుత్వానికి ఒక విధానం ఉంది. ఇందులో ప్రభుత్వం ఇటీవల కొన్ని మార్పులు చేసింది.

దాని గురించి మరింత వివరంగా చెప్పాలంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) కేసు కోసం అందించిన డేటా ప్రకారం, దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 2,75,000 టైర్లు తొలగించబడుతున్నాయి, అయితే వాటిని పారవేయడానికి సమగ్ర ప్రణాళిక లేదు. 
 


రీసైక్లింగ్ కోసం ప్రతి సంవత్సరం దాదాపు 3 మిలియన్ల వేస్ట్ టైర్లు భారతదేశంలోకి దిగుమతి అవుతున్నాయి. 19 సెప్టెంబరు 2019న ఎండ్-ఆఫ్-లైఫ్ టైర్లు/వేస్ట్ టైర్ల (ELT) సరైన నిర్వహణకు సంబంధించిన విషయంలో ఎన్‌జి‌టి వ్యర్థాల నిర్వహణను కండక్ట్ చేసి వ్యర్థాల కోసం ఒక వివరణాత్మ ప్రణాళికను సమర్పించాలని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (CPCB)ని ఆదేశించింది. 
 

టైర్ల రీసైక్లింగ్ 
వేస్ట్ టైర్లను రీసైకిల్ రబ్బరు,  రబ్బరు చిన్న ముక్కలు, చిన్న ముక్కల రబ్బరు మోడిఫైడ్ బిటుమెన్ (CRMB), రికవర్డ్ కార్బన్ బ్లాక్, పైరోలిసిస్ ఆయిల్/చార్‌గా రీసైకిల్ చేస్తారు. 
 

2019 నివేదికల ప్రకారం భారతదేశంలోని పైరోలిసిస్ పరిశ్రమ తక్కువ నాణ్యత గల ఉత్పత్తులను తయారు చేస్తుందని, దీని వల్ల కలిగే పర్యావరణ నష్టాన్ని నివారించడానికి వాటిని నిషేధించాల్సిన అవసరం ఉందని ఎన్‌జి‌టి కేసులో పిటిషనర్ వాదించారు అలాగే  ఈ పరిశ్రమ క్యాన్సర్ కలిగించే కాలుష్యాలను విడుదల చేస్తుంది. ఇవి మన శ్వాసకోశ వ్యవస్థకు చాలా హానికరం అని తెలిపారు.
 

Latest Videos

click me!