Bikes: ఈ బైక్స్ ఉంటే కాసుల వ‌ర్షం ఖాయం.. రూ. 70 వేల‌లో 70కిపైగా మైలేజ్

Published : Feb 05, 2026, 02:38 PM IST

Bikes: పెట్రోల్ ధ‌ర‌లు పెరుగుతోన్న వేళ మైలేజ్ ఇచ్చే బైక్‌ల‌పై దృష్టిసారిస్తున్నారు. ముఖ్యంగా ర్యాపిడో, జొమాటో వంటి డెలివ‌రీ బాయ్స్‌కి ఇలాంటి బైక్‌లు బాగా ఉప‌యోగ‌ప‌డుతున్నాయి. అలాంటి కొన్ని బెస్ట్ బైక్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

PREV
16
బడ్జెట్ మైలేజ్ బైక్‌లు

భారతదేశంలో రోజూ ఆఫీస్, కాలేజీ, పనులకు వెళ్లేవారు తక్కువ ధర, ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైక్‌లనే ఇష్టపడతారు. రూ.70,000 లోపు లభించే ఈ బైక్‌లు మధ్యతరగతికి పెద్ద ఊరట. వీటికి నిర్వహణ ఖర్చు తక్కువ. డెలివరీ సేవల్లో పనిచేసే వారికి ఎంతో ఉపయోగపడే కొన్ని బైక్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

26
హీరో HF డీలక్స్

హీరో HF డీలక్స్ ఎన్నో ఏళ్లుగా ప్రజల నమ్మకం పొందిన కమ్యూటర్ బైక్. ఈ బైక్ ధర సుమారు రూ.66,000 నుంచి రూ.69,000 మధ్య ఉంటుంది. ఈ బైక్‌లో 100cc ఇంజిన్, లీటర్ పెట్రోల్‌కు 70–75 కి.మీ మైలేజీ, సింపుల్ డిజైన్, మెయింటెనెన్స్ ఖర్చు చాలా తక్కువ, నగర ప్రయాణానికి సరిపోయే సస్పెన్షన్, రోజూ ఆఫీస్ వెళ్లే వారికి ఇది మంచి ఎంపికగా చెప్పొచ్చు.

36
బజాజ్ ప్లాటినా 100

ఎక్కువ మైలేజీ బైకుల జాబితాలో బజాజ్ ప్లాటినా 100 తప్పకుండా ఉంటుంది. ఈ బైక్ ధర సుమారు రూ.60,000 దగ్గర ఉంటుంది. ఇందులో పొడవైన సీట్, మృదువైన రైడ్ అనుభవం ఇస్తుంది. ఇక మైలేజ్ విష‌యానికొస్తే లీట‌ర్ పెట్రోల్‌కు 70 నుంచి 75 కిలోమీట‌ర్లు దూసుకెళ్లొచ్చు. రోజూ ఎక్కువ దూరం ప్రయాణించే వారికి ఈ బైక్ బాగా సరిపోతుంది.

46
టీవీఎస్ స్పోర్ట్

టీవీఎస్ స్పోర్ట్ నమ్మకమైన ఇంజిన్‌తో వస్తుంది. బిల్డ్ క్వాలిటీ కూడా బాగుంటుంది. ఈ బైక్ ధర రూ.65,000 నుంచి రూ.68,000 మధ్య ఉంటుంది. నగరం, గ్రామం రెండింట్లోనూ సౌకర్యవంతమైన రైడ్ అందిస్తుంది. లీటర్‌కు 65–70 కి.మీ మైలేజీ ఇస్తుంది. టీవీఎస్ సర్వీస్ నెట్‌వర్క్ పెద్దగా ఉండటం అదనపు లాభంగా చెప్పొచ్చు.

56
హీరో స్ప్లెండర్ ఐస్మార్ట్

హీరో స్ప్లెండర్ ఐస్మార్ట్ అనేది స్ప్లెండర్ సిరీస్‌లో అప్‌డేటెడ్ మోడల్. ఈ బైక్ ధర రూ.67,000 నుంచి రూ.69,000 మధ్య ఉంటుంది. స్మార్ట్ ఇగ్నిషన్ టెక్నాలజీ ఇంధన ఆదాకు ఉపయోగపడే ఫీచ‌ర్‌గా చెప్పొచ్చు. ఈ బైక్ లీటర్‌కు 65–70 కి.మీ మైలేజీ ఇస్తుంది.

66
టీవీఎస్ ఎక్స్ఎల్ 100

టీవీఎస్ XL 100 ఒక క్లాసిక్ గియర్‌లెస్ మోపెడ్. ఈ వాహనం ధర సుమారు రూ.55,000 దగ్గర ఉంటుంది. ఎక్కువ బరువు మోయగల సామర్థ్యంతో తీసుకొచ్చారు. లీటర్‌కు 75–80 కి.మీ మైలేజీ ఇస్తుంది. మెయింటెనెన్స్ ఖర్చు చాలా తక్కువ. డెలివరీ పనులు చేసే వారు, రోజువారీ అవసరాల కోసం వాహనం వాడేవారిలో ఇది బాగా ప్రాచుర్యం పొందింది.

Read more Photos on
click me!

Recommended Stories