Automatic Cars Under 5 Lakhs: రూ.5 లక్షల్లోపు వచ్చే బెస్ట్ ఆటోమేటిక్ కార్లు ఇవిగో!

Published : Nov 02, 2026, 05:12 PM IST

Automatic Cars Under 5 Lakhs: ట్రాఫిక్‌లో పదేపదే గేర్లు మార్చుతూ డ్రైవింగ్ చేయడం ఇబ్బందిగా ఉందా? అయితే ఈ ఆటోమేటిక్ కార్లు మీకోసమే. బెస్ట్ ఫీచర్స్ తో రూ.5 లక్షల లోపు వచ్చే ఆటోమేటిక్ కార్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. మరి ఆ కార్ల వివరాలు చూద్దామా…

PREV
16
తక్కువ ధరలో వచ్చే ఆటోమేటిక్ కార్లు

సిటీ ట్రాఫిక్‌లో పదే పదే గేర్లు మార్చడం, క్లచ్ నొక్కడం చాలా కష్టంగా ఉంటుంది. అందుకే ఇప్పుడు చాలామంది తక్కువ బడ్జెట్‌లో వచ్చే ఆటోమేటిక్ (AMT) కార్లు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మన దేశంలో రూ.5 లక్షల లోపు ధరలో దొరికే టాప్ 5 బెస్ట్ ఆటోమేటిక్ కార్లు ఏవో ఇక్కడ తెలుసుకుందాం.

26
మారుతి సుజుకి ఎస్ ప్రెస్సో

ఇండియాలో అత్యంత తక్కువ ధరలో దొరికే ఆటోమేటిక్ కారు మారుతి సుజుకి ఎస్ ప్రెస్సో. VXI (O), VXI+ (O) వేరియంట్లలో 1.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో AMT ఆప్షన్ ఇస్తున్నారు. దీని అప్‌రైట్ సీటింగ్ పొజిషన్ వల్ల డ్రైవర్‌కు రోడ్డు క్లియర్‌గా కనిపిస్తుంది. దీని మెయింటెనెన్స్ ఖర్చు కూడా చాలా తక్కువ. ఈ కారు ప్రారంభ ధర రూ.3.49 లక్షలు.

36
రెనాల్ట్ క్విడ్

మారుతి కార్లకు ఇది బెస్ట్ ఆల్టర్నేటివ్ అని చెప్పొచ్చు. ఈ కారు వెడల్పుగా ఉండటమే కాకుండా మంచి గ్రౌండ్ క్లియరెన్స్ ఇస్తుంది. ఇందులోని 1.0-లీటర్ ఇంజిన్, AMT కాంబినేషన్ తక్కువ స్పీడ్‌లో కూడా స్మూత్ డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. గుంతల రోడ్ల మీద కూడా ఈజీగా వెళ్లొచ్చు. ఈ కారు ప్రారంభ ధర రూ. 4.52 లక్షలు.

46
మారుతి ఆల్టో K10

తక్కువ బడ్జెట్‌లో మంచి మైలేజీతో పాటు ఆటోమేటిక్ డ్రైవింగ్ సౌకర్యం కోరుకునే వారికి మారుతి సుజుకి ఆల్టో K10 మంచి ఎంపిక. 1.0-లీటర్ 3-సిలిండర్ ఇంజిన్‌తో వచ్చే ఈ కారు టాప్ వేరియంట్లలో AMT ఆప్షన్ దొరుకుతుంది. ఎయిర్‌బ్యాగ్స్ లాంటి బేసిక్ సేఫ్టీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. కారు సైజ్ కాంపాక్ట్‌గా ఉండటం వల్ల ఇరుకు సందుల్లో కూడా చాలా ఈజీగా పార్క్ చేయొచ్చు. దీని ప్రారంభ ధర రూ.3.69 లక్షలు.

56
మారుతి సెలెరియో

మైలేజ్ పరంగా ఈ హ్యాచ్‌బ్యాక్ కారుకు మంచి పేరుంది. ఇందులోని 1.0-లీటర్ AMT ఇంజిన్ లీటర్‌కు 26 కి.మీ కంటే ఎక్కువ మైలేజ్ ఇస్తుంది. ట్రాఫిక్ ఎక్కువగా ఉండే రోడ్లలో కూడా ఈజీగా డ్రైవ్ చేయొచ్చు. నలుగురు ప్రయాణికులు చాలా కంఫర్ట్‌గా కూర్చోవచ్చు. దీని ప్రారంభ ధర: రూ.4.69 లక్షలు.

66
మారుతి వ్యాగన్ ఆర్

ఈ కారు 1.0-లీటర్, 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లలో AMT ఫీచర్‌తో వస్తుంది. క్యాబిన్‌లో మంచి హెడ్‌రూమ్, స్పేస్ ఉండటం వల్ల ఫ్యామిలీకి బాగా సెట్ అవుతుంది. మారుతి సర్వీస్ నెట్‌వర్క్, తక్కువ మెయింటెనెన్స్ దీనికి అదనపు బలాలు. ఈ కారు ప్రారంభ ధర రూ.4.98 లక్షలు.

Read more Photos on
click me!

Recommended Stories