2020పైనే ఆటోమొబైల్ ఆశలు... పెరుగనున్న వెహికల్స్ ధరలు

First Published Dec 28, 2019, 3:04 PM IST

2018 పండుగల సీజన్ నుంచి విక్రయాల్లేక విలవిలలాడుతున్న ఆటోమొబైల్ పరిశ్రమ 2020పైనే ఆశలు పెట్టుకున్నది. బీఎస్-6 ప్రమాణాలతో కూడిన వాహనాల విక్రయాలు వచ్చే ఏడాది ద్వితీయార్థంలో పుంజుకుంటాయని అంచనా వేస్తున్నారు. ఫిబ్రవరి ఐదో తేదీ నుంచి 12 వరకు జరిగే ఆటో ఎక్స్ పో ఆటోమొబైల్ రంగానికి నవ జత్వాలు కలిగిస్తుందని భావిస్తున్నారు.
 

న్యూఢిల్లీ: వాహనరంగం 2020 ఆర్థిక సంవత్సరంపై ఆశలు పెట్టుకుంది. 2019లో తీవ్ర తిరోగమనం ఎదుర్కొన్న ఈ రంగం బీఎస్​-6 అప్​ గ్రేడ్​తో..సరికొత్త మోడళ్లతో వినియోగదారులను ఆకర్షించేందుకు సన్నద్ధం అవుతోంది. ఉత్పత్తి ఖర్చులు పెరుగుతుండడం వాహనరంగాన్ని కలవరపరుస్తోంది.
undefined
తీవ్ర మందగమనంలో ఉన్న వాహన రంగం నూతన ఆర్థిక సంవత్సరంపైనే ఆశలు పెట్టుకుంది. మార్కెట్లోకి నూతన, అప్​ గ్రేడెడ్​ మోడళ్లు ప్రవేశపెట్టడానికి సన్నద్ధమవుతోంది. ఆర్థికవ్యవస్థ మందగమనం నుంచి బయటపడుతుందనే అంచనాలపై వాహన పరిశ్రమ ఆశలు పెట్టుకుంది. ఇదే ప్రజలను షోరూమ్​ల వైపు నడిపిస్తుందని భావిస్తోంది.
undefined
ఇక విద్యుత్‌తో పరుగులు తీసే నూతన మోడల్ కార్లతో కొత్త ఏడాదిలో ఆటోమొబైల్ రంగం నిత్య నూతనంగా మెరవనున్నది. 2019 చేదు గుర్తులను మరిపించి విక్రయాలు జోరందుకుంటాయని ఆటోమొబైల్ పరిశ్రమ ఆశిస్తోంది.
undefined
కొత్త భద్రతా నియమాలకు అనుగుణంగా, కాలుష్యకారక ఉద్గారాల నియంత్రణకు... 'బీఎస్- 4' వాహనాలను 2020 ఏప్రిల్​ 1 నాటికి 'బీఎస్-6'కు అప్​గ్రేడ్ చేయాల్సి ఉంది. ఫలితంగా ఉత్పత్తి ఖర్చు 8 నుంచి 10 శాతం పెరుగుతుంది. దీనితో వాహనాల ఖరీదు కూడా పెరుగుతుంది. ఇది వాహనరంగానికి ఓ సవాల్​.
undefined
2020 రెండో త్రైమాసికంలో వాహన రంగం పుంజుకుంటుందని, ఫలితం మాత్రం మూడో త్రైమాసికం నుంచి కనిపిస్తుందని సియామ్ అంచనా వేస్తోంది. అదనపు వ్యయం ఒత్తిడి నుంచి ఉపశమనం కోసం వాహనాలపై జీఎస్టీ రేటును ఇప్పుడు ఉన్న 28% నుంచి 18% తగ్గించాలని సియామ్​ కోరుతోంది.
undefined
అలాగే ప్రోత్సాహక ఆధారిత- స్క్రాపేజ్​ విధానాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తిచేస్తోంది. ఇదే జరిగితే వాహన రంగం పుంజుకుంటుందని భావిస్తోంది. గత పండుగల సీజన్ నుంచి ఇప్పటి వరకు భారత వాహనరంగం తిరోగమనంలో సాగుతోంది. 2020 ఫిబ్రవరి 5వ తేదీ నుంచి 12వ తేదీ వరకు 'మోటార్ ద్వైవార్షిక ఆటో ఎక్స్​పో' జరగనుంది. ఇందులో 60కి పైగా కొత్త మోడళ్లు.. క్లీన్​, ఎలక్ట్రిక్​, హైబ్రీడ్​ 'బీఎస్-6' వాహనాలు ప్రదర్శించనున్నారు.
undefined
ఈ ఎక్స్ పోతో వాహన రంగానికి పునరుత్తేజం లభిస్తుందని ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఆశిస్తోంది. పర్యావరణ హిత, హైబ్రీడ్ వాహనాలకు ఇందులో ప్రాధాన్యం ఉంటుందని, విద్యుత్ వాహనాలు ప్రదర్శిస్తారని భావిస్తున్నారు. ఇందులో చైనాకు చెందిన గ్రేట్ వాల్ మోటార్​ కంపెనీ, ఫస్ట్ ఆటోమోటివ్ వర్క్స్ (ఎఫ్​ఏడబ్ల్యూ) భారత్ మార్కెట్లోకి అరంగేట్రం చేస్తున్నాయి.
undefined
మారుతీ సుజుకి, హ్యూండాయ్​, ఎం​ అండ్​ ఎం, టాటా మోటార్స్, కియా, స్కోడా, వోక్స్ వ్యాగన్​ ఈ ప్రదర్శనలో పాల్గొననున్నాయి. ఈ ఎక్స్​పో వాహనరంగానికి మరోమారు మంచి ఊపునిస్తుందని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్​ మాన్యుఫ్యాక్చరర్స్​ (సియామ్​​) ఆశిస్తోంది.
undefined
గత ఐదు త్రైమాసికాల్లో నష్టాలు చవిచూసిన హోండా, టయోటా, ఫోర్డ్, బీఎమ్​డబ్ల్యూ, ఆడి, లెక్సస్​, వోల్వో, జాగ్వార్​ లాండ్ రోవర్​తో సహా ద్విచక్రవాహనాల సంస్థలు హీరోమోటోకార్ప్, బజాజ్​ ఆటో, టీవీఎస్​ మోటార్స్ ఈ ఎక్స్​పోలో పాల్గొనలేకపోతుండడం గమనార్హం. ఈ ఏడాది ద్విచక్రవాహనాల నుంచి కార్లు, భారీ ట్రక్కుల వరకు ఈ రంగంలోని అన్ని విభాగాలు నష్టాలు చవిచూశాయి.
undefined
గతేడాదితో పోల్చితే 2019-20 ముగింపునాటికి హోల్​సేల్ పంపకాల్లో 13-17 శాతం క్షీణత నమోదవుతుందని అంచనా. అమ్మకాలు పడిపోవడం వల్ల చాలా సంస్థలు తీవ్రంగా నష్టపోయాయి. ఫలితంగా ఉత్పత్తి ప్రణాళికలను తిరిగి అంచనా వేయాల్సి వచ్చింది. డీలర్​షిప్​, వాహన విడిభాగాల రంగంలోనూ తిరోగమనం కారణంగా ఈ ఏడాది సుమారు 3.5 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు.2019 ఆర్థిక సంవత్సరంలో కియా మోటార్స్, ఎంజీ మోటార్​ విజయవంతం కావడం గమనార్హం.
undefined
2018 పండుగల సీజన్ తర్వాత ఇప్పటి వరకు వెహికల్స్ సేల్స్ నెమ్మదిగా సాగాయే తప్ప కోలుకుని దూసుకెళ్లలేదు. గత రెండు దశాబ్దాల్లో వాహనాల విక్రయాల్లో ఈ స్థాయిలో మందగమనం ఎప్పుడూ లేదని ఆటోమొబైల్ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. కొత్తేడాదిలో ఆటోమొబైల్ రంగానికి బాగుంటుందని వాహన తయారీదారుల సంఘం (సియామ్) అధ్యక్షుడు రాజన్ వధేరా ఆశాభావం వ్యక్తం చేశారు.
undefined
2020 మార్కెట్ ధోరణులపై మారుతి సుజుకి ఎండీ కెనిచి ఆయుకవా స్పందిస్తూ పరిశ్రమకు, తమకు 2020 మెరుగ్గా ఉంటుందన్నారు. పునరుత్తేజం ఎప్పుడు ప్రారంభమవుతుందో చెప్పలేం గానీ దీర్ఘకాల ద్రుక్పథంతో మాత్రం భారతదేశంలో ఆటోమొబైల్ రంగానికి ఉజ్వల భవితవ్యం ఉందన్నారు.
undefined
హ్యుండాయ్ మోటార్స్ ఎండీ ఎస్ఎస్ కిమ్ మాట్లాడుతూ బీఎస్ -6 ప్రమాణాలకు అనుగుణంగా పెరిగే ధరలకు, పరిస్థితులకు వినియోగదారులు అలవాటు పడేందుకు కొంత టైం పడుతుందన్నారు. ద్వితీయార్థంలో మెరుగవుతుందని చెప్పారు. హోండా కార్స్ సీఈఓ గకు నకనిషి మాట్లాడుతూ వచ్చే ఏడాది పండుగల సీజన్ నుంచి మెరుగవుతుందని అంచనా వేశారు.
undefined
ప్రస్తుతం బీఎస్-4 ఉద్గారా ప్రమాణలతో పెట్రోల్ లేదా డీజిల్ వాహనాలను విక్రయిస్తున్నారు. వచ్చే ఏప్రిల్ నుంచి బీఎస్-6 ప్రమాణాలతో రూపొందించిన వాహనాలే కొనుగోలు చేయాలని నిబంధన విధించడంతో బీఎస్-4 వాహనాలను మార్చిలోపు విక్రయించాల్సి ఉంటుంది. కనుక కంపెనీలు వాహనాల విక్రయాలపై రాయితీలు ఇస్తాయని కొనుగోలుదారులు ఎదురుచూస్తున్నారు.
undefined
click me!