లగ్జరీ ఫీచర్లు
జర్మన్ తయారీ సంస్థ A8 L లేటెస్ట్ వెర్షన్‌లో సౌకర్యాన్ని మరింత మెరుగుపరుస్తామని హామీ ఇచ్చింది. ఈ కారు వెనుక రిక్లైనర్, ఫుట్ మసాజర్ ఇతర ఫీచర్లతో వెనుక రిలాక్సేషన్ ప్యాకేజీని కూడా పొందుతుంది.
ఇంజన్ వివరాలు
కొత్త ఆడి A8 L 2022 3.0-లీటర్ TFSI పెట్రోల్ ఇంజన్ ద్వారా శక్తిని పొందుతుంది, ఈ ఇంజన్ 48V మైల్డ్-హైబ్రిడ్ సిస్టమ్ అండ్ క్వాట్రో ఆల్-వీల్-డ్రైవ్ టెక్నాలజీతో జత చేశారు. ఈ ఇంజన్ 340 హెచ్‌పి పవర్, 540 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీనితో పాటు, డ్రైవ్ డైనమిక్స్ అండ్ ఎయిర్ సస్పెన్షన్ సెటప్ బాగా మెరుగుపడినట్లు కంపెనీ హైలైట్ చేసింది.