యమహా, సుజుకి బైక్‌లకు పోటీగా బజాజ్ పల్సర్ 250 కొత్త మోడల్‌.. దీపావళి ముందే లాంచ్..

First Published | Oct 11, 2021, 5:09 PM IST

 దేశంలోని ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ బజాజ్ ఆటో పాపులర్ బైక్ పల్సర్ కొత్త జనరేషన్ మోడల్‌ను విడుదల చేయబోతోంది. నివేదిక ప్రకారం కొత్త జనరేషన్ పల్సర్ 28 అక్టోబర్ 2021న లాంచ్ కానుంది. అంటే దీపావళి పండుగకి ముందు బైక్ ప్రియులను సంతోషపరుస్తూ బజాజ్ ఈ కొత్త బైక్‌ను విడుదల చేయనుంది. అలాగే ఈ బైక్ కంపెనీ ప్రొడక్ట్ లైనప్‌లో కొత్త ఫ్లాగ్‌షిప్ మోడల్ కావచ్చు.

ఇంతకుముందు కంపెనీ పల్సర్‌తో పాటు కొత్త ప్లాట్‌ఫారమ్‌ను ఆవిష్కరిస్తుందని రాజీవ్ బజాజ్ ధృవీకరించారు. అయితే కొత్త మోడల్ పేరు, వివరాలను వెల్లడించలేదు. మరోవైపు కొత్త బజాజ్ పల్సర్ 250 కూడా కావచ్చు, దీని డిజైన్‌లో పెద్ద మార్పులను చేసింది ఇంకా ఫీచర్లు కూడా అప్‌గ్రేడ్ చేసింది. అంతేకాదు ఇండియాలో టెస్టింగ్ సమయంలో కూడా చాలాసార్లు కనిపించింది. 
 

కొత్త బజాజ్ పల్సర్ 250ని సెమీ ఫెయిర్ అండ్ నేకెడ్ వెర్షన్లలో విడుదల చేయబోతోంది. సెమీ ఫెయిర్డ్ వెర్షన్ పాత పల్సర్ 220 ఎఫ్‌కు రీప్లేస్ కావొచ్చు. లాంచ్ చేసిన తర్వాత కొత్త మోడల్ యమహా  ఎఫ్‌జెడ్25, సుజుకి జిక్సర్ 250 ట్విన్స్ వంటి బైక్‌లకు ఇండియన్ మార్కెట్లో పోటీ ఇస్తుంది. 
 


డిజైన్ అండ్ ఫీచర్లు
టెస్టింగ్ సమయంలో కనిపించే మోడల్ రాబోయే 2021 బజాజ్ పల్సర్ 250 డొమినార్ 250 నుండి ప్రేరణ పొందిన ఎల్‌ఈ‌డి హెడ్‌ల్యాంప్‌ ఉన్నట్లు  తెలుస్తుంది. దీని అల్లాయ్ వీల్స్, స్ప్లిట్ సీట్లు, స్ప్లిట్ పిలియన్ గ్రాబ్ ట్రాక్స్, బ్యాక్ కౌల్ పల్సర్ ఎన్‌ఎస్200 నుండి తీసుకోవచ్చు. ఈ బైక్ కొత్తగా డిజైన్ చేసిన అప్‌స్వీప్డ్ సైడ్ మౌంటెడ్ ఎగ్జాస్ట్‌ను కూడా పొందవచ్చు. కొత్త పల్సర్ 250లో మల్టీ  రైడింగ్ మోడ్‌లు, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో ఫుల్ డిజిటల్ కన్సోల్‌తో కూడా అందించనున్నారు.
 

ఇంజన్ అండ్ పర్ఫర్మెంస్ 
నివేదికలను నిజమైతే 2021 బజాజ్ పల్సర్ 250కి  కొత్త 220 సీసీ, సింగిల్ సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌తో అందించవచ్చు. ఈ ఇంజిన్‌లతో మరింత అధునాతన గేర్‌బాక్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఈ ఇంజిన్‌లో ఫ్యూయెల్ ఇంజెక్షన్ టెక్నాలజీని అమర్చవచ్చు, ఇంకా ఇంజన్ మునుపటి కంటే మరింత మెరుగుపర్చిన ఇంకా సమర్ధవంతంగా ఉంటుంది. బజాజ్ ఈ కొత్త బైక్‌లో డొమినార్ 250లో ఉపయోగించిన 27 బిహెచ్‌పి ఇంజిన్ ఇవ్వవచ్చు. 

బ్రేకింగ్ అండ్ సస్పెన్షన్
ముందు భాగంలో ట్రెడిషనల్ టెలిస్కోపిక్ ఫోర్క్‌లతో మోనోషాక్ రియర్ సస్పెన్షన్ యూనిట్‌ బ్రాండ్ నుండి వచ్చిన మొదటి ఎన్‌ఎస్‌ఎల్‌ఎస్ పల్సర్ కూడా కొత్త పల్సర్ 250 కావచ్చు. బ్రేకింగ్ పవర్ కోసం పల్సర్ ఎన్‌ఎస్200 వంటి బైక్ ముందు, వెనుక డిస్క్ బ్రేక్‌లను పొందుతుంది. డ్యూయల్-ఛానల్ ఏ‌బి‌ఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్) స్టాండర్డ్‌గా అందించబడుతుంది.

Latest Videos

click me!