స్టాండర్డ్ కారుతో పోలిస్తే బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ GL 110ఎంఎం పొడవైన వీల్‌బేస్‌ను పొందుతుంది. దీని వీల్‌బేస్ 2,961 ఎంఎం. మొత్తం పొడవు కూడా 110 ఎంఎం పెరిగి 4,819 ఎంఎం ఉంటుంది. అంటే స్టాండర్డ్ మోడల్ కంటే 28 ఎంఎం పొడవు ఉంటుంది. వెనుక భాగంలో 43 ఎంఎం అదనపు లెగ్‌రూమ్‌ను ఇస్తుంది. 12.3-అంగుళాల ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆండ్రాయిడ్ ఆటో అండ్ ఆపిల్ కార్‌ప్లేతో కూడిన 10.25-అంగుళాల స్క్రీన్‌తో సహా ఎన్నో ఇతర ఫీచర్లు అందించారు. వైర్‌లెస్ ఛార్జింగ్, ఎయిర్ ప్యూరిఫైయర్, త్రీ-జోన్ క్లైమేట్ కంట్రోల్, కనెక్ట్ చేసిన కార్ టెక్, 16-స్పీకర్ హార్మన్ కార్డాన్ ఆడియో సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్ కూడా ఉన్నాయి.