కియా సోనెట్ SUV డీజిల్ కారు మెయింటెనెన్స్ ఖర్చు మార్కెట్లో ఉన్న ఇతర కార్ల కంటే 14 శాతం తక్కువ. కియా సోనెట్ SUV మెయింటెనెన్స్ ఖర్చు పెట్రోల్ మోడల్‌లోని ఇతర కార్ల కంటే 16 శాతం తక్కువ. ఈ కారు మొత్తం ధర డీజిల్ మోడల్‌పై 10 శాతం వరకు ఇంకా పెట్రోల్ మోడల్‌పై 4 శాతం వరకు తగ్గుతుంది.
సంవత్సరానికి కనీసం 10,000 కిలోమీటర్లు పైగా ప్రయాణించే Kia Sonet యజమానుల మధ్య ఈ సర్వే నిర్వహించబడింది. ఈ కారు డీజిల్ మోడల్ కూడా ఇతర కంపెనీ మోడల్స్ కంటే ఎక్కువ మైలేజీని ఇచ్చే కారు. ఇతర కార్లతో పోలిస్తే పెట్రోల్ కారు మైలేజ్ మూడవ స్థానంలో ఉంది.
కియా సొనెట్ పెట్రోల్ డీజిల్ అనే రెండు ఇంజన్ ఆప్షన్‌లతో వస్తుంది. 1.2-లీటర్ అండ్ 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ అప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. డీజిల్ కారులో 1.5 లీటర్ ఇంజన్ అందించారు. 360 డిగ్రీ కెమెరా, ADAS, బ్యాక్ పార్కింగ్ సెన్సార్, ఆటో ఎమర్జెన్సీ బ్రేక్ వంటి అద్భుతమైన సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.
పెట్రోల్ ఇంజన్ మోడల్ ఎక్స్-షోరూమ్ ధర రూ.7.79 లక్షల నుండి రూ.13.89 లక్షల వరకు ఉంటుంది. డీజిల్ ఇంజన్ మోడల్ ఎక్స్-షోరూమ్ ధర రూ.9.95 లక్షల నుంచి రూ.14.89 లక్షల మధ్య ఉంటుంది. ఇప్పుడు బుక్ చేసుకునే వారికి వచ్చే ఏడాది 2024 ప్రారంభంలో డెలివరీ ఉండనున్నట్లు కనిపిస్తోంది.
కియా సొనాటా టాటా నెక్సాన్, హ్యుందాయ్ వెన్యూ, మారుతి సుజుకి బ్రెజ్జా, మహీంద్రా ఎక్స్‌యూవీ 300 ఇంకా నిస్సాన్ మెగానైట్‌లతో పోటీ పడుతుందని భావిస్తున్నారు.