దీపావళి పండగ వచ్చేస్తోంది. ఈ పండగను చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ సంతోషంగా జరుపుకుంటారు. ఇంటి మొత్తాన్ని దీపాలు, పూలతో అలంకరిస్తారు. దేశవ్యాప్తంగా ఈ పండగను భారతీయులు ఆనందంగా జరుపుకుంటారు. ఈ పండగ వేళ.. క్రాకర్స్ కాలుస్తూ పిల్లలు సందడి చేస్తారు. అంతేకాకుండా... కొందరు తమకు నచ్చిన వారికి బహుమతులు కూడా ఇస్తూ ఉంటారు. మరి ఈ దీపావళి పండగకు... ఏ రాశివారికి ఊహించని బహుమతులు అందనున్నాయో ఓసారి చూద్దాం...