ఈ రాశులవారు చాలా మానిప్యూలేటివ్..!

First Published | May 30, 2023, 10:07 AM IST

దాంపత్య జీవితంలోనూ తమ భాగస్వామి విషయంలోనూ చాలా దారుణంగా, మానిప్యూలేటివ్ గా ఉంటారు కొన్ని రాశులవారు. జోతిష్యశాస్త్రం ప్రకారం అలాంటి రాశులేంటో ఓసారి చూద్దాం...

Zodiac Sign-These people lose their feelings honestly


మనచుట్టూ ఉన్న అందరూ నిజాయితీపరులు అనుకోవడం మన పొరపాటు. అందరూ మంచివారే ఉండరు. ముంచేవారు కూడా ఉంటారు. ముఖ్యంగా మానిప్యూలేటివ్ గా ఉంటారు. తిమ్మిని బొమ్మిని చేయగల నేర్పరులు ఉంటారు. దాంపత్య జీవితంలోనూ తమ భాగస్వామి విషయంలోనూ చాలా దారుణంగా, మానిప్యూలేటివ్ గా ఉంటారు కొన్ని రాశులవారు. జోతిష్యశాస్త్రం ప్రకారం అలాంటి రాశులేంటో ఓసారి చూద్దాం...
 

telugu astrology

1.మిథున రాశి..

మిథున రాశివారు ద్వంద్వ స్వభావం కలిగి ఉంటారు. అన్ని పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకోవడంలో వీరు సమర్థులు. దాని కోసం ఇతరులను మోసం చేయడంలో ఈ రాశులవారు ముందుంటారు. తమ ప్రయోజనం కూడా వీరు ఏదైనా చేస్తారు. అన్ని పరిస్థితులను తమకు అనుకూలంగా ఎలా మార్చుకోవాలో ఈ రాశివారికి బాగా తెలుసు.
 


telugu astrology

2.సింహ రాశి...

సింహరాశి వారు అందరి శ్రద్ధ తమపై ఉండాలని అనుకుంటూ ఉంటారు. వారికి ప్రశంసలు అందుకోవడం ఇష్టం. దాని కోసం ఏదైనా చేయడంలో వీరు ముందుంటారు. తమ భాగస్వామి కూడా నిత్యం తమ కంట్రోల్ లో ఉండాలని వీరు అనుకుంటూ ఉంటారు. తమ ఆధిపత్యం చెలాయించుకోవడం కోసం వీరు ఎన్ని అవకతవకలైనా చేస్తారు. 
 

telugu astrology

3తుల రాశి..

వారు తమ సంబంధాలలో సామరస్యాన్ని, సమతుల్యతను విలువైనదిగా భావిస్తారు, కానీ వారి అవసరాలు తీరనప్పుడు మాత్రం ప్రతీకారం పెంచుకుంటారు. దాని కోసం ఏదైనా చేస్తారు. ఇతరులను మానిప్యూలేట్ చేస్తారు. ప్రతిదీ తమ దృక్కోణం నుంచే ఆలోచిస్తారు. ఇతరుల కోణంలో ఆలోచించాలని వారు అనుకోరు. తమ మాటలతో మాయ చేసి ఇతరులను ఒప్పిస్తారు. 

telugu astrology

4.వృశ్చిక రాశి..
వారు వారి తీవ్రమైన భావోద్వేగాలు, అభిరుచికి ప్రసిద్ధి చెందారు. ఈ లక్షణాలను సానుకూలంగా మార్చినప్పుడు, వృశ్చిక రాశివారు మంచిగానే కనపడతారు. కానీ వీరిలో ఓ చీకటి కోణం ఉంటుంది. వీరిలో స్వార్థం చాలా ఎక్కువ. వీరికి అసూయ కూడా చాలా ఎక్కువ. అందరినీ మానిప్యూలేట్ చేయడంలో ముందుంటారు. 

telugu astrology

5.మకర రాశి..

వారు తరచుగా వారి ఆశయం, విజయం కోసం చాలా కష్టపడతారు. ఇది మంచి విషయమే. కానీ  సంబంధాలలో, ఇది మానిప్యులేటివ్ ప్రవర్తనకు దారి తీస్తుంది, ఎందుకంటే వారు తమ భాగస్వాముల భావాలు, అవసరాల కంటే వారి లక్ష్యాలకు ప్రాధాన్యతనిస్తారు. మకరరాశి వారు ఆలోచలను ఒక్కోసారి చాలా దుర్మార్గం ఉంటాయి. 

Latest Videos

click me!