కొంతమంది అప్రయత్నంగా అబద్ధాలు చెప్పగలరు. వారు అబద్ధం చెప్పినప్పుడు కొంచెం కూడా తొనకరు, బెనకరు. ఈ వ్యక్తులకు నిజాయితీ గురించి నిజంగానే పట్టింపు ఉండదు. ఎందుకంటే వారు ఎల్లప్పుడూ క్లిష్ట పరిస్థితుల నుండి బయట పడటానికి ఒక మార్గం కోసం చూస్తుంటారు లేదా తమను తాము రక్షించుకుంటారు. ఇతరులను మోసం చేయడంలో కూడా నేర్పరులు. మరి జోతిష్యశాస్త్రం ప్రకారం ఆ రాశులేంటో ఓసారి చూద్దాం...
Zodiac Sign
1.మిథున రాశి..
మిథున రాశివారు మాటలతోనే మాయాజాలం చేసేస్తారు. ఈ నైపుణ్యం కొన్నిసార్లు మోసపూరిత ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు. వీరు చాలా తెలివిగలవారు. ఇది వారిని చాలా నమ్మదగిన అబద్ధాలకోరుగా చేస్తుంది. వారు కూడా ద్వంద్వ వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. వారు చెప్పేది వింటే ఎవరైనా అది నిజమనే అనుకుంటారు. అబద్దం అని కనీసం గ్రహించలేరు.
Zodiac Sign
2.తుల రాశి..
తుల రాశివారు అన్ని విషయాల్లోనూ చాలా బ్యాలెన్స్డ్ గా ఉంటారు. కానీ ఈ రాశివారు కూడా అబద్ధాలు చాలా ఎక్కువగా చెబుతారు. కొన్ని సార్లు నిజం దాటేయడానికి, కొన్ని సార్లు విషయం దాచిపెట్టడానికి, కొన్ని సార్లు తమ స్వార్థం కోసం అబద్ధాలు చెబుతూ ఉంటారు.కొన్నిసార్లు ఒత్తిడితో కూడిన పరిస్థితిని నివారించడానికి వారు అబద్ధం చెబుతూ ఉంటారు.
Zodiac Sign
3.వృశ్చిక రాశి..
ఈ రాశివారు చాలా ఎమోషనల్ గా ఉంటారు. వీరి దగ్గర చాలా రహస్యాలు ఉంటాయి. వీరు సత్యాన్ని దాచడంలో ముందుంటారు. వారి లక్ష్యాలను సాధించడానికి ఇతరులను తారుమారు చేయడంలో కూడా ముందుంటారు.వీరు చాలా చమత్కారంగా మాట్లాడతారు. కానీ కచ్చితంగా అబద్దాలు చెబుతారు.
Zodiac Sign
4.ధనస్సు రాశి..
ధనుస్సు రాశివారు సాహసాన్ని ఇష్టపడతారు. మనసుతో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. వారు కూడా ప్రజల మధ్య ఉండటాన్ని ఇష్టపడతారు. ఇతరులను ఆకట్టుకోవడానికి కూడా వీరు నిజాలు దాచిపెట్టి, అబద్ధాలు చెబుతూ ఉంటారు, ఈ రాశివారు చాలా సార్లు నిజాలను బయటపెట్టరు. ఇతరులను ఆకర్షించాలంటే అబద్దాలు చెప్పాలి అనేద వీరి అభిప్రాయం. కథలు కథలుగా అల్లి మరీ చెబుతుంటారు.
Zodiac Sign
5.మీన రాశి..
వారు వారి సృజనాత్మకత, ఊహకు ప్రసిద్ధి చెందారు, ఇది కొన్నిసార్లు కథలను రూపొందించడానికి లేదా సత్యాన్ని అతిశయోక్తి చేయడానికి దారి తీస్తుంది. వారి సానుభూతిగల స్వభావం ఒకరి భావాలను విడిచిపెట్టడానికి అబద్ధాలు చెప్పడంలో నైపుణ్యం కలిగిస్తుంది.
ఈ రాశుల వారు చాలా నిజాయితీపరులు
మేషం, వృషభం, కర్కాటకం, సింహం, కన్య, మకరం, కుంభరాశి వారు చాలా నిజాయితీగా ఉంటారు. ఎంత అవసరం వచ్చినా కూడా వీరు అబద్ధం చెప్పరు. వారు తమ నిజాయితీకి అండగా నిలుస్తారు. ఇతరులను కూడా అలా చేయమని ప్రోత్సహిస్తారు.