ఈ రాశివారికి నిత్యం ఆందోళన కలిగించే విషయం ఏంటో తెలుసా..?

Published : Oct 21, 2021, 11:40 AM ISTUpdated : Oct 21, 2021, 11:42 AM IST

నిత్యం ఆనందంగా, సంతోషంగా ఉండేవారికైనా ఏదో ఒక విషయం భయాన్ని, ఆందోళనను కలిగిస్తుంది. జోతిష్య శాస్త్రం ప్రకారం.. అలాంటి రాశులేంటో చెప్పేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో చూద్దామా..  

PREV
113
ఈ రాశివారికి నిత్యం ఆందోళన కలిగించే విషయం ఏంటో తెలుసా..?
Worried guy

ఈ ప్రపంచంలో ఏ ఒక్కరి జీవితం పూల పాన్పు కాదు. మధ్యలో రాళ్లు, ముళ్లులు తగులుతూనే ఉంటాయి. అలా కాకుండా.. నిత్యం ఆనందంగా, సంతోషంగా ఉండేవారికైనా ఏదో ఒక విషయం భయాన్ని, ఆందోళనను కలిగిస్తుంది. జోతిష్య శాస్త్రం ప్రకారం.. అలాంటి రాశులేంటో చెప్పేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో చూద్దామా..

213

మేష రాశి..
ఈ రాశివారు.. జీవితంలో ముందుకు వెళ్లడానికి చాలా కష్టపడుతూ ఉంటారు. అయినప్పటికీ తాను అనుకున్నది సాధించగలనా లేదా అనే కంగారు వీరిలో ఎక్కువగా ఉంటుంది. ఈ ఆందోళన వీరిని నిత్యం వేధిస్తూ ఉంటుంది.
 

313


వృషభ రాశి..
 ఈ రాశివారు ఎప్పుడూ ఆనందంగా ఉండాలని అనుకుంటారు. అయితే.. తాము ఆనందం ఎప్పుడూ వెంటనే ఆవిరైపోతుందేమో.. తాము మంచి అనుకన్నదంతా దూరమైపోతుందేమో అని భయపడుతూ ఉంటారు.
 

413


మిథున రాశి..

ఈ రాశివారికి అనవసర విషయాలకు డబ్బులు ఖర్చు చేయడం పెద్దగా నచ్చదు. అంతేకాకుండా.. ఇతరుల దగ్గర డబ్బుల కోసం ఆధారపడటం కూడా వీరికి తీవ్ర ఆందోళన కలిగిస్తూ ఉంటుంది.

513

కర్కాటక రాశి..
ఈ రాశివారు నిత్యం కుటుంబసభ్యులు, స్నేహితుల గురించి ఆలోచిస్తూ ఉంటారు. ముఖ్యంగా వారి ఆరోగ్యం గురించి ఎక్కువగా ఆందోళన పడుతుంటారు.

613

సింహ రాశి..

ఈ రాశివారు తమను తాము ఎల్లప్పుడూ గొప్ప, అద్భుతమైన వ్యక్తిగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. కాబట్టి.. ఈ విషయంలో ఈ రాశివారు ఎప్పుడూ ఆందోళన పడుతూ ఉంటారు.

713

కన్య రాశి..
ఈ రాశివారు తమ జీవితంలో అన్ని విషయాల్లో చాలా పర్ఫెక్ట్ గా ఉంటారు. చాలా కష్టపడతారు. అయినప్పటికీ.. ఫెయిల్ అవుతామోనని వీరు భయపడుతూ ఉంటారు.

813

తుల రాశి..
ఈ రాశివారు. తమ జీవితంలో తాము కోరుకున్న వ్యక్తి దొరకడేమోనని..తమ జీవితం ఇక ఒంటరిగా  మిగిలిపోతుందేమోనని భయపడుతుంటారు.

913

వృశ్చిక రాశి..
ఈ రాశివారు ప్రతి  ఒక్కరికీ సహాయం చేస్తూ ఉంటారు. అయినా కూడా.. వారు తమను వదిలేసి వెళ్లిపోతుంటే.. తీవ్రంగా ఆందోళన చెందుతుంటారు.

1013

ధనస్సు రాశి..
ఈ రాశివారు తమను ఎదుటివారు ఎక్కడ తక్కువగా చూస్తుంటారా అని ఆందోళన పడుతుంటారు. మీ లుక్స్, పర్సనాలటీ  అందరికీ నచ్చదేమో అని భయపడుతుంటారు.

1113

మకర రాశి..
ఈ రాశివారు ఎప్పుడూ తమ ప్రొఫెషనల్ ఇమేజ్ ని కాపాడుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. దానికి ఎవరివల్ల అయినా డ్యామేజ్ జరుగుతుందా అని భయపడుతూ ఉంటారు.

1213

కుంభ రాశి..
ఈ రాశివారు తమకు తెలిసి కూడా లేదా.. ఎవరైనా హెచ్చరికలు జారీ చేసిన తర్వాత కూడా.. తప్పు చేస్తామేమోననని భయపడుతూ ఉంటారు.

1313

మీన రాశి..
ఈ రాశివారు తమ గురించి ఎదుటివారు ఏమని ఆలోచిస్తున్నారు అనే విషయం గురించి తెగ కంగారుపడుతూ ఉంటారు. నిత్యం ఇదే విషయం గురించి ఆలోచిస్తూ ఆందోళన పడుతుంటారు. 

click me!

Recommended Stories