
1.మేష రాశి..
మేష రాశివారు ఎవరినైనా ఇష్టపడితే అందరిముందూ ఆ ప్రేమను చూపించడానికి ఇష్టపడతారు. చాలా ప్రౌడ్ గా ఫీలౌతారు. వారి చుట్టూ తిరుగుతూ తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తారు.
2.వృషభ రాశి..
వృషభ రాశివారు ఎవరినైనా ఇష్టపడితే... ఆ వ్యక్తి చుట్టూ తిరుగుతూ ఉంటారు. నీడలాగా వారి చుట్టూ మాత్రమే ఉంటారు. వారి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు.
3.మిథున రాశి..
మిథున రాశివారు ఎవరినైనా ఇష్టపడితే వారి పట్ల చాలా ఆసక్తి చూపిస్తారు. వారి గురించి తెలుసుకోవడానికి ఎక్కువ ప్రయత్నిస్తారు. వారి గురించి ప్రశ్నలు అడుగుతూనే ఉంటారు.
4.కర్కాటక రాశి..
కర్కాటక రాశివారు ఎవరినైనా ఇష్టపడితే... తాము ప్రేమించిన వారు కనపడగానే వారి ముందు సిగ్గుపడతారు. ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ ఉంటారు.
5.సింహ రాశి..
సింహ రాశివారు ఎవరినైనా ఇష్టపడితే... వారి ముందు షో ఆఫ్ చేస్తారు. చాలా ప్రొటెక్టివ్ గా ఉంటారు. వారి విషయంలో చాలా జాగ్రత్త వహిస్తారు.
6.కన్య రాశి..
కన్య రాశివారు ఎవరినైనా ఇష్టపడితే వారికి అవసరం అయినా... అవసరం లేకపోయినా సహాయం చేస్తారు. గైడ్ చేస్తూ ఉంటారు. ఎలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్తపడుతూ ఉంటారు.
7.తుల రాశి..
తుల రాశివారు ఎవరినైనా ఇష్టపడితే.... వారికి తమ హ్యాపీ సైడ్ ని ఎప్పుడూ చూపించుకోవాలని అనుకుంటూ ఉంటారు. ఫ్లర్ట్ చేస్తూ ఉంటారు.
8.వృశ్చిక రాశి..
వృశ్చిక రాశివారు ఎవరినైనా ఇష్టపడితే వారిని ఆరాధిస్తూ ఉంటారు. అంతేకాదు... వారి చుట్టూనే తిరుగుతూ ఉంటారు.
9.ధనస్సు రాశి..
ఈ రాశివారు ఎవరినైనా ఇష్టపడితే వారిని ఫ్లర్ట్ చేస్తూ ఉంటారు. వారిని స్పెషల్ గా చూస్తారు. వారికి అవసరం లేకపోయినా అన్ని పనులు చేసి పెడుతూ అపురూపంగా చూసుకుంటారు.
10.మకర రాశి..
మకర రాశివారు ఎవరినైనా ఇష్టపడితే,.. వారిని ఎప్పుడూ మోటివేట్ చేస్తూ... ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. వారిని ది బెస్ట్ గా చూపించడానికి ప్రయత్నిస్తారు
11.కుంభ రాశి..
కుంభ రాశివారు ఎవరినైనా ఇష్టపడితే..... వారు ఎదురైన ప్రతిసారి ఈ రాశివారి ముఖం వెలిగిపోతుంది. చాలా మురిసిపోతారు. వారు మిమ్మల్ని గుర్తించాలి అని ప్రయత్నిస్తారు.
12.మీన రాశి..
మీన రాశివారు ఎవరినైనా ఇష్టపడితే వారి పట్ల చాలా కేరింగ్ , ఎఫెక్షన్ చూపిస్తారు. వారికి అవసరమైన ప్రతిసారి తోడుగా ఉంటారు.