Yuti Yoga: జులై నెలలో మూడుసార్లు యుతి యోగం..5 రాశులకు అనుకోని కష్టాలు తప్పవు..!

Published : Jun 30, 2026, 10:47 AM IST

Yuti Yoga: జులై నెలలో అరుదైన యుగం మూడుసార్లు ఏర్పడనుంది. దీని అశుభ ప్రభావం ప్రధానంగా 5 రాశుల వారి జీవితాలపై కనిపిస్తుంది. కాబట్టి, యుతి యోగం ఏర్పడటం వల్ల కష్టాలు అనుభవించే 5 రాశులు ఏంటో చూద్దాం.. 

PREV
15
మేష రాశి..

జులైలో యుతి యోగం ఏర్పడటం వల్ల మేష రాశిలో జన్మించిన వారికి అనుకోని కష్టాలు తప్పవు. ఈ కాలంలో ఇంటి పనుల కారణంగా ఎక్కువ తిరగాల్సి రావచ్చు. అదేవిధంగా, యుతి యోగం అశుభ ప్రభావం వల్ల సరిగ్గా ఆలోచించలేరు. ఇతరుల సలహాలు కూడా వినకుండా పెట్టుబడులు పెడితే.. నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి.. ఈ నెలలో జాగ్రత్తగా ఉండాలి. పనిభారం పెరుగుతుంది. ఏదైనా విజయం సాధించడానికి చాలా ఎక్కువ కష్టపడాల్సి రావచ్చు.

25
మిథున రాశి..

జులై నెలలో యుతి యోగం అశుభ ప్రభావం కారణంగా మిథున రాశివారు పెట్టుబడుల నుంచి ఆర్థిక నష్టాలను ఎదుర్కునే అవకాశం ఉంది. అనుకోని ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. కానీ, దీని వల్ల ఎక్కువ ఖర్చులు రావచ్చు. ఏదో ఒక కారణం చేత కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు, గొడవలు జరిగే అవకాశం ఉంది. అందుకే... ఈ నెలలో ఈ రాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి.

35
కన్య రాశి...

జులై నెలలో ఏర్పడే మూడు యుతి యోగాల కారణంగా, కన్య రాశి వారికి ఈ నెలలో విపరీతంగా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. దీని వల్ల ఈ నెలలో ఈ రాశివారికి ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ఇతరుల నుంచి ఎక్కువగా ఆశించడం మంచిది కాదు. మీ కింద పనిచేసేవారు కూడా మీ మాట వినడానికి ఇష్టపడకపోవచ్చు. ఎవరినీ గుడ్డిగా నమ్మకూడదు. వ్యక్తిగత సమాచారం ఎవరితోనూ పంచుకోకూడదు.

45
తుల రాశి...

తుల రాశి యుతి యోగం అశుభ ప్రభావం కారణంగా తమ కోపాన్ని కంట్రోల్ లో ఉంచుకోవాలి. లేకపోతే.. మీరు ఏదో ఒక పెద్ద కష్టం లేదా సమస్యల్లో చిక్కుకునే అవకాశం ఉంది. ఈ కాలంలో అనుకోని ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. ఆ ప్రయాణాల వల్ల కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఈ సమయంలో ప్రయాణాలు చేయకూడదు. గొంతు సంబంధిత సమస్యలు రావచ్చు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆకస్మిక ఖర్చుల భారం కూడా పెరగొచ్చు.

55
మకర రాశి..

యుతి యోగం కారణంగా జులై నెలలో మకర రాశివారికి ఉద్యోగ, వ్యాపారాల్లో కొత్త అవకాశాలు వస్తాయి. కానీ, ఈ కొత్త అవకాశాల కారణంగా ఎక్కువ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఎవరికైనా అప్పు ఇచ్చినా.. ఆ డబ్బు తిరిగి మీకు రాకపోవచ్చు. దీని వల్ల మీ ఒత్తిడి మరింత పెరుగుతుంది. పెద్ద ఇబ్బందుల్లో ఇరుక్కునే అవకాశం ఉంది.అశుభ యోగ ప్రభావం కారణంగా.. అదృష్టం తగ్గుతుంది. మనసులో చాలా విచారంగా ఉంటుంది. అందుకే... ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

Read more Photos on
click me!

Recommended Stories