
1.మేష రాశి..
మేష రాశివారు తమ తోడబుట్టిన వారితో ప్రతి విషయంలో పోటీపడుతుంటారు. తమ తోడబుట్టినవారిపై ఇలా పోటీపడి పగతీర్చుకోవాలని వీరు అనుకుంటూ ఉంటారు. ఈ రాశికి చెందిన వారు తమ తోడబుట్టిన వారిపై దాదాపు డామినేటింగ్ గా ఉంటారు. ప్రతి దీ తామే ముందు దక్కించుకోవాలని అనుకుంటూ ఉంటారు.
2.వృషభ రాశి..
వృషభ రాశికి చెందిన వారు చాలా డౌన్ టూ ఎర్త్ ఉంటారు. ఎంత ఎదిగినా ఒదిగే ఉండే స్వభావం కలిగి ఉంటారు. ఈ రాశివారు తమ తోడబుట్టిన వారికి నిజాయితీగా ఉంటారు. వీరు కాస్త మొండిగానే ఉంటారు. కానీ... వారు తమ తోడబుట్టినవారి కోసం అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటారు.
3.మిథున రాశి..
మిథున రాశివారు తమ తోడబుట్టిన వారితో ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. జీవితంలో వారు ఏ స్థాయిలో ఉన్నా... తమ తోడబుట్టిన వారికి అండగా ఉంటారు. వీరు ఎప్పుడూ తమ కుటుంబాడన్ని అస్సలు వదిలిపెట్టరు.
4.కర్కాటక రాశి..
కర్కాటక రాశికి చెందిన వారు తమ తోడబుట్టిన వారి పట్ల చాలా ఎమోషనల్ గా ఉంటారు. వీరు చాలా గొప్ప లిజనర్స్. తమ తోడబుట్టిన వారికి ఎలాంటి సహాయం చేయడానికైనా వీరు ముందుంటారు. గొప్ప సలహాలు ఇవ్వడంలో ముందుంటారు.
5.సింహ రాశి...
సింహ రాశివారు నిజానికి ఎదుటివారిని డామినేటింగ్ చేయగల వ్యక్తిత్వం కలిగి ఉంటారు. కానీ.. తమ తోడబుట్టివారి పట్ల మాత్రం చాలా దయతో ఉంటారు. కోపం వస్తే... చాలా ర్యాష్ గా మాట్లాడతారు.
6.కన్య రాశి..
కన్య రాశివారు.... తమ తోడపుట్టిన వారి విషయంలో చాలా నిజాయితీగా ఉంటారు. వారికి నిజాయితీగా ఫీడ్ బ్యాక్ ఇస్తారు. తమ తోడబుట్టిన వారికి నిత్యం వెనకే ఉంటూ... వారికి ఏం చేయాలో... ఏం చేయకూడదో చెబుతూ ఉంటారు.
7.తుల రాశి...
తుల రాశివారు రిలేషన్స్ లో బ్యాలెన్సింగ్ ఎలా చేయాలో వీరికి బాగా తెలుసు. వీరు కూడా అంతే... తమ సోదరులకు మంచి సలహాలు ఇస్తూ ఉంటారు. వారు జీవితంలో మంచి స్థాయికి ఎదిగేలా సహాయం చేస్తారు.
8.వృశ్చిక రాశి..
వృశ్చిక రాశివారు చాలా నిజాయితీగా ఉంటారు. వీరికి తమ తోడబుట్టినవారంటే విపరీతమైన ప్రేమ. వీలైనప్పుడల్లా.. వీరు తమ సోదరులపై ప్రేమ కురిపిస్తూనే ఉంటారు.
9.ధనస్సు రాశి..
ధనస్సు రాశివారు చాలా సాహసోపేతంగా ఉంటారు. ఈ రాశివారు తమ తోడబుట్టిన వారితో ఎప్పుడూ సరదాగా ఉంటారు. చాలా స్పాంటేనియస్ గా మాట్లాడగగలరు. అయితే వీరి చర్యలు మాత్రం ఊహాతీతంగా ఉంటాయి.
10.మకర రాశి..
మకర రాశికి చెందిన వారు నిత్యం లాజిక్ గా, రీజనబుల్ గా ఉంటారు. ఈ రాశివారు తమ సోదరరులను చాలా ఆర్గనైజ్డ్ గా ఉండేలా సహాయం చేస్తారు. తమ సోదరుల కోసం ఏది చేయడానికైనా వీరు ముందుంటారు.
11.కుంభ రాశి..
కుంభ రాశివారికి క్రియేటివిటీ చాలా ఎక్కువ. వీరు తమ తోడబుట్టివారికి తమ క్రియేటివిటీ అంతా చూపించాలని అనుకుంటూ ఉంటారు. వీరు స్వతంత్రంగా ఉంటారు. ప్రపంచం ఏమన్నా.. తమ తోడబుట్టిన వారికి మాత్రం అండగా ఉంటారు.
12.మీన రాశి..
మీన రాశివారు తమ తోడబుట్టిన వారితో చాలా ప్రేమగా ఉంటారు. తమ కు తోడబుట్టిన వారు మాత్రం ఉండటం వారు చాలా బెస్ట్ ఫీలింగ్ లా భావిస్తారు. ఈ రాశివారు తమ సోదరులకు మొదట ప్రాధాన్యత ఇస్తారు. వారి నుంచి కూడా అదే కోరుకుంటారు.