రాత్రిపూట కర్పూరంలో ఇది వేసి కాల్చితే ఏమౌతుందో తెలుసా?

First Published | Aug 10, 2024, 1:34 PM IST

అది కూడా.. శనివారం రాత్రి పూట కనుక.. కర్పూరంలో ఒక బిర్యానీ ఆకు వేసి కాల్చాలట. అలా చేయడం వల్ల మన జీవితంలోని చాలా సమస్యలను  తరిమికొట్టేయవచ్చట.
 

కర్పూరం చాలా స్వచ్ఛంగా ఉంటుంది.  మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని కూడా చాలా ప్రశాంతంగా మారుస్తుంది.  అందుకే  ప్రతి ఒక్కరూ పూజ చేసే సమయంలో కర్పూరాన్ని వెలిగిస్తూ ఉంటారు. పూజ సమయంలో కాకపోయినా.. నార్మల్ గా కూడా... ఇంట్లో కర్పూరం వెలిగిస్తూ ఉంటారు.  అదేవిధంగా.. బిర్యానీ ఆకు కూడా చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. మరి.. ఈ రెండింటినీ కలిపి...ఇట్లో కాల్చడం వల్ల..వాస్తు ప్రకారం.. మనకు చాలా ప్రయోజనాలు కలుగుతాయట. మరి.. ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో  నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం...

అది కూడా.. శనివారం రాత్రి పూట కనుక.. కర్పూరంలో ఒక బిర్యానీ ఆకు వేసి కాల్చాలట. అలా చేయడం వల్ల మన జీవితంలోని చాలా సమస్యలను  తరిమికొట్టేయవచ్చట.


camphor image

శనివారం  రాత్రి సమయంలో కనుక కర్పూరంలో బిర్యానీ ఆకులను కాల్చడం వల్ల... కెరీర్ లో ఏవైనా అడ్డంకులు ఉంటే.. ఆ అడ్డంకులు తొలగిపోతాయట. డబ్బు విషయంలో కూడా ఏవైనా అడ్డంకులు ఉంటే.. అవి కూడా తొలగిపోతాయట.

camphor

అంతేకాదు... ఎవరైనా ఆర్థిక సమస్యలతో ఇబ్బందిపడుతూ ఉంటే.. ఈ కర్పూరంతోపాటు బిర్యానీ ఆకును కాల్చాలి. ఇలా చేయడం వల్ల.. ఇంట్లో డబ్బుకు కొదవ ఉండదు. ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి.

ఇంట్లో శనివారం రాత్రిపూట కర్పూరంలో బిర్యానీ ఆకును చేర్చి కాల్చాలి. ఇలా చేయడం  వల్ల ఇంట్లో ఏవైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా పూర్తిగా తొలగిపోతుంది. అంతేకాకుండా.. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ కూడా పెరుగుతుంది.

కొందరు తాము ఎంత కష్టపడినా.. చేతిలో డబ్బు నిల్వదు. ఇలా కనుక మీరు బాధపడుతున్నట్లయితే..శనివారం రాత్రి కచ్చితంగా కర్పూరంతో, బిర్యానీ ఆకుతో కాల్చాలి. ఇలా చేయడం వల్ల... మీ చేతిలో ఎప్పుడూ డబ్బు ఉంటుంది. డబ్బుకు లోటు ఉండదు.

చాలా మంది ఇంట్లో ఎవో ఒకటి గొడవలు జరుగుతూ ఉంటాయి. ఆ గొడవల కారణంగా ఇంట్లో మనశ్శాంతి ఉండదు. ఏదో ఒక సమస్యలు వస్తూనే ఉంటాయి. కానీ..  ఈ కర్పూరంతో బిర్యానీ ఆకు కాల్చడం వల్ల.. ఆ సమస్యలు రాకుండా ఉంటాయి. ఇంట్లో ఎలాంటి గొడవలు అయినా తగ్గి.. ఇళ్లు ప్రశాంతంగా ఉంటుంది. దంపతుల మధ్య సమస్యలు ఉన్నా తొలగిపోవడం, చెడు దృష్టి ఏదైనా తగిలినా అది కూడా పోతుంది. కాబట్టి.. ఈ రెమిడీని కచ్చితంగా ఫాలో అవ్వమని నిపుణులు సూచిస్తున్నారు.

Latest Videos

click me!