ధనస్సు రాశివారు బాసిజం చేయగలరా?

First Published | Apr 21, 2023, 11:39 AM IST

వారు తమ బృందాన్ని ఎక్కువ పనిచేసేలా.. అత్యంత విశ్వాసం, సానుకూలతతో ప్రాజెక్ట్‌లను అమలు చేయడానికి వారిని ప్రేరేపించగలరు వారు సాహసాలను ఎక్కువగా ఇష్టపడతారు.

Sagittarius
ధనస్సు రాశివారు స్వేచ్ఛకు ఎక్కువ విలువ ఇస్తారు. ఈ రాశివారికి జీవితం పట్ల ఆశావాద దృక్పథాన్ని కలిగి ఉంటారు. దాదాపు ఈ రాశివారిని తమ చుట్టూ ఉన్నవారు నిత్యం ప్రశంసిస్తూనే ఉంటారు. ఈ రాశివారు దాదాపు ప్రశాంతమైన జీవితాన్ని గడపడాన్ని ఇష్టపడతారు. దానికోసం ఎన్ని సమస్యలు ఉన్నా వాటిని పక్కన పెట్టేస్తూ ఉంటారు. మరి అలాంటి మనస్తత్వం ఉన్న ఈ రాశివారు.. బాస్ గా మారితే..? తమ కింది ఉద్యోగులతో ఎలా ప్రవర్తిస్తారు..? బాసిజం చూపించగలరో లేదో ఓసారి చూద్దాం...

ధనస్సు రాశివారి మనసు చాలా గొప్పది. వీరిని ఎవరైనా సరే ఇట్టే ఇష్టపడతారు, అభిమానిస్తారు. ఉన్నత హోదాలో ఉన్నప్పటికీ.. వారు చాలా సానుకూలంగా ఆలోచిస్తారు. ధనుస్సు రాశి అధికారులు వారి ఆశావాద,  సానుకూల ప్రవర్తనకు ప్రసిద్ధి చెందారు. వారు తమ బృందాన్ని ఎక్కువ పనిచేసేలా.. అత్యంత విశ్వాసం, సానుకూలతతో ప్రాజెక్ట్‌లను అమలు చేయడానికి వారిని ప్రేరేపించగలరు వారు సాహసాలను ఎక్కువగా ఇష్టపడతారు.  రిస్క్ తీసుకునే విషయానికి వస్తే, వారు కార్యాలయంలో కొత్త వ్యూహాలను ప్రయత్నించడానికి సిద్ధంగా ఉంటారు.


Sagittarius Horoscope 2023


వారు తమ జట్టు సభ్యులను చాలా విశ్వసిస్తారు

ఈ ఉన్నతాధికారులు తమ టీమ్ సభ్యులను బాగా నమ్మతారు. వారిలోకి టాలెంట్ గుర్తించి.. దానికి తగిన పని చేసేలా ప్రోత్సహిస్తారు. ఈ  రాశివారికి నిజాయితీ ఎక్కువ. ముక్కు సూటి తనంతో వ్యవహరిస్తారు.  వారు తమ ఉద్యోగులకు ఫీడ్‌బ్యాక్ ఇవ్వవలసి వస్తే వారు వెనక్కి తగ్గరు. వారు పారదర్శకతకు విలువ ఇస్తారు తమ టీమ్ తో బహిరంగ , స్పష్టమైన సంభాషణను ఇష్టపడతారు. వారు తమ బృందాన్ని  ఆలోచించేలా ప్రేరేపిస్తారు, తద్వారా వినూత్న ఆలోచనలను స్వాగతిస్తారు.
 

Sagittarius Zodiac

ఈ రాశి వారు సత్యాన్వేషకులు. వేరొకరిలా నటించే వ్యక్తులను ఇష్టపడరు. వారు బలమైన అంకితమైన మత విశ్వాసాలను కలిగి ఉన్నారు. కఠినమైన నియమాలు, నిబంధనలు అడ్డంకిగా ఉన్నప్పటికీ వారి ఊహ సరైనదని వారు భావిస్తే.. దానిని చేసే తీరుతారు.
వారు కొన్ని సమయాల్లో స్వార్థపరులు కావచ్చు

Sagittarius Zodiac

ఈ నాయకులు ఇతరులపై ఎక్కువ కాలం పగతో ఉంటారు. వారు చాలా సందర్భాలలో చాలా స్వయంతృప్తితో ఉంటారు. వారు మాట్లాడే ముందు అస్సలు ఆలోచించరు. వారి మాటలను ఫిల్టర్ చేయడంలో విఫలమవుతారు. చుట్టుపక్కల ప్రజలను సంతోషపెట్టాలనే ఆలోచన రాదు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడతారు.

Latest Videos

click me!