ఎరుపు రంగు చీరలో దర్శనమిచ్చిన ప్రియురాలు..
మీ గర్ల్ ఫ్రెండ్ ఎరుపు రంగు చీర కట్టుకుని మీ కలలో కనిపిస్తే.. శుభసూచకం. అంటే ఈ కల మీరు ప్రేమ సంబంధంలో విజయం సాధిస్తారని అర్థం వస్తుంది. అలాగే మీరు అకస్మాత్తుగా డబ్బు సంపాదించొచ్చు కూడా.
కలలో భాగస్వామితో పెళ్లి చూడటం
మీ గర్ల్ ఫ్రెండ్ తో పెళ్లిని కలలో చూసినట్టైతే.. మీరు ప్రేమ వివాహం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అర్థం వస్తుంది. అలాగే మీ ప్రేమ పెళ్లి పీఠలు ఖచ్చితంగా ఎక్కుతుందని అర్థం వస్తుంది.