Meena Rashi 2024: న్యూ ఇయర్ లో మీన రాశివారికి శుభ ఫలితాలను పొందగలుగుతారు.

First Published | Dec 27, 2023, 1:49 PM IST

మనమంతా నూతన సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాం.  మరి ఈ నూతన సంవత్సరంలో మీన రాశివారికి ఎలా ఉంటుందో చూద్దాం. మీన రాశివారికి ఈ ఏడాది  అనవసర ఖర్చులను అదుపు చేయండి.  వేంకటేశ్వరుడిని ఆరాధించడం వల్ల శుభ ఫలితాలను పొందగలుగుతారు. 

pices

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్ధాంతి, స్మార్త పండితులు - గాయత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ విద్యార్థి)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్యలు చెప్పండి ...సాయంత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)


మీనం   రాశి వారికి ఈ ఆంగ్ల సంవత్సరం (2024 జనవరి నుంచి 2024 డిసెంబర్) ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఏయే నెలలు కలిసి వస్తుంది...ఎప్పుడు  ఇబ్బందులు ఉంటాయి ... రాశి వార్షిక ఫలాలు లో తెలుసుకుందాం
 

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
నామ నక్షత్రములు
(దీ--దూఝ-దా-దే-దో-చా-చి)

గురు:- ఏప్రిల్ నెలాఖరు వరకు ధన స్థానం లో సంచరించి మే నెల నుండి  తృతీయ స్థానం లో సంచారము.

శని:- ఈ సంవత్సరమంతా వ్యయ స్థానంలో సంచారము.

రాహు:-ఈ సంవత్సరమంతా జన్మరాశిలో  సంచారము.

కేతు:-ఈ సంవత్సరమంతా కళత్ర  స్థానంలో సంచారము.
 

Latest Videos



ఈ సంవత్సరం మీకు ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. చంద్రుడు అనుకూల ఫలితాలను ఇస్తున్నారు. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి.   శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. పెద్దలనుంచి ప్రోత్సాహకాలను అందుకుంటారు. తోటివారి సహకారంతో పనులు త్వరగా పూర్తవుతాయి. ముఖ్య విషయాల్లో అనుకూల ఫలితాలు వస్తాయి. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించండి. అనవసరంగా భయాందోళనలకు గురవుతారు. అనవసర ఖర్చులను అదుపు చేయండి.  వేంకటేశ్వరుడిని ఆరాధించడం వల్ల శుభ ఫలితాలను పొందగలుగుతారు. 
 

ఇక సంవత్సర ప్రారంభం పిబ్రవరి నెలలో కొన్ని విషయాలలో ఎమోషన్స్ కు  లోనవుతారు. మనస్సు బాధతో నిండుతుంది. అయితే పుణ్యక్షేత్రాల సందర్శనంతో ఉపశమనం కలుగుతుంది.  సాధ్యమైన మేరకు బంధువులు, కుటుంబసభ్యులతో వివాదాలకు దూరంగా ఉండడం శ్రేయస్కరం.  అలాగే ఆగస్టు నుంచి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ ఉండాలి. ప్రతి కార్యక్రమంలోనూ దైవ బలం తోడయ్యాలా చూసుకుంటూ మరింత జాగ్రత్తలు పాటించాలి. ఎటువంటి తొందరపాటు నిర్ణయం తీసుకున్నా నష్టపోయే అవకాశాలున్నాయి. అదృష్టం ఏమిటంటే...ఆదాయానికి లోటు లేకుండా జీవితాన్ని నడిపిస్తారు.
 

ఇక మీ ఇంట్లోవి అయినా లేక మీ బంధువుల ఇళ్లలో అయినా  శుభకార్యాలకు మీ చేతి నుంచి ఖర్చులు చేయాల్సి వస్తుంది. అంతేకాదు చర, స్థిరాస్తులు కొనుగోలు ప్రయత్నాలలో చురుకుదనం కనిపిస్తుంది. వ్యాపారస్తులు కొత్త సంస్థల ఏర్పాటు చేస్తారు. ఆ సమయంలో పార్టనర్స్ విషయంలో  ఆచితూచి వ్యవహరించాలి. బ్యాంకు రుణాలు రావటంతో వ్యాపారంలో ఉత్సాహం , కొన్ని సమస్యల  నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగులకు మరింత పనిభారంతో పాటు, పైస్థాయి వారి అజమాయిషీ పెరుగుతుంది. పారిశ్రామిక, శాస్త్రసాంకేతిక రంగాల వారు కంగారుపడకుండా  ముందుకు సాగితే అనుకున్న ఫలితాలు, విజయాలు సాధించవచ్చు.
 

click me!