1. స్త్రీపై బల్లి పడితే...
ఒక బల్లి స్త్రీ తలపై పడితే అది మరణ భయాన్ని సూచిస్తుందని అర్థం. అదే ఎడమ కన్నుపై పడితే మీరు ప్రేమించే పురుషుడు.. మిమ్మల్ని కూడా ప్రేమిస్తున్నాడని అర్థమట. అలా కాకుండా కుడి కన్నుపై పడితే మీరు చాలా ఒత్తిడి ఎదుర్కొంటున్నారని అర్థం.బల్లి కుడి చెంపపై పడితే, మీకు మగపిల్లవాడు పుడతాడు. అది కుడి చెవిపై పడితే, మీరు ఆర్థిక లాభాలను చూస్తారు. అది పై పెదవిపై పడితే, మీరు కొన్ని సమస్యలను ఎదుర్కోబోతున్నారని అర్థం.
అది మీ కింది పెదవిపై పడితే, మీరు కొత్త వస్తువులను కొంటారు. అది రెండు పెదవులపై కలిసి పడితే, త్వరలో సమస్య వస్తుందని అర్థం చేసుకుని దానిని ఎదుర్కోవడానికి సిద్ధం అవ్వండి. అది మీ వీపుపై పడితే, ప్రాణనష్టం వార్త వినడానికి అవకాశం ఉంది. అది మీ వేలుగోలుపై పడితే, ఖచ్చితంగా వివాదం తలెత్తుతుంది. అది మీ చేతులపై పడితే, మీరు ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు. బల్లి మీ ఎడమ చేయిపై పడితే, ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. అది మీ వేళ్లపై పడితే, కొత్త నగలు కొనే అవకాశం ఉంది.