
ప్రతి ఒక్కరిలోనూ ఒక్కో లక్షణం ఉంటుంది. కొందరిలో మంచి లక్షణాలు ఉంటే.. మరి కొందరిలో చెడు లక్షణాలు ఉంటాయి. అయితే.. కాసేపు చెడు అనే విషయాన్ని పక్కన పెడితే... ఏ రాశివారు ఏ విషయంలో మంచి, ది బెస్ట్ అనే విషయాలు.. రాశుల ప్రకారం చూద్దాం...
1.మేష రాశి..
మేష రాశివారు చాలా అందంగా ఉంటారు. అంటే లుక్స్ పరంగానే కాదు... మనసు పరంగానూ ఈ రాశివారు చాలా అందంగా ఉంటారు. అంతేకాదు.. ఈ రాశివారు సహజంగా నాయకత్వ లక్షణాలు ఉంటాయి. తమను తాము ఎప్పుడూ యాక్టివ్ గా ఉంచుకోవడానికి వీరు ఎక్కువగా ప్రయత్నిస్తారు. ఈ రాశివారిలో కాన్ఫిడెన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది.
2.వృషభ రాశి..
ఈ రాశివారు డబ్బులు విపరీతంగా ఖర్చు చేస్తారు. ఇందులో మంచి ఏముంది అనుకోవచ్చు. అయితే.. వీరు తమ కోసమే కాదు.. ఇతరుల కోసం కూడా ఖర్చు చేస్తారు. ఈ రాశివారు ఎలాంటి పరిస్థితుల్లో అయినా స్ట్రాంగ్ గా ఉంటారు. ఈ రాశివారు తమతో ఉన్నవారిని ఎప్పుడూ భధ్రంగా చూసుకుంటారు.
3.మిథున రాశి..
మిథున రాశివారు ఎలాంటి పరిస్థితుల్లో అయినా, ఎక్కడ అయినా బతికేయగలరు. ఇక ఈ రాశివారు తినడం, నిద్రపోవడం అంటేనే విపరీతమైన ఇష్టం. ఈ విషయంలో ఈ రాశివారు ముందుంటారు.
4.కర్కాటక రాశి..
ఈ రాశివారు అందరినీ తమ మాటలతో నవ్విస్తూ ఉంటారు. జోకులు ఎక్కువగా వేస్తూ ఉంటారు. ఎలాంటి గడ్డు పరిస్థితులు ఎదురైనా తట్టుకొని నిలపడటం ఈ రాశివారికి బాగా తెలుసు.
5.సింహ రాశి..
సింహ రాశివారు అయస్కాంతం లాంటివారు. ఈ రాశివారు తమ చార్మ్, తమ వ్యక్తిత్వంతో ఎవరినైనా ఆకర్షించగలరు. అయితే.. ఈ రాశివారు ఎవరితో అయినా వాదించగలరు.
6.కన్య రాశి..
కన్య రాశివారు చిన్న విషయాలపై కూడా ఎక్కువ శ్రద్ధ చూపిస్తూ ఉంటారు. వీరు చాలా పద్దతిగా ఉంటారు. ఏదైనా ఆర్గనైజింగ్ గా ఉండటం వీరికి నచ్చుతుంది. కానీ అప్పుడప్పుడు ఈ రాశివారు చాలా బద్దకంగా కూడా ఉంటారు.
7.తుల రాశి..
తుల రాశివారు తమ వారి పట్ల.. స్నేహితుల పట్ల చాలా ఎక్కువ కేరింగ్ గా ఉంటారు. వీరు జీవితంలో అన్నింటినీ చాలా చక్కగా బ్యాలెన్స్ చేయగలుగుతారు.జీవితం ప్రశాంతంగా ఉండేలా చూసుకుంటారు.
8.వృశ్చిక రాశి..
వృశ్చిక రాశివారు చాలా మానసింగా బలంగా ఉంటారు. ఎలాంటి కష్టం వచ్చినా దానిని తట్టుకొని నిలపడటం ఎలాగో.. ఈ రాశివారికి బాగా తెలుసు. ఎలాంటి సవాళ్లు అయినా ఎదురించగలరు. అయితే.. కొంచెం వీరికి అప్పుడప్పుడు జెలసీ ఎక్కువ అని చెప్పొచ్చు.
9.ధనస్సు రాశి..
ఈ రాశివారు ఇంటి పనులు బాగా చేయగలరు. పురులు అయితే.. తమ భార్యలకు చాలా బాగా సహాయం చేస్తారు. అంతేకాదు ఈ రాశివారు ఎఫ్పుడూ చాలా పాజిటివ్ గా ఉంటారు. ఎలాంటి సవాళ్లు అయినా ఎదుర్కోగలరు.
10.మకర రాశి..
మకర రాశివారు జీవితంలో ఉన్నత లక్షాలను కలిగి ఉంటారు. ఎక్కువ కష్టపడతారు. లక్ష్యం చేరుకునే వరకు వారు పట్టువిడవరు. డబ్బు కూడా చాలా ఎక్కువగా సంపాదించగలరు.
11.కుంభ రాశి..
కుంభ రాశివారు ప్రతి విషయంలో మరీ ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఆ సంగతి పక్కన పెడితే.. ఈ రాశివారు క్రియేటివ్ మైండ్స్. ప్రతిసారీ మంచి ఆలోచనలు, ఐడియాలతో ముందుకు వస్తూ ఉంటారు.
12.మీన రాశి..
మీన రాశివారు చాలా దయగా ఉంటారు. అందరి పట్ల చాలా కేరింగ్ గా ఉంటారు. ఇతరలను బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఒక్కోసారి మాత్రం.. ఇతరులను అందరి ముందు తక్కువ చేయడానికి చూస్తారు.