ఈవారం రాశిఫలాలు: ఓ రాశి వారు ఈ వారం సాహసో పేత నిర్ణయాలతో విజయ సిద్ది

First Published | Sep 10, 2023, 9:50 AM IST

ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ వారం మానసిక ప్రశాంతత లభిస్తుంది.ఈ వారం అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. చేపట్టిన ప్రతి పని సకాలంలో పూర్తి చేస్తారు.

వార ఫలాలు :10 సెప్టెంబర్  2023 నుంచి 16 సెప్టెంబర్ 2023 వరకూ
 

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్య పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
 
రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ... ఈ వారం   రాశి ఫలాలు లో తెలుసుకుందాం

telugu astrology


మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1)
నామ నక్షత్రములు:-(చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 9

ఈ వారం చంద్రుడు చతుర్థ స్థానము నందు సంచరించును. ఈ సంచారం వలన దోష ఫలితాలు రాగలవు.అనవసరమైన ఖర్చులు పెరుగును. ఇతరులతోటి అకారణంగా విరోధాలు రాగలవు. అనవసరమైన విషయాలకు దూరంగా ఉండడం మంచిది.అకారణ కోపతాపాలు వలన తలపెట్టిన పనులలో ఆటంకాలు ఎదురౌతాయి.కోర్టు వ్యవహారాలలో ప్రతికూల వాతావరణం. వృత్తి వ్యాపారాలలో జాగ్రత్త అవసరం.మానసిక భయాందోళనలకు గురి అవుతారు. కుటుంబ సభ్యులు తోటి సఖ్యతగా ఉండవలెను. ఉద్యోగవనందు అధికారుల తోటి సమస్యలు ఏర్పడగలవు. ఆదాయం అంతంత మాత్రమే లభించును. ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. ప్రభుత్వ మూలక ఇబ్బందులు కలుగును. శత్రు శరీర పీడ పెరుగును. వ్యవహారమనందు అలసత్వం.


telugu astrology


వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2)
నామ నక్షత్రములు:-(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 9

ఈ వారం చంద్రుడు తృతీయ స్థానము నందు సంచరించును. ఈ సంచారం వలన అనుకూల శుభ ఫలితాలు పొందగలరు. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది.ఈ వారం అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. చేపట్టిన ప్రతి పని సకాలంలో పూర్తి చేస్తారు. వ్యవహారాలలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగుతారు. సంతానం మరియు విద్యా విషయాలలో మంచి ఫలితాలు పొందుతారు. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆదాయ మార్గాలు పెరుగును. దూర ప్రయాణాలు కలసివస్తాయి. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. సన్నిహితులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు.స్థిరాస్తి లాభాలు పొందుతారు. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. నూతన గృహ నిర్మాణ ప్రయాత్నాలు ఫలించును .వృత్తి వ్యాపారాలు కలసివస్తాయి.
 

telugu astrology


మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3)
నామ నక్షత్రములు:-(కా-కి-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హా)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 5

ఈ వారం ధన స్థానము నందు చంద్ర సంచారము. ఈ సంచారము వలన కొద్దిపాటి ఇబ్బందులు కలుగును. ఆరోగ్య సమస్యలు చికాకు కలిగిస్తాయి.రావలసిన డబ్బు చేతికి అందక మానసిక ఒత్తిడి పెరుగుతుంది. అనవసరమైన వివాదాల్లో తల దూర్చకండి. భూ గృహ క్రయ విక్రయాల విషయంలో జాగ్రత్త అవసరం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధుమిత్రులతో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. నూతన పరిచయాలతో జాగ్రత్త అవసరం. అనవసరమైన ఆలోచనలను చేయకండి. కీలకమైన సమస్యలు కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. చేపట్టిన పనులలో సమస్యలు ఎదురైనా పట్టుదల తో పూర్తి చేయాలి.వాహనాల ప్రయాణాలు యందు  జాగ్రత్త అవసరము.కోపాన్ని తగ్గించుకుంటే మంచిది. కఠిన సంభాషణవల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.శారీరకంగా మానసికంగా బలహీనపడతారు. భార్యా భర్తల మధ్య మనస్పర్ధలు రావచ్చు.
 

telugu astrology

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4)
నామ నక్షత్రములు:-(హీ-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 2

ఈవారం చంద్రుడు జన్మ రాశి లో సంచరించును. ఈ సంచారము వలన శుభ ఫలితాలు పొందగలరు. శరీర సౌఖ్యం లభిస్తుంది. జీవిత భాగస్వామి తోటి ఆనందంగా గడుపుతారు కుటుంబ సౌఖ్యం లభిస్తుంది.ఈ వారం అనుకూలంగా ఉండును. చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలు నుండి పరిష్కారం లభిస్తుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి అగును. వృత్తి ఉద్యోగాలలో అధికారులను మీ పనితీరుతో ఆకట్టుకుంటారు. వ్యాపారాలు విశేషంగా రాణిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలు అవరోధాలు తొలుగును. ఆదాయానికి లోటు ఉండదు. సాహసో పేత నిర్ణయాలు తీసుకుంటారు. బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. పాత మిత్రులతో కలిసి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. ఉద్యోగస్తులకు నూతన అవకాశాలు లభిస్తాయి. విద్యార్థులు విద్యా విషయాలలో ముందంజలో ఉంటారు. భూ సంబంధిత క్రయవిక్రయాలలో ఆశించిన లాభాలు పొందగలరు.

telugu astrology

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1)
నామ నక్షత్రములు-:-(మా-మీ-మూ-మే-మో-టా-టీ-టూ-టే)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 1

ఈ వారం గోచార రీత్యా చంద్రుడు వ్యయ స్థానం నందు సంచరించును. ఈ సంచారము వ్యతిరేక ఫలితాలు ఇవ్వగలడు. సమాజము నందు అవమానాలు కలగవచ్చు. తలపెట్టిన పనులలో ఆటంకములు ఏర్పడను.ఆదాయానికి మించిన ఖర్చులు. అకారణ కలహాలు రాగలవు. సంయమనం పాటించడం మంచిది.భూ గృహ నిర్మాణ ఆలోచనలు వాయిదా వేసుకోవడం మంచిది. అధిక శ్రమ. కుటుంబం నందు ప్రతికూల వాతావరణం. రుణ బాధలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. సంఘం నందు ఆచితూచి తెలివిగా వ్యవహరించాలి. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. సమయానుకూల నిర్ణయాలు తీసుకోవాలి.ఆదాయం సామాన్యంగా ఉండును.అధికారులతో సఖ్యతగా ఉండవలెను. ఉద్యోగ ప్రయత్నాలలో ఆటంకములు. ఆర్థిక లావాదేవీల్లో అప్రమత్తత అవసరం. 
 

telugu astrology


కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2)
నామ నక్షత్రములు:-(టో-పా-పి-పూ-షం-ణా-ఢ-పే-పో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 5

ఈ వారం చంద్రుడు లాభ స్థానము నందు సంచారము. ఈ సంచారము వలన శుభ ఫలితాలు పొందుతారు. స్త్రీ సౌఖ్యం లభిస్తుంది. ఆరోగ్యం అనుకూలించును. వృత్తి వ్యాపారాలలో ధనలాభం పొందగలరు. అనుకున్న అన్ని వ్యవహారాలు అనుకూలం. ఆకస్మిక ధన లాభం. స్థిరాస్తి గృహ నిర్మాణాలకు అనుకూలంగా ఉండును. సంతాన మూలకంగా లాభం.నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తారు. గృహమునందు శుభ కార్యక్రమాలు జరుగును.జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. మొండి బాకీలు వసూలు చేస్తారు. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది.విలువైన వస్తువుల యందు జాగ్రత్త అవసరం. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.మానసిక ప్రశాంతత పొందగలరు. విద్యార్థినీ విద్యార్థులు ప్రతిభ పాటలు కనబడుస్తారు. కొంతకాలంగా పరిష్కారం కానీ సమస్యలు పరిష్కారం అగును.
 

telugu astrology


తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3)
నామ నక్షత్రములు:-(రా-రి-రూ-రే-రో-త-తీ-తూ-తే)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 6

ఈ వారం చంద్రుడు రాజ్య స్థానము నందు సంచరించును. ఈ సంచారం వలన శుభ ఫలితాలు పొందగలరు. ఉద్యోగం నందు అధికార అభివృద్ధి కలుగును. అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి అగును. సంఘం నందు మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. విలాసవంతమైన వస్తువుల నిమిత్తం అధిక ధనం ఖర్చు చేస్తారు. రుణములు తీరి ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. నూతన వ్యక్తులు పరిచయాలు వలన నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు.గృహ నిర్మాణాలు ముందుకు సాగును.వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును.ఆరోగ్య విషయంలో ఇబ్బందులు తలెత్తవచ్చు. ఇతరుల  సహాయ సహకారాలు లభిస్తాయి. ఒప్పందాలు సంతృప్తికరంగా ఉంటాయి. రావలసిన బాకీలు వసూలు అగును. ప్రయాణాలు కలిసివస్తాయి.
 

telugu astrology


వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4)
నామ నక్షత్రములు:-(తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 9

ఈ వారం చంద్రుడు భాగ్య స్థానం నందు సంచరించును.  ఈ సంచారం వలన వ్యతిరేక ఫలితాలు కలుగును. చేయు పనులలో అలసత్వం పెరుగుతుంది. ఉద్యోగులు అధికారుల ఆగ్రహానికి గురి అవుతారు. సంఘంలో అపనిందలు రాగలవు.వృత్తి వ్యాపారాల యందు ధన నష్టం రాకుండా జాగ్రత్తలు పాటించడం మంచిది.అధిక ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. శారీరక శ్రమ అధికంగా ఉండును.రుణ శత్రుబాధలు ఇబ్బంది పెడతాయి. స్థిరాస్తి క్రయ విక్రయాలు వాయిదా వేసుకోవడం మంచిది. అన్నదమ్ముల సహకారం అంతంత మాత్రంగా ఉండును. బంధు మిత్ర విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడటం మంచిది. మానసిక ఆందోళన అధికమవుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. స్థిరమైన నిర్ణయాలు తీసుకోవాలి .వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.ఆర్థిక పరిస్థితి ఇబ్బంది లేకుండా చూసుకోవాలి.సహోద్యోగులతో విభేదాలు ఏర్పడగలవు.

telugu astrology

ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1)
నామ నక్షత్రములు:-(యే -యో-య-బా-బి-బూ-ధా-భా-ఢా-బే)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 3

ఈవారం చంద్రుడు అష్టమ స్థానము నందు సంచారం.ఈ సంచారం వలన ప్రతికూల ఫలితాలు ఏర్పడును. ఆకస్మిక పరిణామాలు ఎదురైయి మానసిక ఉద్రేకతలు పెరుగును. అకారణ  కోపాల వల్ల అన్ని విధాల నష్టాలు ఏర్పడగలవు.ఆర్థిక ఇబ్బందులు ఉన్నా తగు సమయానికి ధనము చేతికి అందుతుంది .బంధువులతో విభేదాలు రావచ్చు. ఉద్యోగంలో పై అధికారుల నుంచి చికాకులు ఏర్పడగలవు. శ్రమ అధికమైనా అనుకున్న సమయానకి పనులు పూర్తిచేస్తారు.అకారణంగా అధిక ధనాన్ని ఖర్చు చేయాల్సి వస్తుంది. సమాజము నందు ఆచితూచి వ్యవహరించాలి. శారీరక ఇబ్బందులు పెరుగుతాయి. ఈ వారం అన్ని విషయాలలో తగు జాగ్రత్తలు తీసుకొనుట మంచిది. ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం చేయవద్దు.వాహన ప్రయాణాల యందు జాగ్రత్త అవసరము.వ్యాపారము నందు ధన నష్టం రాకుండా చూసుకోవాలి. తలపెట్టిన కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. ఇతరులకు సంబంధించిన విషయాలకు దూరంగా ఉండవలెను. ఉమ్మడి ఆస్తి మరియు క్రయ విక్రయాలు యందు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి.

telugu astrology


మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2)
నామ నక్షత్రములు:-(బో-జా-జి-జూ-జే-జో-ఖా-గా-గీ)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 8

ఈవారం చంద్రుడు కళత్ర స్థానము నందు సంచారం. ఈ సంచారం వలన శుభ ఫలితాలు పొందుతారు. సమాజమునందు కీర్తి ప్రతిష్టలు పెరుగును. శరీర సౌఖ్యం లభిస్తుంది. సంతోషకరమైన ప్రయాణాలు చేస్తారు.ధనాధాయ మార్గాలు బాగుంటాయి .వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు మీ ప్రతిభకు తగ్గ ఉద్యోగాలు లభిస్తుంది.పనులలో ఆటంకాలు ఏర్పడిన పట్టుదలతో పూర్తి చేస్తారు.వృత్తి వ్యాపారాలలో ఆర్థిక లాభాలు పొందవచ్చు .నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆరోగ్య విషయము లో జాగ్రత్త అవసరము.కుటుంబ సభ్యుల తో శుభకార్యా ఆలోచనలు చేస్తారు.సంఘం నందు కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి.ఉద్యోగ విషయాలు అనుకూలంగా ఉండును.మానసిక ప్రశాంతత పొందగలరు.విద్యార్థినీ విద్యార్థులు ప్రతిభ పాటలు కనబడుస్తారు. ఆదాయ మార్గాల అన్వేషణలు ఫలించును.

telugu astrology

కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3)
నామ నక్షత్రములు:-(గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 8

ఈ వారం చంద్రుడు శత్రు స్థానం నందు సంచారము. ఈ సంచారం వలన శుభ ఫలితాలు పొందగలరు. కుటుంబం నందు ఆనందకరమైన వాతావరణం. నూతన వ్యక్తుల పరిచయం. బంధువుల నుంచి శుభవార్తలు అందును .సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది.శ్రమకు తగిన ప్రతిఫలం  దక్కించుకుంటారు.  కుటుంబ సభ్యులు తోటి సంతోషం గా గడుపుతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. నిరుద్యోగుల యత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలలో  అనూహ్యంగా లాభాలను పొందవచ్చు. ఉద్యోగులకు పనిభారం తగ్గుతుంది.కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. సమాజము నందు మీ మాటకు విలువ పెరుగుతుంది. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. తలపెట్టిన పనులలో విజయం సాధిస్తారు. రాజకీయ నాయకులు ప్రజాభిమానం పొందగలరు.

telugu astrology

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4)
నామ నక్షత్రములు:-(ది-దు-శ్యం-ఝా-థా-దే-దో-చా-చి)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 3

ఈవారం చంద్రుడు పంచమ స్థానము నందు సంచారము. ఈ సంచారము వలన వ్యతిరేక ఫలితాలు కలుగును.చేయు పనులలో అశ్రద్ధ పెరిగి ఆటంకముల ఏర్పడను. అనారోగ్య సమస్యలు రాగలవు.ఆచితూచి మాట్లాడడం వలన అన్ని విధాలా శ్రేయస్కరం. శారీరకంగా మానసికంగా బలహీనంగా ఉంటుంది. బంధువుల తోటి మనస్పర్ధలు రాగలవు. తలపెట్టిన పనులలో ఆటంకాలు ఎదురౌతాయి. దురాలోచనలకు దూరంగా ఉండండి.ఇతరుల తోటి వాదనలకు దూరంగా ఉండాలి. కుటుంబ సభ్యుల తోటి సఖ్యతగా మెలగవలెను .చేయు వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉండును. వ్యాపారం నందు పెట్టుబడులు వాయిదా వేయడం మంచిది. ఆర్థిక ఇబ్బందులు ఎదురవగలవు. మీరు నమ్మిన వారి వలనే మీకు అపకారం జరుగును. వివాహ శుభ కార్యక్రమాలు వాయిదా పడును.స్థిరాస్తి సంబంధించిన విషయాలలో జాగ్రత్త అవసరం.

Latest Videos

click me!