వారఫలాలు: ఓ రాశి వారికి హామీలు, మధ్యవర్తిత్వాల వల్ల చిక్కుల్లో పడే ఆస్కారం

ramya Sridhar | Updated : Nov 05 2023, 10:00 AM IST
Google News Follow Us

ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ వారం తలపెట్టిన కార్యాలలో ప్రతిబంధకాలు ఏర్పడగలవు. కుటుంబము నందు పెద్ద వారి యొక్క ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొనవలెను.

113
వారఫలాలు: ఓ రాశి  వారికి  హామీలు, మధ్యవర్తిత్వాల వల్ల చిక్కుల్లో పడే ఆస్కారం
daily horoscope 2023 New 09


జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్ధాంతి, స్మార్త పండితులు - గాయత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్యలు చెప్పండి ...సాయంత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈ  వారం ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ... ఈ వారం  రాశి ఫలాలు లో తెలుసుకుందాం

213
telugu astrology

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1)
నామ నక్షత్రాలు(చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 9

ఈ రాశి వారికి చతుర్దాది పతి అయిన చంద్రుడు చతుర్ధ స్థానం మరియు శత్రు లో సంచారం. ఈ సంచారం వలన కొద్దిపాటి ఇబ్బందులు కలుగును.ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి.చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు.దైవ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇతరుల విషయాలకు దూరంగా ఉండాలి. బంధు మిత్రులతో అనుకోని కలహాలు రాగలవు. కీలకమైన సమస్యలకు పరిష్కార మార్గాలు దొరుకును. శ్రమకు తగిన ప్రతిఫలం  కష్టంగా ఉంటుంది. కుటుంబ సమస్యలు ఎదురై చికాకులు కలిగిస్తాయి. ప్రయాణాలలో తగిన జాగ్రత్త వహించాలి. గృహంలో పెద్దవాళ్ల యొక్క ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి.భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గి మనస్పర్థలు రావచ్చు. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. ప్రతి చిన్న విషయంలో ఆచితూచి అప్రమత్తులై వ్యవహరించాలి. మానసికంగా భయాందోళన గా ఉంటుంది. చేసే పనుల్లో బుద్ధి కుశలత తగ్గును. తలపెట్టిన కార్యాలలో ప్రతిబంధకాలు ఏర్పడగలవు. కుటుంబము నందు పెద్ద వారి యొక్క ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొనవలెను.
 

313
telugu astrology

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
నామ నక్షత్రాలు:-(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 6

ఈ రాశి వారికి తృతీయాధిపతి అయిన చంద్రుడు ఈ వారం తృతీయ స్థానము మరియు పంచమ స్థానంలో సంచరించును. ఈ సంచారం వలన అనుకూల శుభ ఫలితాలు పొందగలరు. బంధు మిత్రుల కలయిక.  ఉద్యోగాలలో సహోద్యోగుల సహాయ సహకారాలు లభిస్తాయి. గృహంలో అనుకూలమైన వాతావరణం. నూతన వస్తు వాహన ప్రాప్తి. చేసే పనులలో ఆటంకాలు లేక నిర్విఘ్నంగా సాగుతాయి. ప్రతిభకు తగ్గ గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగును. దూరపు ప్రయాణం చేయవలసి వస్తుంది.  ప్రభుత్వ సంబంధిత పనులు ముందుకు సాగుతాయి. కోర్టు తీర్పు  అనుకూలంగా ఉంటాయి. కీలక నిర్ణయాలు లో సొంత ఆలోచనలు కలసి వస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించును. కుటుంబ బాధ్యతలు కు ప్రాధాన్యత ఇస్తారు. మానసికంగా శారీరకంగా బలపడతారు. చేయు వ్యవహారములు లో లౌక్యం తో వ్యవహరించాలి. నూతన వస్తు ఆభరణాలను పొందుతారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. అన్ని విధాల ప్రయోజనకరంగా ఉంటుంది.ధైర్య సాహసాలతో కీలకమైన సమస్యలను ష్కరించుకుంటారు.వారాంతం లో అనవసరమైన ఖర్చులు చేయవలసిన వస్తుంది. కొన్ని సంఘటనలు బాధ కలిగించును. అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు.
 

Related Articles

413
telugu astrology

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
నామ నక్షత్రాలు:-(కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 5

ఈ రాశి వారికి ధనాధిపతి అయిన చంద్రుడు ఈ వారం ధన స్థానం మరియు మాతృ స్థానము లో  చంద్ర సంచారం. ఈ సంచారం వలన కొద్దిపాటి ఇబ్బందులు కలుగును.భూ గృహ నిర్మాణాలు వాయిదా వేయడం మంచిది.ప్రభుత్వ సంబంధిత పనులు పూర్తి గాక చికాకు పుట్టించెను.వృత్తి వ్యాపారాలు నిరాశగా ఉంటాయి. సన్నిహితులతో వాదోపవాదాలకు దూరంగా ఉండాలి.సంతాన విషయంలో ప్రతికూలత వాతావరణ . ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పటికీ అవసరాలకు అనుగుణంగా ధనం చేతికి అందుతుంది. అనవసరమైన  సంభాషణల వల్ల విరోధాలు  రావచ్చు. ఋణాలు ‌తీరుస్తారు .మానసిక ప్రశాంతత లభిస్తుంది. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవాలి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి .తలపెట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి .శారీరక కష్టం పెరుగుతుంది. ఉద్యోగాలలో అధికారుల‌ తో కలహాలు రాగలవు. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి .అనారోగ్య సమస్యలు రాగలవు. సమాజంలో అపనిందలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
 

513
telugu astrology


కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
నామ నక్షత్రాలు:-(హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 2

ఈ రాశి వారికి జన్మ రాశ్యాధిపతి అయిన చంద్రుడు ఈవారం జన్మ రాశి లో మరియు తృతీయ స్థానము నందు సంచారం. ఈ సంచారం వలన శుభ ఫలితాలు పొందగలరు.దానధర్మాలు యందు ఆసక్తి చూపుతారు. అనవసరమైన కోపతాపాలకు దూరంగా ఉండాలి. గృహనిర్మాణ ఆలోచనలు  కలసి వస్తాయి . వివాహ ప్రయ‌త్నాలు ఫలిస్తాయి. సంతానం అభివృద్ధి లోకి వస్తుంది.వృత్తి వ్యాపారాలలో రాణిస్తారు.అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు.అనుకోని ప్రయాణం చేయవలసి వస్తుంది. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు .శారీరక శ్రమ తగ్గి శరీర సౌఖ్యం లభిస్తుంది .పాత బాకీలు వసూలగును.మీ యొక్క ప్రతిభ వెలుగులోకి వస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు.కేసులు వివాదాలు అనుకూలంగా ఉంటాయి.కీలకమైన సమస్యలకు పరిష్కార మార్గం లభించును.తలపెట్టిన కార్యాలు మిత్రుల సహాయ సహకారాలతో పూర్తి అగును . ఆర్థిక మరియు కుటుంబ విషయాలు లో అభివృద్ధి కనబడుతుంది. శారీరక శ్రమ తగ్గి శరీర సౌఖ్యం లభిస్తుంది.
 

613
telugu astrology

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ 1 2 3 4, ఉత్తర 1):
నామ నక్షత్రాలు-:-(మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 1

ఈ రాశి వారికి వ్యయాధిపతి అయిన చంద్రుడు ఈ వారం వ్యయ స్థానం  మరియు ధన స్థానంలో సంచరించును. ఈ సంచారము వ్యతిరేక ఫలితాలు కలుగును.తలపెట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడగలవు. ఉద్యోగాలలో అధికారులు తో అనవసరమయిన కలహాలు. విద్యార్థులు పట్టుదలతో చదవవలెను. చెడు స్నేహాలు కు దూరంగా ఉండాలి.ఇతరుల విషయాలకు దూరంగా ఉండాలి.మనస్సు నందు ఆందోళనగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండి రుణాలు చేయవలసి ఉంటుంది.స్థిరాస్తి క్రయ విక్రయాలు వాయిదా వేయడం  మంచిది. సంతానానికి ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి.వివాహ ప్రయత్నాలు లో ఆటంకాలు ఎదురవుతాయి .ద్వేష అసూయ లకు దూరంగా ఉండాలి. సమాజంలో ప్రతికూలత వాతావరణ. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి బంధుమిత్రులతో సహాయ సహకారాలు లభించును.ఆర్థిక ఇబ్బందులు ఎదురవగలవు. సమాజంలో ప్రతికూలత వాతావరణ. కొన్ని సందర్భాల్లో మిత్రుల వలన నష్టము కలగవచ్చు. అనవసరమైన ఖర్చులు పెరగకుండా జాగ్రత్త వహించాలి.
 

713
telugu astrology

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
నామ నక్షత్రాలు:-(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 5

ఈ రాశి వారికి లాభాధిపతి అయిన చంద్రుడు ఈ వారం లాభ స్థానం మరియు జన్మరాశి  లో    సంచారం. ఈ సంచారం వలన శుభ ఫలితాలు పొందుతారు. ఉద్యోగాలలో అభివృద్ధి కలుగుతుంది.అనుకున్న పనులు లో సంపూర్ణ విజయం లభిస్తుంది.బంధు మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు.వృత్తి వ్యాపారాలలో లాభాలు పొందుతారు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి .సంఘంలో మీ మాట తీరు అందరినీ ఆకట్టుకుంటారు. పొదుపు మార్గాలు అన్వేషణ చేస్తారు .ఉహించని మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.అభివృద్ధి ఆలోచనలు ఆచరణలో పెడతారు. ఆరోగ్యం అనుకూలించి ప్రశాంతత లభిస్తుంది.కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. రావలసిన పాత బాకీలు వసూలగును.ఆరోగ్యం సమకూరి ప్రశాంతత లభిస్తుంది. అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చేస్తారు. వృత్తి వ్యాపారాలలో ఊహించని ధన లాభం పొందగలరు. ఉద్యోగాలలో అధికారుల అభిమానాలు పొందగలరు. అనేక మార్గాల ద్వారా ఆదాయాన్ని పొందుతారు.

813
telugu astrology

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 6
నామ నక్షత్రాలు:-(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)

ఈ రాశి వారికి రాజ్యాధిపతి అయిన చంద్రుడు రాజ్యస్థానము  మరియు వ్యయ స్థానం నందు  సంచరించును. ఈ సంచారం వలన శుభ ఫలితాలు పొందగలరు. కుటుంబ సౌఖ్యం లభించును.తలపెట్టిన పనుల్లో విజయం సాధిస్తారు.ఆదాయ మార్గాలు అన్వేషణ ఫలిస్తాయి . ఉద్యోగాలలో అధికారుల తో సత్సంబంధాలు మెరుగుపడతాయి. నూతన వస్తు వాహన కొనుగోలు చేస్తారు.సంఘంలో కీర్తి ప్రతిష్ఠలు లభిస్తాయి .పాత బాకీలు వసూలు అవును. పొదుపు మార్గాలు పై దృష్టి పెడతారు. వాయిదా పడుతున్న  సమస్యలు పరిష్కారం అవుతాయి. ప్రయాణాలు కలిసి వస్తాయి.దీర్ఘకాలిక అనారోగ్యం నుండి ఉపశమనం కలుగుతుంది.అభివృద్ధి ఆలోచనలు కలసి వస్తాయి. ప్రజా సంబంధాలు పెంచుకుంటారు. వైవాహిక జీవితం ఆనందంగా గడుస్తుంది. దైవ సంబంధిత కార్యక్రమాలలో పాల్గొంటారు.అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. తలపెట్టిన కార్యాలలో విజయం సాధిస్తారు. కుటుంబము నందు సంతోషకరమైన వాతావరణం. ఉద్యోగాలలో అధికార వృద్ధి పొందగలరు.వారాంతం లో  సమాజంలో అవమానాలు కలగవచ్చు.తలపెట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడును.
 

913
telugu astrology

వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
నామ నక్షత్రాలు:-(తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 9

ఈ రాశి వారికి భాగ్యాధిపతి అయిన చంద్రుడు ఈ వారం భాగ్య స్థానం మరియు లాభ స్థానంలో   సంచరించును. ఈ సంచారం వలన మిశ్రమ ఫలితాలు కలుగును.భూ గృహ నిర్మాణ క్రయవిక్రయాలు వాయిదా వేయడం మంచిది.వృత్తి వ్యాపారాలలో కష్టానికి తగ్గ ప్రతిఫలం  కష్టముగా ఉండును. తల పట్టిన పనులలో ఇబ్బందులు ఎదురవుతాయి.అకారణ కోపతాపాలకు దూరంగా ఉండాలి .సంఘంలో మీ యొక్క ప్రవర్తన వలన కొన్ని సమస్యలు ఏర్పడుతాయి. నూతన  అభివృద్ధి ఆలోచనలు నిరాశ పరుస్తాయి.ఉద్యోగ ప్రయత్నాలు నిరాశ పరుస్తాయి.ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి .దూరపు ప్రయాణం చేయవలసి వస్తుంది. నా అన్న వారు అపకారం చేయాలని చూస్తారు. మానసిక శారీరక ములు బలహీనపడతాయి. అనవసరమైన ఖర్చులు తగ్గించు కొనవలెను. వచ్చిన చిన్న చిన్న అవకాశాలను అందిపుచ్చుకోవాలి. దైవ కార్యక్రమంలో పాల్గొంటారు. అభివృద్ధి కార్యక్రమాలకు గూర్చి ఆలోచన చేస్తారు. ఉద్యోగాలలో అధికారుల ఆగ్రహానికి గురి అవుతారు.వారాంతం లో  స్త్రీ సౌఖ్యం లభిస్తుంది. ఆరోగ్యం అనుకూలించును. వృత్తి వ్యాపారాలలో ధన లాభం పొందగలరు.

1013
telugu astrology


ధనుస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
నామ నక్షత్రాలు:-(యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 3

ఈ రాశి వారికి అష్టమాధిపతి అయిన చంద్రుడు ఈవారం అష్టమ స్థానము  మరియు రాజ్యస్థానము లో.  సంచారం. ఈ సంచారం వలన ప్రతికూల ఫలితాలు కలుగును.పర గృహవాసం పర భోజనం చేయవలసి వస్తుంది. సమాజంలో అవమానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రభుత్వ సంబంధిత పనులు మధ్యలో నిలిచిపోవును. పొదుపు చేసిన ధనాన్ని తీసి ఖర్చు చేయాల్సి వస్తుంది. పనులలో ఆటంకాలు ఎదురవుతాయి.వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి . కుటుంబ సభ్యులతో సఖ్యతగా మెలగవలెను. సాహస నిర్ణయాలు తీసుకుని సమస్యలు తెచ్చుకుంటారు.  మధురమైన మాటలతో ఇతరులను ఆకట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి .పంతాలు పట్టింపులకు దూరంగా ఉండాలి. ఉదర సంబంధిత అనారోగ్య సమస్యలు రాగలవు.మానసిక వేదన ఒత్తిడి పెరుగుతాయి. ఉదర సంబంధిత అనారోగ్య సమస్యలు రాగలవు. పరామర్శ చేస్తారు .మానసిక ఆవేదన వ్యక్తం చేస్తారు. ఊహించని పరిణామాలు ఎదురవుతాయి.వారాంతం లో  ఉద్యోగం నందు అధికార అభివృద్ధి కలుగును.అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి అగును. హామీలు, మధ్యవర్తిత్వాల వల్ల చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది.
 

1113
telugu astrology

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
నామ నక్షత్రాలు:-(భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 8

ఈ రాశి వారికి కళత్రాధిపతి అయిన చంద్రుడు ఈ వారం కళత్ర స్థానం మరియు  భాగ్య స్థానంలో    సంచారం. ఈ సంచారం వలన మంచి శుభ ఫలితాలు పొందుతారు. తలపెట్టిన పనుల్లో విజయం సాధిస్తారు.మనస్సు నందు ఆందోళనగా ఉంటుంది.స్థిరాస్తి క్రయ విక్రయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఆర్థికపరమైన ఇబ్బందులు కొంతమేర చిరాకు కలిగిస్తాయి. ఉద్యోగాలలో చిక్కులు. ప్రయాణంలో  జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతిభకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. శుభవార్తలు వింటారు.నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు.దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. విలాసాలకు అధిక ధనం ఖర్చు చేస్తారు. మిత్రుల తో సఖ్యత గా ఉండవలెను.వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి.గృహంలో ప్రశాంతత వాతావరణం.వైవాహిక జీవితం ఆనందంగా గడుపుతారు. సంతోషకరమైన ప్రయాణం చేస్తారు. వృత్తి వ్యాపారాలలో ఊహించని ధన లాభం పొందగలరు. చేపట్టిన కార్యాలు లో మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి.వారాంతం లో  శారీరక పీడ. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి .చేసే పనుల్లో అలసత్వం పెరుగుతుంది. మానసిక భయాందోళన.


 

1213
telugu astrology

కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
నామ నక్షత్రాలు:-(గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 8

ఈ రాశి వారికి షష్ఠ మాధిపతి అయిన చంద్రుడు ఈ వారం శత్రు స్థానం మరియు ఆయుః స్థానం నందు సంచారము. ఈ సంచారం వలన శుభ ఫలితాలు పొందగలరు. ఆర్ధిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. సంఘంలో పెద్ద వారి  సహకారంతో లాభాలు పొందుతారు. కుటుంబ వృద్ధి కొరకు తగిన  నిర్ణయాలు తీసుకుంటారు. ప్రభుత్వ సంబంధిత వ్యవహారాలను సామరస్యంగా పరిష్కరించుకోవాలి. స్తిరాస్థి క్రయ విక్రయాల్లో తెలివిగా వ్యవహరించాలి. వాహన ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి. జీవిత భాగస్వామితో సఖ్యతగా మెలగవలెను. ఉద్యోగాలలో ఒత్తిడి తగ్గి ప్రశాంతత లభిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చేసే పనులలో మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో ఊహించని ధన లాభం కలుగుతుంది. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం చేకూరి ప్రశాంతత లభిస్తుంది.గత కొద్దిరోజులుగా ఉన్న అనారోగ్య సమస్యలు తీరి ప్రశాంతత లభిస్తుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. సమాజము నందు ప్రతిభ తగ్గ గౌరవం లభిస్తుంది. మిత్రుల యొక్క సహాయ సహకారాలతో పనులు సజావుగా పూర్తి చేయగలుగుతారు.వారాంతం లో  మానసిక ఉద్రేకాలు పెరుగుతాయి .ఆకస్మిక పరిణామాలు ఎదురవుతాయి. ఇతరులతో వాదోపవాదాలకు దూరంగా ఉండటం మంచిది.
 

1313
telugu astrology

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
నామ నక్షత్రాలు:-(దీ--దూ-ఝ-దా-దే-దో-చా-చి)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 3

ఈ రాశి వారికి పంచమాధిపతి అయిన చంద్రుడు ఈ వారం పంచమ స్థానం మరియు కళత్ర స్థానంలో సంచారం. ఈ సంచారం వలన వ్యతిరేక ఫలితాలుంటాయి. చేసే పనుల్లో అలసత్వం.కుటుంబం నందు ప్రతికూలత వాతావరణం.ఎంతగానో నమ్మిన మిత్రులే మీకు అపకారం చేయాలని చూస్తారు. వ్యసనాలకు దూరంగా ఉండాలి. సంతానం మూలంగా కొంత సమస్యలు రాగలవు.ఆర్థికంగా బలంగా ఉన్నప్పటికీ రుణాలు చేయవలసి ఉంటుంది .అనుకోని గొడవలు.సంఘంలో తెలివిగా వ్యవహారం చేయాలి. మనస్సు నందు తెలియని బాధలు  పెరుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకొని వలెను. కుటుంబ సమస్యల వలన నిరాశ నిస్పృహలకు లోనవుతారు. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉండును.ఆరోగ్య సమస్యలు రాగలవు.సంఘములో వ్యతిరేకతలు. ఊహించని సంఘటనలు ఎదురై భయానికి లోనవుతారు. మానసికంగా భయం గా ఉండటం. చేయు కార్యాలలో నిరాశ నిస్పృహలకు గురి అవుతారు. సమాజము నందు అవమానాలు కలగవచ్చు. వ్యవహారమంతా తికమకగా ఉండును.వారాంతం లో  సమాజము నందు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి .శరీర సౌఖ్యం లభిస్తుంది. కుటుంబ సమస్యలు తీరి ప్రశాంతత లభిస్తుంది.సంతోషకరమైన ప్రయాణం చేస్తారు. వ్యాపారంలో ధన లాభం పొందగలరు.


 

Recommended Photos