వార ఫలాలు : ఓ రాశివారికి వృత్తి వ్యాపారాలలో ధనలాభం

First Published | Sep 4, 2022, 10:01 AM IST

ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ వారం చెడు స్నేహాలకు దూరంగా ఉండండి.వృత్తి వ్యాపారాలలో ధనలాభం.మిత్రులతో కలహాలు.వారాంతంలో అనుకున్న పనులు పూర్తవుతాయి.విద్యార్ధులు పట్టుదలతో చదివిన మంచి ఫలితాలు పొందుతారు. 

Daily Horoscope 2022 New 12

రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరు నష్టపోతున్నారు. మొత్తం రాశుల వారికి ఎలా ఉంటుందో  ఈ వార ఫలాలు లో తెలుసుకుందాం
 

Daily Horoscope 2022 New 02

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)


మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):

ఈ వారం యోగదాయకం. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి.జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.అనవసరమైన ప్రయాణాలు.శారీరక శ్రమ.ఉద్యోగులకు పై అధికారులతో చికాకులు.ఇతరుల విషయంలో జోక్యం తగదు.చెడు స్నేహాలకు దూరంగా ఉండండి.వృత్తి వ్యాపారాలలో ధనలాభం.మిత్రులతో కలహాలు.వారాంతంలో అనుకున్న పనులు పూర్తవుతాయి.విద్యార్ధులు పట్టుదలతో చదివిన మంచి ఫలితాలు పొందుతారు. వేంకటేశ్వరస్వామిని స్మరించండి, ప్రశాంతత లభిస్తుంది. 
 


వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
ఈ వారం మీకు శుభములతో ఆనందంగా గడుస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు.కొంత కాలంగా నిలిచిపోయిన పనులు పూర్తి చేస్తారు.వృతి వ్యాపారాల అభివృద్ధి.సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది.గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి.ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలి.మనస్సు నందు అనవసరమైన ఆందోళన.వాహనాల విషయంలో నిర్లక్ష్యం తగదు.బందు మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. సూర్యస్తుతి మేలుచేస్తుంది.  ఆంజనేయస్వామిని స్మరించండి, కార్యసిద్ధి ఉంటుంది.
 


మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
ఈ వారం ఉద్యోగులకు పై అధికారుల ప్రోత్సాహం వలన చేయు పనిలో అభివృధిలోకి వెళతారు.వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి.విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు.గృహము నందు శుభకార్యాల ప్రస్తావన.సంఘంలో కీర్తి ప్రతిష్టలు.తలపెట్టిన పనులలో జాప్యం జరిగిన చివరికి పూర్తి చేస్తారు.ఆధ్యాత్మిక చింతన.దేవాలయ సందర్శన. వృత్తి వ్యాపారాలలో పెట్టుబడికి తగిన లాభాలు పొందుతారు. లక్ష్మీ ఆరాధన మంచిది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
ఈ వారం మీకు ఆధ్యాత్మకంగా కలిసి వస్తుంది. దైవకార్యాచరణ.గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి. భూ సంబందిత క్రయ విక్రయాలలో లాభాలు.మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు.నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు.స్థానచలనం.ఆదాయానికి మించి ఖర్చులు.ఇతరుల విషయంలో జోక్యం తగదు.కొంత మేర రుణాలు చేయవలసి రావచ్చు.వృత్తి  వ్యాపారాలకు సామాన్యం.అనవసరమైన ప్రయాణాలు. దత్తాత్రేయ స్వామిని ధ్యానిస్తే మంచిది.   

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
ఈ వారం కొద్దిగా సంక్లిష్టమైనది. కొద్దిగా ఇబ్బందులు పలకరిస్తాయి. సంఘంలో సమయానుకూలంగా వ్యవహరించవలెను.ఆకస్మిక ప్రయాణాలలో లాభాలు.ఉద్యోగము నందు చికాకులు.అధిక శ్రమ.ఆర్ధిక ఇబ్బందులు. భూ,గృహ క్రయ విక్రయాలు వాయిదా వేసుకోవడం మంచిది.అకారణంగా కోపం.మనస్సు నందు ఆందోళన.చెడు స్నేహాలకు దూరంగా ఉండండి.వృత్తి వ్యాపారాలలో స్వల్పలాభాలు. వారాంతంలో బంధు మిత్రుల కలయిక.  సూర్యాష్టోత్తరం చదివితే మేలు.

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
ఈ వారం మీకు పరీక్ష లాంటిది. ఆదాయానికి మించిన ఖర్చులు. తలపెట్టిన పనులలో ఆటంకాలు.మిత్రులతో కలహాలు. సోదరుల సహాయ సహకారాలు లభించును.వృత్తి వ్యాపారాల యందు అభివృద్ధి.ధనాదాయ మార్గాలు బాగుంటాయి. మనస్సు నందు అనవసరమైన ఆందోళన.ఉద్యోగులకు అనుకోని బదిలీలు.చేయు పని యందు ఒత్తిడి. భూ, గృహ క్రయ విక్రయాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఆరోగ్య సమస్యలు కొంత ఇబ్బందిపెడతాయి. నవగ్రహశ్లోకాలు చదవండి, మేలు జరుగుతుంది.


తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
ఈ వారం మీకు అన్ని విధాలా కలిసి వస్తుంది. తలపెట్టిన పనులలో విజయం సాదిస్తారు. గృహము నందు శుభకార్యాల ప్రస్తావన. బంధు మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు.ఉద్యోగము నందు పై అధికారుల వలన చికాకులు. ఆకస్మిక ధన లాభం.సంఘంలో పెద్దవారిని కలుస్తారు. జీవిత భాగస్వామితో చికాకులు. స్థానచలనం. అనవసరమైన ప్రయాణాలు. వృత్తి వ్యాపారాలలో లాభాలు.మీ ప్రతిభకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది.స్థిరాస్థి క్రయ విక్రయాలలో ధన లాభాలు. నూతన ఉత్సాహంతో కొత్త కార్యాలకు శ్రీకారంచుడతారు. ఆంజనేయస్వామిని స్మరించండి, కార్యసిద్ధి ఉంటుంది.

వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
ఈ వారం కాస్త ఖర్చుతో కూడినదే అయినా మేలు కలిగిస్తుంది. గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి.నూతన వస్తు వాహన కొనుగోలు.సంతాన విషయంలో శుభవార్త వింటారు.మీ ప్రతిభకు తగ్గ గౌరవం. తలపెట్టిన పనులలో ఆటంకాలు.ఉద్యోగస్తులకు పై అధికారుల ఒత్తిడి.చేయు వృత్తి వ్యాపారాల యందు లాభం.సంఘం నందు గౌరవం.కుటుంబంతో కలిసి ఆనందంగా గడుపుతారు.నమ్మిన వారి వలన  మోసపోవుట.చెడు స్నేహాలకు దూరంగా ఉండండి. ప్రయాణాలలో జాగ్రత్త వహించండి. ఇష్టదేవతాధ్యానం శక్తినిస్తుంది.  

ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
ఈ వారం మీరు కాస్తంత జాగ్రత్తగా ఉండాల్సిన విషయాలు ఉన్నాయి. మీరు తలపెట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడిన చివరికి పూర్తి చేస్తారు.ఉద్యోగులకు పై అధికారుల మన్నన. సంఘం నందు కీర్తి ప్రతిష్టలు.ఆర్ధిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అవసరాలకు ధనం  సమకూరుతుంది.వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు.మనస్సు నందు ఆందోళన.గృహము నందు చికాకులు.శ్రమాధిక్యం.అనుకోని ప్రయాణాలు. బంధు మిత్రులతో కలహాలు.ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. నవగ్రహశ్లోకాలు చదివితే అభీష్టసిద్ధి ఉంటుంది.

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
ఈ వారం మీకు అన్ని విధాల అనుకూలం. గృహము నందు శుభకార్యాలు.సంఘం నందు కీర్తి.ధన కనక వస్తు వాహన ప్రాప్తి.వృత్తి వ్యాపారాల యందు ధన లాభం. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.జీవిత భాగస్వామితో మనస్పర్ధలు.అనుకోని ప్రయాణాలు.గృహ,భూ క్రయ విక్రయాల నందు లాభం.కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు.ఉద్యోగులకు అనుకూలమైన పదోన్నతులు.వారాంతంలో మిత్రుల వలన ధననష్టం. . సూర్యారాధన శ్రేష్ఠం. 

కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
ఈ వారం కొద్ది పాటి సమస్యలు ఉన్నా నేర్పుగా ,ఓర్పుగా దాటేస్తారు. అందుకు భగవత్ సహాయం అవసరం. ఉద్యోగులకు అనుకూలమైన స్థానచలనములు.చేయు పనులలో ఆటంకాలు ఏర్పడిన చివరికి పూర్తి చేస్తారు.ఆర్ధిక ఇబ్బందులు కొంత చికాకు తెప్పిస్తాయి.మనస్సు నందు అనవసరమైన ఆందోళన. ఏ పని యందు ఆసక్తి లేకపోవుట.గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి.బందు మిత్రులతో కలహాలు.ప్రయాణాలలో జాగ్రత్తలు తీసుకోండి.వృతి వ్యాపారాలలో అభివృద్ధి కొరకు తగిన ప్రణాళికలు అనుసరిస్తారు. ఇష్టదేవతాస్మరణ మంచిది.

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
ఈ వారం మీకు అన్ని విధాలా అనుకూలం. ధైర్యంగా దూసుకుపోండి. సంఘంలో గౌరవ ప్రతిష్టలు.నూతన పరిచయాలు.నూతన వస్తు వాహన ప్రాప్తి.చ్చేయు వృత్తి వ్యాపారాల యందు ధనలాభం.తలపెట్టిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు.ఆదాయానికి మించిన ఖర్చులు.ఆరోగ్య విషయంలో కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటారు.అకారణంగా కోపం.బంధు మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు.గృహ నిర్మాణ ఆలోచనలు నెరవేరుతాయి. ఆంజనేయస్వామిని స్మరించండి, కార్యసిద్ధి ఉంటుంది.

Latest Videos

click me!