Weekly Horoscope: ఈ వారం ఓ రాశివారికి అన్నీ విజయాలే..!

First Published Dec 24, 2021, 3:11 PM IST

ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి.  ఓ రాశివారికి ఈ వారం ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. చాకచక్యంగా ముఖ్య వ్యవహారాలు పూర్తి చేస్తారు. 


మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి :- ఈ వారం చాకచక్యం, లౌక్యంతో నెట్టుకొస్తారు. ముఖ్య వ్యవహారాలలో పట్టువిడుపు ధోరణి మంచిది. సోదరులతో ఆస్తి తగాదాలు. ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు తప్పకపోవచ్చు. చేపట్టిన పనులు∙నిదానిస్తాయి. ఇంటాబయటా సమస్యలు చికాకు పరుస్తాయి. ఇంటి నిర్మాణయత్నాలలో అవరోధాలు. ఆరోగ్యం, వాహనాలు విషయంలో మరింత శ్రద్ధ వహించడం మంచిది. స్వల్ప లాభాలు. ఉద్యోగులు ఎంత కష్టపడ్డా మాటపడతారు. పారిశ్రామికవర్గాలకు శ్రమాధిక్యం. వారం మధ్యలో శుభవార్తలు. ఉద్యోగలాభం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృషభరాశి ( Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి  :-  ఈ వారం ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. చాకచక్యంగా ముఖ్య వ్యవహారాలు పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. పరిచయాలు మరింత పెరుగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. రాజకీయవర్గాలకు అందిన సమాచారం ఊరటనిస్తుంది. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం.  అనుకూలమైన శుభ ఫలితాల కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మిధునరాశి ( Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి :-  ఈ వారం కార్యరంగంలోకి దిగితే విజయాలే. ఎటువంటి కార్యాన్నైనా పట్టుదలతో పూర్తి చేయగలుగుతారు.  ఊహలు, అంచనాలు నిజం చేసుకుంటారు. మీ ఆధిక్యతను చాటుకుంటారు. ఇంటిలో శుభకార్యాల నిర్వహణతో బిజీగా గడుపుతారు.గృహ నిర్మాణయత్నాలు కలిసివస్తాయి. పలుకుబడి మరింత పెరుగుతుంది. వాహనాలు కొంటారు. వ్యాపారస్తులు అనుకున్న  లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగస్తులు ఇంక్రిమెంట్లు, పదోన్నతులను పొందుతారు. కళారంగం వారి ఆశలు ఫలించి ముందుకు సాగుతారు. వారం ప్రారంభంలో మానసిక అశాంతి. కుటుంబంలో సమస్యలు. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కర్కాటకరాశి ( Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి :- ఈ వారం ఆలోచనా శక్తి, ఇతరులను ఆకట్టుకునే తత్త్వంతో ఊహించని విజయాలు సాధిస్తారు. ఏ పని చేపట్టినా పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగయత్నాలు సానుకూలం. ఆర్థిక లావాదేవీలు అనుకున్నరీతిలో ఉంటాయి. ఇంటి నిర్మాణాలు పూర్తికావచ్చే సమయం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. స్థిరాస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి.. ధార్మిక కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. వ్యాపారస్తులు లక్ష్యాలు నిర్దేశించుకుని ముందుకు సాగుతారు. ఉద్యోగులకు విశేష గుర్తింపు తథ్యం. పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం. వారం చివరిలో వ్యయప్రయాసలు. ధనవ్యయం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి :-  ఈ వారం ఏ కార్యక్రమం ప్రారంభించినా విజయమే. దూరమైన ఆప్తులు, శ్రేయోభిలాషులు దగ్గరవుతారు. మీ ఆశయాలు, లక్ష్యాలు నెరవేరతాయి. దీర్ఘకాలంగా నెలకొన్న ఆస్తి వివాదాలు తీరతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు కలిసివస్తాయి. వివాహాది శుభకార్యాల నిర్వహణకు డబ్బు వెచ్చిస్తారు. తీర్థయాత్రలు చేస్తారు.  వ్యాపారాలలో  ఊహించని విధంగా లాభాలు పొందుతారు. ఉద్యోగాలలో మీ పనివిధానాన్ని అందరూ గుర్తిస్తారు. రాజకీయవర్గాలకు కొన్ని పదవులు రావచ్చు. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
 

కన్యారాశి ( Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి :- ఈ వారం కార్యజయం. దూరమైన కొందరు మిత్రులు తిరిగి దగ్గరకు చేరతారు. కుటుంబంలో సుఖసంతోషాలతో గడుపుతారు. వివాహాది శుభకార్యాల నిర్వహణలో భాగస్వాములవుతారు. యుక్తితో కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. ఆర్థికంగా బలం చేకూరుతుంది. ఇంటి నిర్మాణాలు చేపట్టే వీలుంది. ఉద్యోగలాభం. ఒక కోర్టు వ్యవహారం కొలిక్కి వస్తుంది. ఆరోగ్యం∙కుదుటపడుతుంది. వ్యాపారాలు అనుకున్నంతగా లాభిస్తాయి. ఉద్యోగాలలో ఉత్సాహంతో ముందుకు సాగుతారు. పారిశ్రామికవర్గాల ఆశలు నెరవేరతాయి. వారం ప్రారంభంలో ధనవ్యయం. బంధువులతో తగాదాలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
 


తులారాశి ( Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి :- ఈ వారం ఆత్మవిశ్వాసం, ధృడదీక్షతో సాగి అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. ఇంతకాలం పడ్డ ఇబ్బందులు తొలగుతాయి. ఇంటి నిర్మాణాలు, వాహనాలు కొనుగోలు యత్నాలు సానుకూలం. వివాహ ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. ఆరోగ్యపరంగా కొద్దిపాటి చికాకులు. ఆర్థిక లావాదేవీలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి.  వ్యాపారాలు ఊపందుకుంటాయి. అనుకున్న మేరకు లాభాలు. ఉద్యోగాలలో అనుకూల బదిలీలు ఉండవచ్చు. వారం ప్రారంభంలో మానసిక అశాంతి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృశ్చికరాశి ( Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి :- ఈ వారం ఆత్మస్థైర్యమే  ఆయుధంగా పనిచేస్తుంది. ఎంతోకాలంగా వేధిస్తున్న సమస్యల నుంచి గట్టెక్కుతారు. కొన్ని తీర్థయాత్రలు చేస్తారు. ఆర్థిక పరిస్థితిలో ఒడిదుడుకులు తొలగుతాయి.  గతంలో నిలిచిపోయిన పనులు కూడా పూర్తి చేస్తారు.  స్థిరాస్తి వృద్ధి.  కోర్టు వ్యవహారాలలో అనుకూలత. ఇంటి నిర్మాణాలు చేపడతారు. వివాహ, ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. మధ్యలో కొద్దిపాటి చిక్కులు కలిగినా అధిగమిస్తారు. ఉద్యోగాలలో మీ  ఊహలు ఫలిస్తాయి. రాజకీయవర్గాలకు అనుకోని విజయాలు వారం మధ్యలో అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

ధనుస్సురాశి  ( Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి :- ఈ వారం ఏ కార్యక్రమం చేపట్టినా విజయవంతంగా సాగుతుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. రుణదాతల ఒత్తిడుల నుంచి విముక్తి లభిస్తుంది. ఆశ్చర్యకరమైన రీతిలో సమస్యల నుంచి బయటపడతారు. వివాహాది శుభకార్యాలు నిర్వహిస్తారు. నిరుద్యోగులు ఉద్యోగలాభం పొందుతారు. గృహ నిర్మాణాలు సాగిస్తారు. ఆరోగ్యపరమైన చికాకులు తొలగుతాయి. వ్యాపారాలలో అవాంతరాలు అధిగమిస్తారు. ఉద్యోగాలలో ఉన్నతహోదాలు, మంచి గుర్తింపు తథ్యం. పారిశ్రామికవర్గాలకు అనుకూల కాలం.  కళారంగం వారికి అవకాశాలు మరింత దక్కుతాయి. వారం చివరిలో మానసిక ఆందోళన. శ్రమాధిక్యం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మకరరాశి ( Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి :- ఈ వారం ఆర్థిక వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. కొన్ని సమస్యలను సొంత ఆలోచనలతో పరిష్కరించుకుంటారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ముఖ్య విషయాలు చర్చిస్తారు. పలుకుబడి కలిగిన వారికి పరిచయాలు ఏర్పడతాయి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వాహనాలు కొంటారు. దూరపు బంధువులను కలుసుకుంటారు. విద్యార్థుల ఆశయాలు ఫలిస్తాయి. వ్యాపారాలు విస్తరణలో అడుగు ముందుకు వేస్తారు. ఉద్యోగాలలో పొరపాట్లు సరిదిద్దుకుంటారు. పారిశ్రామికవర్గాలకు కొన్ని విజయాలు చేకూరతాయి. వారం ప్రారంభంలో అనారోగ్యం. మిత్రుల నుంచి ఒత్తిడులు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ  11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కుంభరాశి  ( Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి :- ఈ వారం కొన్ని పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ముఖ్య సమావేశాలలో పాల్గొంటారు. దూరపు బంధువులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. చాకచక్యంగా కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. వివాహ, ఉద్యోగయత్నాలలో పురోగతి సాధిస్తారు. సమాజసేవలో భాగస్వాములవుతారు. మిత్రులతో విభేదాలు పరిష్కారమవుతాయి. వాహనాలు, భూములు కొంటారు. ఆర్థికంగా కొంత బలం చేకూరుతుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో హోదాలు పొందుతారు. కళారంగం వారికి ప్రోత్సాహకరం. వారం మధ్యలో ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. ధనవ్యయం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 
 

మీనరాశి ( Pices) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి :-  ఈ వారం ముఖ్యమైన  పనులను శ్రమపడ్డా ఎట్టకేలకు పూర్తి చేస్తారు. ఆత్మీయులు, బంధువులతో సఖ్యత నెలకొంటుంది. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి.  దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. నేర్పుతో ముందుకు సాగి విజయాలు సాధిస్తారు. వాహనాలు, ఇళ్లు కొనుగోలు చేసే అవకాశం ఉంది. తరచూ పుణ్యక్షేత్రాల సందర్శనం. ఉద్యోగయత్నాలు కలిసివచ్చే అవకాశం.  వ్యాపారాలు గతం కంటే మెరుగ్గా నడుస్తాయి.  ఉద్యోగాలలో పనిభారం నుంచి కొంత విముక్తి లభిస్తుంది. కళారంగం వారికి కొన్ని విజయాలు దక్కుతాయి. వారం మధ్యలో అనారోగ్యం. కుటుంబంలో సమస్యలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు.సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151
డిసెంబర్ 26 తేదీలో ఏర్పడే సూర్య గ్రహణం ఆ సమయంలో ఆరు గ్రహములు ఒకే రాశిలో ఉండటం వలన పన్నెండు రాశులపై ప్రభావం ఎలా ఉండబోతుంది, కొత్త సంవత్సరంలో తీసుకోబోయే నిర్ణయాలు గురించి వివరంగా తెలుసుకుందాం.
click me!