ఈ రాశుల వారితో పార్టీ.. భలే మజా తెస్తుంది..!

Published : Dec 24, 2021, 10:02 AM IST

అలాంటివారు లేకుండా.. పార్టీ  అంతా సరదాగా ఉండాలి అంటే... ఈ రాశులవారుతో పార్టీ చేసుకోవాలి. ఈ రాశులవారు పార్టీలో ఉంటే.. ఆ పార్టీకే హుషారు వచ్చేస్తుంది. మరి వారెవరో ఓసారి చూసేద్దామా..

PREV
16
ఈ రాశుల వారితో పార్టీ.. భలే మజా తెస్తుంది..!

మరో వారం రోజుల్లో  మనమంతా నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం.  ఈ న్యూ ఇయర్ వేడుకలను ఎంతో సరదాగా జరుపుకోవాలని ఆశపడతారు. అయితే.. మనం పార్టీ సరదాగా గడపాలి అనుకుంటే.. మనతోపాటు.. ఉండేవారు కూడా పార్టీ ఎంజాయ్ చేసేవాళ్లు అయితేనే బాగుంటుంది. అలా కాకుండా..  పార్టీ మూడ్ చెడగొట్టేవారు  కొందరు ఉంటారు. అలాంటివారు లేకుండా.. పార్టీ  అంతా సరదాగా ఉండాలి అంటే... ఈ రాశులవారుతో పార్టీ చేసుకోవాలి. ఈ రాశులవారు పార్టీలో ఉంటే.. ఆ పార్టీకే హుషారు వచ్చేస్తుంది. మరి వారెవరో ఓసారి చూసేద్దామా..

26

1.మేష రాశి..
ఈ రాశివారికి ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువ. ఈ రాశివారు పార్టీల్లో చాలా ఉత్సాహం చూపిస్తారు.  మరెవరూ లేని విధంగా.. వీరు పార్టీని ఆస్వాదిస్తారు. మీరు చేసుకునే పార్టీకి మేష రాశివారిని ఆహ్వానించండి. పార్టీకి మరింత కళను తీసుకువస్తారు. చాలా సరదాగా ఉంటారు. వీరితో పార్టీ చాలా బాగుంటుంది.

36

2.మిథున రాశి..
మిథున రాశివారు.. చాలా సౌమ్యంగా మాట్లాడతారు. వీరితో స్నేహం ఎప్పుడైనా చాలా సరదాగానే ఉంటుంది. వీరితో పార్టీ చేసుకుంటే.. ఆ సరదా మరింత పెరుగుతుంది. వీరు అందరితోనూ మంచి సమయం గడపడానికి ఇష్టపడతారు. వీరితో పార్టీ కూడా చాలా బాగుంటుంది. ఎవరినీ ఇబ్బంది పెట్టారు. డీజేలుగా మారి సందడి కూడా చేస్తారు.
 

46

3.సింహ రాశి..
ఈ రాశివారు కూడా పార్టీలను బాగా ఎంజాయ్ చేస్తారు. వీరు పార్టీల్లో డ్యాన్స్ లు చేయడానికి ... ఇతరులు కూడా డ్యాన్స్ చేయాలని అనుకుంటూ ఉంటారు. కాబట్టి.. వీరు ఉంటే పార్టీకి కొత్త ఉత్సాహం వస్తుంది.
 

56

4.తుల రాశి..
ఈ రాశివారు ఎవరితోనైనా ఇట్టే స్నేహం చేసేస్తారు. వీరికి ఎవరినైనా ఆకర్షించగల సత్తా ఉంటుంది. వీరితో గడపాలని చాలా మంది ఉత్సాహం చూపిస్తారు. వీళ్లే అందరికన్నా.. పార్టీలు హోస్ట్ చేయడానికి ఇష్టపడతారు. కాబట్టి.. వీరే ముందు పార్టీ ఏర్పాటు చేయాలని అనుకుంటారు.. ఎంతమంది పార్టీకి వచ్చినా.. వీరు మేనేజ్ చేయగలరు.

66


5.ధనస్సు రాశి..
మీరు పార్టీని చాలా హుషారుగా చేసుకోవాలి అనుకుంటే.. వెంటనే ధనస్సు రాశివారిని ఆహ్వానించండి. వీరు.. కొత్త కొత్త గేమ్స్ ఆడించడం..  సరదా ఆటలు ఆడించడం.. పార్టీని ఊర్రూతలూగిస్తారు. వీరికి అనుమతి ఇస్తే.. పార్టీని ఓ రేంజ్ లోకి మార్చేసి.. మరింత సందడి తీసుకువస్తారు. 

click me!

Recommended Stories