weekly rashifal
వార ఫలాలు : 21-1-24 నుండి 27-1-24 వరకు
జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది) 'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్: 8523814226 (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్య పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది? ఎవరికీ శుభం జరుగుతుంది.. వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి. ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ వారం రాశి ఫలాలు లో తెలుసుకుందాం
telugu astrology
మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
నామ నక్షత్రాలు(చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 9
అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రభుత్వ అధికారులు తో కలహాలు రాగలవు.ప్రభుత్వ సంబంధిత వ్యవహారాలను ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో ప్రయత్నించాలి . ఇష్టం లేని కష్టతరమైన ప్రయాణం చేయవలసి వస్తుంది.వాటి వల్ల నష్టమే ఏర్పడుతుంది. శరీర అనారోగ్య సమస్యలు వచ్చి దేహకాంతి క్షీణించవచ్ఛు. విలువైన వస్తువుల యందు జాగ్రత్త అవసరం. అనారోగ్య సమస్యలు రాగలవు. సామాన్యంగా నుండును.వృధా అనవసరమైన ప్రయాణాలు చేయవలసి వస్తుంది. అనవసరమైన ఖర్చులు పెరుగును. సమాజం లో అపనిందలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యమైన పనులలో ఆటంకాలు ఏర్పడి చికాకు పుట్టించును.
ద్వితీయ సప్తమాధిపతి అయన శుక్రుడు భాగ్యస్థానము నందు సంచారము ఈ సంచారం వలన శుభ ఫలితాలు చేకూరుతాయి.కొంత కాలముగా మనసు నందు తలచిన కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. వ్యవహారాలలో మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. మానసిక ఆనందం శారీరక సౌఖ్యం పొందగలరు. ఆధ్యాత్మిక చింతన పెరుగును. కీలకమైన సమస్యలు పరిష్కారమగును.
telugu astrology
వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
నామ నక్షత్రాలు(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 6
ఎంతటి కష్టతరమైన పని అయినా ప్రణాళికాబద్ధంగా విజయం సాధిస్తారు. స్థలాలు గృహం కొనడం నిర్మాణం చేయడం గాని చేస్తారు. వ్యవహారాలలో జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. కోర్టు విషయాలు అనుకూలంగా తీర్పు రాగలవు. విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఉన్నత విద్య ప్రయత్న ప్రయత్నాలు ఫలించును.అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. తలపెట్టిన కార్యాలు మిత్రుల సహాయ సహకారాల తో పూర్తి అగును . ఆర్థిక మరియు కుటుంబ విషయాలలో అభివృద్ధి కనబడుతుంది. శారీరక శ్రమ తగ్గి శరీర సౌఖ్యం లభిస్తుంది. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి చూపుతారు.
జన్మ షష్టమాధిపతి అయిన శుక్రుడు అష్టమ స్థానము నందు సంచారం.ఈ సంచారము వలన శుభ ఫలితాలు పొందగలరు. ఆర్థికంగా బలపడతారు. అధికారుల ఆదర అభిమానాల పొందగలరు. అనారోగ్య సమస్యలు తీరి ఆరోగ్యం కుదుటపడుతుంది. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చేస్తారు. మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. సమాజము నందు గౌరవ మర్యాదలు పొందగలరు.
telugu astrology
మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
నామ నక్షత్రాలు(కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 5
వివాహ ప్రయత్నాలు లో నిరాశ చెందుతారు. వ్యాపారంలో ధన నష్టం. వ్యాపార అభివృద్ధి విషయంలో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. అకారణంగా ఇతరులతో కలహాలు రాగలవు. దుష్ట కార్యకలాపాలకు దూరంగా ఉండాలి.ప్రభుత్వ అధికారులు తో విరోధాలు. తలపెట్టిన కార్యాలలో ఆటంకాలు.ఆర్థిక ఇబ్బందులు ఎదురవగలవు. సమాజము లో ప్రతికూలత వాతావరణ. కొన్ని సందర్భాల్లో మిత్రుల వలన నష్టము కలగవచ్చు. అనవసరమైన ఖర్చులు పెరగకుండా జాగ్రత్త వహించాలి. పై అధికారులతో లేదా యజమానులనుండి సమస్యలు అధికమించవలసి వస్తుంది. ఆరోగ్య విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. ఆధ్యాత్మికపరమైన విషయాలలో మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారు.
వ్యయ పంచమాధిపతి అయిన శుక్రుడు కళత్ర స్థానము నందు సంచారము ఈ సంచారము అనుకూలమైనది కాదు. వ్యవహారాల్లో కోపావేశాలు తగ్గించుకుని వ్యవహరించవలెను. కొద్దిపాటి కష్టనష్టాలు రాగలవు. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొనవలెను. ఇతరుల తో అకారణంగా విరోధాలు రాగలవు. వాద వివాదాలకు దూరంగా ఉండాలి.
telugu astrology
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
నామ నక్షత్రాలు (హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 2
అనవసరమైన ప్రయాణాలు చేయవలసి వస్తుంది. అకారణంగా స్త్రీల తోటి కలహాలు రాగలవు. స్థిరాస్తి విషయంలో ఇబ్బందులు మరియు వాహన గృహ భూ కొనుగోలు విషయంలో తగు జాగ్రత్తలు అవసరం.శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆదాయం ఎంత వచ్చినా మంచినీళ్లు వలె ఖర్చు అవుతుంది. ఆరోగ్యం సమకూరి ప్రశాంతత లభిస్తుంది. అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చేస్తారు. వృత్తి వ్యాపారాలలో ఊహించని ధన లాభం పొందగలరు. ఉద్యోగాలలో అధికారుల అభిమానాలు పొందగలరు. అనేక మార్గాల ద్వారా ఆదాయాన్ని పొందుతారు. ఆదాయ వృద్ధికి కొత్త అవకాశాలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు.
వ్యయ పంచమాధిపతి అయిన శుక్రుడు శత్రు స్థానం నందు సంచారము ఈ సంచారం వలన వ్యతిరేక ఫలితాలు రాగలవు. ఆర్థిక ఇబ్బందులు ఏర్పడి పొదుపు చేసిన ధనాన్ని తీసి ఖర్చు చేయవలసి వస్తుంది. పనులలో ఆతురత పెరిగి ఆటంకాలు ఎదురౌతాయి. సమాజంలో అవమానాలు ఎదురవగలవు. రుణాలు చేయవలసి వస్తుంది. ఊహించని సంఘటనలు ఎదురవుతాయి.
telugu astrology
సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
నామ నక్షత్రాలు (మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 1
అన్ని విషయాలు అనుకూలంగా ఉంటాయి. బంధుమిత్రుల యొక్క ప్రోత్సాహకాలు లభిస్తాయి. గృహంలో వివాహాది శుభకార్యాలు జరుగును. ప్రభుత్వ సంబంధిత పనులన్నీ సజావుగా జరుగుతాయి. ఉద్యోగాలలో అధికారులు తో సఖ్యత ఏర్పడుతుంది. మిత్రుల అండదండలతో ధైర్యంతో కార్యనిర్వహణ చేస్తారు.అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. వ్యవహారాల్లో బుద్ధి చాతుర్యం పెరుగుతుంది. దాంపత్య జీవితం బాగుంటుంది. తలపెట్టిన పనుల్లో విజయం సాధిస్తారు.వృత్తి వ్యాపారాల్లో ధన లాభం పొందగలరు. మీ మాటలతో అందరినీ ఆకట్టుకుంటారు.
లాభ చతుర్ధాధిపతి అయిన శుక్రుడు పంచమ స్థానమునందు సంచారం ఈ సంచారం వలన శుభ ఫలితాలు చేకూరును. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు కలసి వస్తాయి. మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. గత కొంతకాలంగా ఆగిన పనులు పూర్తి చేయగలుగుతారు. సంతానం కోసం ప్రయత్నించేవారు శుభవార్త వింటారు. వృత్తి వ్యాపారాల్లో ఊహించిన ధన లాభం లభిస్తుంది. శత్రువులపై పై చేయి సాధిస్తారు.
telugu astrology
కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
నామ నక్షత్రాలు (టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 5
అనారోగ్య సమస్యలు. ఉమ్మడి స్థిరాస్తి విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయి. శారీరక పటుత్వం తగ్గుతుంది. వ్యవహారాల్లో ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. కళాకారులు సామాన్యంగా ఉంటుంది. ఎన్ని అవకాశాలు వచ్చిన ఆదాయం అంతంత మాత్రమే లభిస్తుంది.దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. అభివృద్ధి కార్యక్రమాలకు గూర్చి ఆలోచనలు చేస్తారు. దూరపు ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఉద్యోగాలలో అధికారుల ఆగ్రహానికి గురి అవుతారు.కొన్ని రకాల అడ్డంగాల కారణంగా వృత్తి వ్యాపారంలో అంతంత మాత్రమే ఉండును
శుక్రుడు చతుర్ధ స్థానములో సంచారము ఈ సంచారం అనుకూలమైన ఫలితాలు పొందగలరు.బందు మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. శారీరకంగా మానసికంగా బలపడతారు. వ్యవహారాలలో సమయానుకూల సరైన నిర్ణయాలు తీసుకుంటారు. మిత్రులతో అభివృద్ధి చర్చలు జరుపుతారు. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ఉద్యోగ వ్యవహారాలు అనుకూలంగా ఉండును. చేయు పనులలో మిత్రుల యొక్క సహాయ సహకారాల లభిస్తాయి.
telugu astrology
తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 6
నామ నక్షత్రాలు (రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
విలువైన వస్తువులు యందు జాగ్రత్త అవసరం. పుత్ర సంతానం వలన సంఘంలో గౌరవం పెరుగుతుంది. విద్యార్థులకు కోరుకున్న విద్యలు లభిస్తాయి. నూతన వ్యాపారం ప్రారంభం చేస్తారు.మానసిక భయాందోళన.భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గి విరోధాలు రావచ్చు. ఉదర సంబంధిత అనారోగ్య సమస్యలు రాగలవు. పరామర్శ చేస్తారు .మానసిక ఆవేదన వ్యక్తం చేస్తారు. ఊహించని పరిణామాలు ఎదురవుతాయి. బందు మానసిక చికాకులు.ప్రయాణాల యందు ఇబ్బందులు ఎదురవుతాయి. చేయు పనులలో కోపం అధికంగా ఉండును.అపవాదములు రాగలవు అడ్డంకులు కారణంగా వ్యాపార వ్యవహారాలు అంతంత మాత్రమే ఉంటాయి.
అష్ఠమ జన్మరాశ్యాధిపతి అయిన శుక్రుడు తృతీయ స్థానంలో సంచారం ఈ సంచారం వలన కొద్దిపాటి వ్యతిరేక ఫలితాలు కలుగును.అనవసరపు ఖర్చులు అధికంగా ఉండును. వ్యాపారంలో ధన నష్టం రాకుండా జాగ్రత్త వహించవలెను. అపకారం చేసేవాళ్లు పెరుగుతారు. అన్నదమ్ముల సహాయ సహకారాలు లభిస్తాయి. చిన్న చిన్న ప్రయాణాలు లాభిస్తాయి. సన్నిహిత సంబంధాలు పెరుగును. ఇతరులతో వాదోపవాదములకు దూరంగా ఉండాలి.
telugu astrology
వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
నామ నక్షత్రాలు (తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 9
సమస్యలు ఏవైనా ఉంటే వాటికి పరిష్కార మార్గం లభిస్తుంది. గృహంలో శుభకార్యాలు జరుగును. ఉద్యోగ ప్రయత్నాలు గట్టిగా ప్రయత్నిస్తే మంచి ఉద్యోగం లభిస్తుంది. కొన్ని విషయాలు లో అపవాదము అపనిందలు ఎదుర్కోవలసి వస్తుంది.విదేశీ ప్రయాణం ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో అభివృద్ధి. సంఘంలో ప్రతిభకు తెలివితేటలకు తగిన గుర్తింపు లభిస్తుంది. ప్రతి పనిలోనూ ముందడుగు వేస్తారు. వైవాహిక జీవితం ఆనందంగా గడుపుతారు. సంతోషకరమైన ప్రయాణాలు చేస్తారు. వృత్తి వ్యాపారాలలో ఊహించని ధన లాభం పొందగలరు. చేపట్టిన కార్యాలలో మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి.
సప్తమ వ్యయాధిపతి అయిన శుక్రుడు ధనస్థానంలో సంచారము ఈ సంచారము వలన శుభ ఫలితాలు లభిస్తాయి.ఆరోగ్యం చేకూరి ప్రశాంతత లభిస్తుంది. జీవితభాగస్వామితో ఆనందంగా గడుపుతారు. సమాజము నందు కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. నూతన వస్తు వస్త్రాలు కొనుగోలు చేస్తారు. శారీరక శ్రమ తగ్గి శరీర సౌఖ్యం లభిస్తుంది. కుటుంబ అభివృద్ధి ఆనందం కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును. సన్మానాలు బహుమానాలు అందుకుంటారు. అందరితో మృదువుగా సంభాషణ చేస్తూ వ్యవహారాలను చక్కపెట్టుకుంటారు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది.
telugu astrology
ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
నామ నక్షత్రాలు (యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 3
వృత్తి వ్యాపారాల్లో అనేక లాభాలు పొందగలరు. ప్రారంభించి మధ్యలో ఆగిపోయిన పనులు పూర్తి కాగలవు . గత కొద్ది కాలంగా పడుతున్న ఇబ్బందుల నుంచి బయట పడతారు.మీ ఆశయాలు ఏవైతే ఉన్నాయో అన్ని నెరవేరుతాయి. అనుకోకుండా ధనలాభం కలుగుతుంది. అన్ని విధాల అభివృద్ధి చెందుతారు. స్థలాలు ఇల్లు కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి . ఉద్యోగాలు లో అధికారం కలుగుతుంది. ఆర్థిక విషయాలు మెరుగుపడతాయి. నూతన గృహ భూ కొనుగోలు చేస్తారు. విదేశీయాన ప్రయత్నాలు ఫలిస్తాయి
ఆర్థిక పరమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఆరోగ్య విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఏ ప్రయత్నం చేసిన ప్రతిఫలం లభిస్తుంది
షష్టమ లాభాధిపతి అయిన శుక్రుడుశుక్రుడు జన్మరాశిలో సంచారము ఈ వలన శుభ ఫలితాలు కలుగును.మానసిక ప్రశాంతత లభించును. ప్రయత్నించిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో ఊహించని ధన లాభం చేకూరుతుంది. ఇతరుల విషయాలలో దూరంగా ఉండవలెను. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఉద్యోగులకు ఉన్నత పదవులు లభించును. విద్యార్థులు పరీక్షలలో ఉత్తీర్ణత సాధిస్తారు. నూతన వస్తు వస్త్ర ఆభరణాలు లభించును. విలాసవంతమైన జీవితం గడుపుతారు.
telugu astrology
మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
నామ నక్షత్రాలు (భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 8
ఈ రాశి వారికి కళత్రాధిపతి అయిన చంద్రుడు ఈవారం శరీరంలో ఆరోగ్య బాధలు. నిరుత్సాహంగా ఉంటుంది. ఆలోచన విధానాలు మందగిస్తాయి. పరిశ్రమల నిర్వహణ శక్తి సామర్థ్యాలు తగ్గుతాయి. మనస్సునందు భయం గా ఉండటం. ప్రభుత్వ సంబంధిత పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. సమాజంలో గౌరవం తగ్గుతుంది. అనవసర ప్రయాణాలు వలన ధన నష్టం కలుగుతుంది. మానసికంగా శారీరకంగా బలహీనపడతాయి. మానసికంగా భయాందోళన గా ఉంటుంది. చేయు పనులలో బుద్ధి కుశలత తగ్గును. తలపెట్టిన కార్యాలలో ప్రతిబంధకాలు ఏర్పడగలవు. కుటుంబము నందు పెద్దవారి యొక్క ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొనవలెను.
పంచమ రాజ్యాధిపతి అయిన శుక్రుడు వ్యయస్థానము నందు సంచారము. ఈ సంచారము వలన మిశ్రమ ఫలితాలు పొందగలరు. అనవసరమైన ఖర్చుల యందు జాగ్రత్తలు తీసుకోవాలి. మానసిక ఆందోళన పెరుగును. విలువైన వస్తువుల యందు జాగ్రత్త అవసరము. వైవాహిక జీవితం ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉండును.
telugu astrology
కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
నామ నక్షత్రాలు (గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 8
ఉద్యోగాలలో అధికారులు తో అకారణంగా కలహాలు రాగలవు. ఉద్యోగాలు లో చేర్పులు మార్పులు జరుగును.వ్యాపారాల్లో పెట్టుబడులు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. కుటుంబంలో చికాకులు అధికమవుతాయి. సంతానం తో ఇబ్బందులు. ఆరోగ్య సమస్యలు రాగలవు. శారీరకంగా మానసిక ఇబ్బందులు అనేక ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. ధన లాభం పొందగలరు. విద్యార్థుల కు బాగుంది. జ్ఞాపక శక్తి పెరిగి పరీక్షల్లో ఉత్తమ శ్రేణి తో ఉత్తీర్లవుతారు. ఆర్థిక విషయాలు మెరుగుపడతాయి. నూతన గృహ భూ కొనుగోలు చేస్తారు. విదేశీయాన ప్రయత్నాలు ఫలిస్తాయి
చతుర్ధ నవమాధిపతి అయిన శుక్రుడుశుక్రుడు లాభ స్థానం నందు సంచారము ఈ సంచారం వలన శుభ ఫలితాలు పొందగలరు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యవహారాలలో మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. జీవిత భాగస్వామి తోటి ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాల్లో ధన లాభం కలుగును. కుటుంబము నందు ప్రశాంతమైన వాతావరణము. మానసిక ప్రశాంతత శారీరక సౌఖ్యం పొందగలరు. కీలకమైన సమస్యలను నిర్భయముగా ఎదుర్కొంటారు.
telugu astrology
మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
నామ నక్షత్రాలు (దీ--దూఝ-దా-దే-దో-చా-చి)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 3
వివాహ ప్రయత్నాలు చేసే వారికి అనుకూలం. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. అన్ని విధాల అభివృద్ధి కలుగును. ప్రత్యర్థులపై పై చేయి సాధిస్తారు. అన్ని రంగాల వారికి సమాజంలో గౌరవం లభిస్తుంది. సర్వ కార్యములందు లాభాలు పొందగలరు. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి ధనాభివృద్ధి పొందుతారు. ప్రారంభించి మధ్యలో ఆగిన పనులు పూర్తి అగును. ఆరోగ్య విషయాలు బాగుంటాయి. పరిశ్రమలు అభివృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో అధికారంతో కూడిన బదిలీలు .నూతన వస్తు ఆభరణాలు లభించును. మానసిక ప్రశాంతత లభిస్తుంది. అన్ని విధాల ప్రయోజనకరంగా ఉంటుంది.ధైర్య సాహసాలతో కీలకమైన సమస్యలను పరిష్కరించుకుంటారు.
తృతీయ అష్టమాధిపతి అయిన శుక్రుడుశుక్రుడు రాజ్యస్థానము నందు సంచారం ఈ సంచారం వలన ఇబ్బందులు కలుగును. మిత్రుల తోటి అకారణంగా కలహాలు రాగలవు. వృత్తి వ్యాపారాల యందు ధన నష్టం రాకుండా తగు జాగ్రత్తలు తీసుకొనవలెను. ఒక విషయం వలన మానసక ఆందోళన పెరుగును. శారీరక కష్టం పెరిగి బలహీనముగా నుండును. జీవిత భాగస్వామి తోటి మనస్పర్ధలు రాగలవు. ఇతరుల ఆర్థిక వ్యవహారాల్లో మధ్యవర్తిత్వానికి దూరంగా ఉండవలెను. సమాజం నందు అవమానాలు కలగవచ్చు. తలపెట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడగలవు.