
21 -1-2024 ఆది వారం మీ రాశి ఫలాలు (దిన ఫల,తారా ఫలాలుతో..)
జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ జ్యోతిష, జాతక, వాస్తు సిద్ధాంతి, స్మార్త పండితులు - గాయత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ విద్యార్థి) 'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్: 8523814226 (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్యలు చెప్పండి ...సాయంత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? ఎవరికీ శుభం జరుగుతుంది.. వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి. ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం
ప్రతి రాశికి చెందిన నక్షత్రాలకు తారాబలం చూపబడినది. వీటిలో (జన్మతార విపత్తార ప్రత్యక్తార నైధనతార) దోష ప్రదమైన తారలు
మీ నక్షత్రానికి ఉన్న తారాబలం చూసుకొని వ్యవహరించి శుభ ఫలితాలను పొందండి.
మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1)
నామ నక్షత్రాలు (చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
కొత్త పనులకు శ్రీకారం చేస్తారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. మిత్రుల సాయంతో విజయాలు సాధిస్తారు. విలువైన వస్తువులు సేకరిస్తారు. ఇంటికి సంబంధించిన వస్తువులను కొనుగోలు చేస్తారు. సోదరులతో వివాదాలు రాకుండా చూసుకోవాలి. ఉద్యోగాల్లో గుర్తింపు పొందుతారు. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారములో ధన లాభం పొందగలరు.అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు.
వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2)
నామ నక్షత్రాలు (ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
ఆర్థికంగా బలం చేకూరుతుంది. ఆస్తి వ్యవహారాలలో చిక్కులు తొలగి ప్రశాంత లభిస్తుంది. వ్యవహారాలలో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. బంధు మిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. రావలసిన సొమ్ము వసూలు చేసుకుంటారు. మానసిక ప్రశాంతత లభించును.ఎంతటి వారినైనా వాగ్ధాటితో ఆకట్టుకుంటారు. వ్యాపారాల్లో ధనలాభం కలుగుతుంది. ఉద్యోగాలలో అధికారుల మన్ననలు పొందగలరు.
మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3)
నామ నక్షత్రాలు (కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. బంధు మిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. రావలసిన సొమ్ము వసూలు చేసుకుంటారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది.ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.నూతన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు .వ్యాపార విషయంలో అభివృద్ధి చేస్తారు. ఉద్యోగులకు అనుకూలం.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4)
నామ నక్షత్రాలు (హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
దూరప్రాంతాల నుంచి శుభవార్తలు వింటారు.రావలసిన సొమ్ము అందుతుంది. సమస్యల నుంచి బయటపడతారు. ఆరోగ్యం బాగుంటుంది. బంధువులతో ఆనందంగా గడుపుతారు . సమాజములో గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఆసక్తికరమైన విషయాలు వింటారు.తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి అగును .నూతన వస్తు ఆభరణాలు కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి.వృత్తి వ్యాపారాలలో ఆశించిన ధన లాభం పొందగలరు.
సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1)
నామ నక్షత్రాలు (మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని సమస్యలు సునాయాసంగా పరిష్కారమవుతాయి. బంధువుల నుంచి ఆహ్వానాలు సంతోషం కలిగిస్తాయి. వ్యాపార లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. ఉద్యోగులు తమ శక్తి సామర్థ్యాలు నిరూపించుకుంటారు.శారీరక బాధలు పెరుగును. అధికారుల వలన భయాందోళనగాఉంటుంది. తలపెట్టిన పనులు పూర్తిగాక ఇబ్బందులు ఎదురవుతాయి . విద్యార్థులు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు.
కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2)
నామ నక్షత్రాలు:-(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాలి. తలపెట్టిన కార్యాలలో తగిన ప్రణాళికను సిద్ధం చేసుకుని ప్రారంభించుకుంటే మంచిది. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. కష్టాన్ని తగు ప్రతిఫలం లభిస్తుంది. ఉంటా బయట బాధ్యతలు ఒత్తిడికి లోనవుతారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. వాహన ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.
తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3)
నామ నక్షత్రాలు(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
అనుకున్న పనులు సకాలంలో పూర్తి కాగలవు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి.సమస్యలు తీరి ప్రశాంతత లభిస్తుంది. ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉండను. సమాజమునందు గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఆసక్తికరమైన విషయాలు వింటారు.బంధు మిత్రుల సహాయ సహకారాలు పొందుతారు. కొంతకాలం గా పడిన శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. వ్యాపారాల్లో అభివృద్ధి ఉంటుంది.
వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4)
నామ నక్షత్రాలు (తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-య)
ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి.ఇతరులతో అకారణంగా విరోధాలు ఏర్పడగలవు,జాగ్రత్త వహించవలెను. వ్యాపారములో ధన నష్టము రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పనుల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని ఎదుర్కొని పూర్తి చేయాలి. కుటుంబ సమస్యలు ఎదురవగలవు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.మానసిక చికాకులు.ప్రయాణాలలో ఇబ్బందులు ఎదురవుతాయి.
ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1)
నామ నక్షత్రాలు (యే-యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
తలపెట్టిన కార్యాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు.ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. వ్యయప్రయాసలు తప్పవు. వ్యాపారములలో జాగ్రత్త అవసరము. సమాజంలో అవమానాలు కలగ గలవు.చేయు వ్యవహారములో కోపం అధికంగా ఉంటుంది .ఆరోగ్యపరంగా కొద్దిపాటి చికాకులు. సోదరులు తో మిత్రులతో లేనిపోని వివాదాలు రాగలవు. ఆలయాలు సందర్శిస్తారు.
మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2)
నామ నక్షత్రాలు (భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
శారీరికంగా మానసికంగా ఏదో ఒక విధంగా ఇబ్బందిలు ఉండవచ్చు. తలపెట్టిన కార్య ప్రయత్నాలు ఫలించడం కష్టతరముగా ఉండును. సంతానానికి సంబంధించిన వ్యవహారాల్లో ఆందోళనలు చెందుతారు. వృత్తిపరమైన బాధ్యతలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో అకారణంగా కలహాలు రాగలవు. భయంకరమైన ఆలోచనలు వలన మానసిక ఒత్తిడి పెరుగును. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లకు ఒత్తిడి, చికాకు. ప్రయాణం వాయిదా వెయ్యడం మంచిది. ఉద్యోగానికి సంబంధించిన వ్యవహారాల్లో ప్రయోజనకరంగా పని చెయ్యాలి.
కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3)
నామ నక్షత్రాలు (గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
దూరపు బంధువుల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. సమస్యల నుంచి బయటపడతారు. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు. సమావేశాలలో పాల్గొంటారు. వాహన ప్రధానాలయందు జాగ్రత్త వహించాలి. తలపెట్టిన పనులు పూర్తిగాక ఇబ్బందులు ఎదురవుతాయి. ధన నష్టం రాగలదు వివాహయత్నాలు సానుకూలం. ఒక సంఘటన ఆకట్టుకుంటుంది. వ్యాపారాల్లో ధనలాభం కలుగును. ఉద్యోగులకు అనుకూలం.
మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4)
నామ నక్షత్రాలు (దీ-దూ-ఝ-దా-దే-దో-చా-చ)
ముఖ్యమైన పనులు పూర్తి కాగలవు . సంఘంలో గౌరవం పొందుతారు. శుభకార్యాలకు అధిక ధనాన్ని ఖర్చు చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో ధనలాభం. ఉద్యోగాలలో పనిభారం తగ్గుతుంది. ఉత్సాహం ఆత్మవిశ్వాసం తో గడుపుతారు. ప్రయత్నాలు ఫలిస్తాయి . విద్యార్థులు చదువుపై శ్రద్ధ చూపిస్తారు.ఆర్థిక సంబంధమైన లావా దేవీలు సంతృప్తికరంగా ఉంటాయి.