Your Weekly Horoscopes: ఓ రాశివారికి పెట్టుబడులు బాగా కలిసి వస్తాయి

First Published Apr 14, 2024, 10:00 AM IST

Your Weekly Horoscopes: రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ వారం రాశి ఫలాలు లో తెలుసుకుందాం
 
 

telugu astrology

వార ఫలాలు  :   14-4-2024   నుండి  20-4-2024  వరకు
  
 మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
నామ నక్షత్రాలు
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 9

4అన్ని విధములుగా యోగదాయకం గా ఉండును.మీ మాటకు పలుకుబడి పెరుగుతుంది. విద్యార్థులు పరీక్షల్లో ఊహించిన స్థాయిలో మార్కులు సాధిస్తారు. వ్యాపారస్తులకు వ్యాపారం లో బాగా జరుగును పెట్టుబడులు బాగా కలిసి వస్తాయి. రుణ బాధల నుంచి కొంత విముక్తి కలుగును.ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ప్రశంసలు దక్కును.కుటుంబ సభ్యుల సహాయంతో  పూర్తి కాని పనులు పూర్తి కాగలవు.వృత్తి వ్యాపారాలలో సమస్యలు ను అధిగమిస్తారు.ఉద్యోగాలలో వివాదాలు పరిష్కారమవుతాయి.
 

telugu astrology


వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
నామ నక్షత్రాలు(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 6

3ఉద్యోగస్తులకు పై అధికారుల వలన వేధింపులు ఒత్తిడి ఎక్కువగా ఉండును. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో అనుకున్న స్థాయి ఉత్తీర్ణత వచ్చుటకు కష్టపడాలి. వివాహాది శుభకార్య ప్రయత్నాలలో ఆటంకాలు ఏర్పడతాయి.ఇతరుల నుంచి విమర్శలు అపనిందలు ఎదుర్కోవలసి వస్తుంది. కుటుంబంలో బాధ్యతలు పెరుగుతాయి.ధనమును అధికంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. వ్యాపారస్తులకు అంతగా కలిసి రాదు.ఉద్యోగాలలో పని భారం పెరుగుతుంది. పట్టుదలతో బాధ్యతలు సకాలంలో పూర్తి చేస్తారు

telugu astrology


మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
నామ నక్షత్రాలు(కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 5

2ధనాదాయం బాగుండును.తలపెట్టిన శుభకార్యములు సజావుగా సాగుతాయి. వ్యాపారస్తులకు బాగా లాభపడతారు.సంఘంలో గౌరవం పెరుగుతుంది. శత్రువులు కూడా మిత్రులు  అవుతారు. కోర్టు వ్యవహారాలలో విజయం సాధిస్తారు.ప్రయాణాలు అనుకూలిస్తాయి.ఆరోగ్యపరంగా ఉపశమనం కలుగుతుంది.రావలసిన డబ్బు అందుతుంది.వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త పనులు చేపడతారు. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి.ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారులు నూతన ఒప్పందాలు చేసుకుంటారు.సమయోచిత నిర్ణయాల వల్ల లాభాలు పొందుతారు.వ్యాపారములో భాగస్థులు తో ఉన్న వివాదాలు తొలగుతాయి.

telugu astrology

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
నామ నక్షత్రాలు (హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 2
 
ప్రతి చిన్న విషయం నందు బాధపడుట జరుగును. స్థిరాస్తి విషయంలో నమ్మకద్రోహం కలిగే అవకాశం. విద్యార్థులు కష్టపడి చదవాలి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లో ఆటంకాలు ఏర్పడవచ్చు.ఉద్యోగస్తులకు పని ఒత్తిడి అధికంగా ఉంటుంది.వృధా ఖర్చు చేయాల్సి వస్తుంది. రుణదాతల నుండి అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కుటుంబంలో శాంతి వాతావరణం లోపించును.ఖర్చులు పెరుగుతాయి.భూ లావాదేవీల్లో జాగ్రత్తలు అవసరం.ఉద్యోగాలలో పని భారం పెరుగుతుంది. అధికారులు తో స్నేహం గా ఉండడానికి ప్రయత్నం చేయాలి.దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది.

telugu astrology

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
నామ నక్షత్రాలు (మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 1
 

మంచి పనుల నిమిత్తం ధనాన్ని ఖర్చు చేస్తారు.సంఘంలో ఇతరుల యొక్క అభిమానాన్ని పొందుతారు.ఎటువంటి సమస్యనైనా మీ తెలివితేటలతో యుక్తిగా పరిష్కరించుకుంటారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది.వివాహ ప్రయత్నాలు అనుకూలించును.ఖర్చుకు తగిన ధనం సమయానికి అందును. ఆరోగ్యం గతం కన్నా బాగుంటుంది.ప్రారంభించిన పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు.విద్యార్థులు శ్రమకు తగిన ఫలితాలు సాధిస్తారు.కళాకారులు కు మంచి అవకాశాలు వస్తాయి.ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.బంధువర్గంతో పనులు నెరవేరుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది.
 

telugu astrology


కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
నామ నక్షత్రాలు (టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 5
 
స్నేహితుల నుండి అన్నింటా ప్రోత్సాహం ఉండును.వ్యాపారస్తులకు ధనాదాయం బాగుంటుంది. ఉద్యోగస్తులకు శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది.విదేశీ విద్యకు ప్రయత్నాలు చేయువారికి అనుకూలం. భార్యాభర్తల మధ్య అనుకూలమైన వాతావరణం ఉంటుంది.భాగస్వామి వలన కలిసి వస్తుంది.నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేయడం జరుగును.వ్యాపారం అభివృద్ధి కోసం చేసిన శ్రమ ఫలిస్తుంది.నూతన కార్యాలు ఆచరణలో పెట్టి సత్ఫలితాలు పొందుతారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు కలిసివస్తాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఉత్సాహంగా ఉంటారు.

telugu astrology


తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 6
నామ నక్షత్రాలు (రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
 
ఆర్థికంగా కొంత రుణాలు చేయవలసి వచ్చును.ఇతరుల విషయాల్లో మధ్యవర్తిత్వం చేయుట మంచిది కాదు.వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగును. భాగస్వామ్య వ్యాపారాలు కలసి రావు.ఉద్యోగస్తులకు ఇష్టం లేని ప్రదేశానికి బదిలీ జరుగును. భాగస్వామ్యం మధ్య సఖ్యత లోపించును. సంతాన రీత్యా చికాకులు ఏర్పడును. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది.ప్రయాణాల్లో ఇబ్బందులు ఉంటాయి.వృథా ఖర్చులు పెరుగుతాయి.వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి.ఉద్యోగాలలో అధికారుల ఆగ్రహానికి గురి కావలసి వస్తుంది.చేపట్టిన పనుల్లో జాప్యం తప్పదు. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు రాగలవు.

telugu astrology


వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
నామ నక్షత్రాలు (తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 9
 
భార్యాభర్తల మధ్య చిన్నపాటి మనస్పర్థలు ఏర్పడగలవు.బంధు వర్గం వారితో విరోధములు ఏర్పడును.చేపట్టిన పనులు ఆటంకాలు వలన మధ్యలో నిలిచిపోవును.వ్యాపారస్తులకు ఆశించిన స్థాయి లాభాలు పొందడం కష్టంగా ఉంటుంది.నమ్మిన వారి నుండి మోసపోవడం జరుగును. అనారోగ్యం కారణంగా మానసికంగా బాధ కు లోనవుతారు.విద్యార్థులకు చదువు యందు శ్రద్ధ ఎక్కువగా ఉండును.ఇతరుల వ్యవహారాలలో మరియు వాదోపవాదాలకు జోక్యం చేసు కొనుట మంచిది కాదు.హామీలకు దూరంగా ఉండాలి.మానసిక ఆందోళన పెరుగుతుంది.

telugu astrology

ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
నామ నక్షత్రాలు (యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 3
 
తలచిన కార్యములు లో జయము కలుగును.రావాల్సిన బకాయిలు వసూలు అవును. ఉద్యోగాలలో ఉన్న వారికి అధికారుల నుంచి ప్రశంసలు దక్కును. విద్యార్థులు అన్ని రకాలుగా యోగ దాయకముగా ఉండును.వ్యాపారస్తులకు శ్రమకు తగిన ప్రతిఫలం కనిపించును.వివాహ ప్రయత్నములు చేయువారికి శుభవార్త వింటారు. గృహ నిర్మాణాలు నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు.ఉద్యోగాలలో మీ విలువ పెరుగుతుంది. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.వ్యాపారాలు లాభాల బాటలో ఉంటాయి.

telugu astrology

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
నామ నక్షత్రాలు (భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 8
 
ఉన్నతమైన వ్యక్తులు తో పరిచయాలు ఏర్పడతాయి.వారి యొక్క సహాయ సహకారాలు పొందుతారు.వ్యాపారస్తులు తగిన మెలకువలు తో వ్యాపారం చేసిన మంచి లాభాలు పొందుతారు. నిరుద్యోగులకు వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చు కుంటారు.ఆర్థికంగా అడ్డంకులను అధిగమిస్తారు.ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి.నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.ఆరోగ్యం మెరుగుపడుతుంది.ఆర్థికంగా పురోగతి సాధిస్తారు.వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు ఉన్నాయి.విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు

telugu astrology


కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
నామ నక్షత్రాలు (గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 8
 
బంధుమిత్రుల ద్వారా అంతగా కలిసి రాకపోవడం.అనుకున్న దానికన్నా ఖర్చులు అధికంగా పెరుగుతాయి.చేదు వార్త వినవలసి వస్తుంది.అనవసర ప్రయాణాలు కలిసి రావు.విద్యార్థులు చదువుపై శ్రద్ధ వహించాలి. అన్నింటా వ్యతిరేక ఫలితాలు కలుగును.తలచిన పనులు మధ్యలోనే ఆగిపోవును.ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.సంతానం నుంచి చిన్నపాటి సమస్యలు రాగలవు.ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు వల్ల సకాలంలో పూర్తి కావు.వృత్తి ఉద్యోగాల్లో  సమస్యలు ఉంటాయి. ఉద్యోగాలలో అధికారులు తో ఊహించని ఒత్తిడి పెరుగుతుంది.కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి.

telugu astrology

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
నామ నక్షత్రాలు (దీ--దూఝ-దా-దే-దో-చా-చి)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 3
 

విద్యార్థులు పోటీ పరీక్షలు లో ఊహించిన దానికన్నా తక్కువ మార్కులు రావచ్చు. వ్యాపార వ్యవసాయదారులకు పెట్టుబడులు విషయంలో ఎక్కువ ఖర్చు అవును. కొంతమేర రుణాలు చేయవలసి వస్తుంది.చిన్నపాటి అనారోగ్య సమస్యలు ఏర్పడును.ఇంకా బయట వాతావరణం గందరగోళంగా ఉంటుంది. మీపై ఇతరుల యొక్క ప్రభావం అధికంగా ఉండుటవలన మనశ్శాంతి కరువవుతుంది.ఉద్యోగులకు ఒత్తిడి పెరుగుతుంది.వ్యవహారాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది.వివాదాలకు దూరంగా ఉండాలి.రాబడి పెరుగుతుంది. ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉంటాయి.నూతన కార్యాలు వాయిదా వేయడం మంచిది

మనకు ఈ రాశి ఫలితాలు అందిస్తున్న వారు  జోశ్యుల రామకృష్ణ. ఈయన ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్ధాంతి, స్మార్త పండితులు - గాయత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ విద్యార్థి)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్యలు చెప్పండి ...సాయంత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
 
 

click me!