వార ఫలాలు : ఓ రాశివారికి వారాంతంలో శుభవార్తలు

First Published Nov 13, 2022, 10:05 AM IST

ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి  గృహ నిర్మాణాలు  నెమ్మదిగా సాగుతాయి . భూ స్థిరాస్తి క్రయవిక్రయాలు ఈవారం వాయిదా వేయడం మంచిది. చేయ ప్రయాణాలు జాగ్రత్తలు తీసుకోవాలి . 

Horoscope

రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరు నష్టపోతున్నారు. మొత్తం రాశుల వారికి ఎలా ఉంటుందో  ఈ వార ఫలాలు లో తెలుసుకుందాం

Vijaya Rama krishna

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)


మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):

ఈవారం సామాన్యంగా ఉంటుంది. అనేక ఆలోచనలు వలన తికమకగా ఉంటుంది.  గొడవలకు దూరంగా ఉండడం మంచిది. బుద్ధి కుశలత తగ్గును. తలపెట్టిన కార్యాలలో ఆటంకాలు ఏర్పడుతాయి. ఇంట బయట ప్రతికూలత వాతావరణం ఏర్పడవచ్చు. అనవసరమైన ఖర్చులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.  అనవసరమైన పనులకు దూరంగా ఉండడం మంచిది. దీర్ఘకాలిక అనారోగ్యాలు ఇబ్బందికరంగా ఉంటుంది.  కొన్ని మాటలు లేదా కొన్ని వార్తలు వలన బాధ కలుగుతుంది .  గృహ నిర్మాణాలు  నెమ్మదిగా సాగుతాయి . భూ స్థిరాస్తి క్రయవిక్రయాలు ఈవారం వాయిదా వేయడం మంచిది. చేయ ప్రయాణాలు జాగ్రత్తలు తీసుకోవాలి . ప్రభుత్వ సంబంధిత పనులలో ఆటంకాలు ఏర్పడవచ్చును  వారాంతంలో శుభవార్తలు వింటారు . సమాజము నందు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.


వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
ఈ వారం మిశ్రమంగా ఉంటుంది . తలపెట్టిన పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. నూతన వస్తూ వాహనాది  కొనుగోలు చేస్తారు. మిత్రులు సహాయం మీకు లభిస్తుంది. వృత్తి వ్యాపారయందు ధనలాభం కలుగుతుంది. మానసికంగా శారీరకంగా బలపడతారు.  ఇంటి యందు బయట కూడా మృదువుగా మాట్లాడుతూ వ్యవహారాలను చక్కబెట్టుకుంటారు. విందు వినోదాలలో పాల్గొంటారు. సోదర సహోదరుల సహాయ సహకారాలు వలన అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చేస్తారు. వారాంతంలో బంధుమిత్రులతో మనస్పర్ధలు . ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి.   కొన్ని సమస్యల వలన ధనం వృధాగా ఖర్చులు ఏర్పడతాయి. రావలసిన బాకీలు వసూలు చేసుకోవాలి.  ధనాధాయ మార్గాలు అన్వేషణ చేస్తారు .  చేయ పనుల యందు తొందరపడకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.


మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):

అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి.  ఇంటా బయట గౌరవం లేకపోవడం. చేయ పనుల యందు ప్రతిబంధకాలు ఏర్పడతాయి. పెట్టుబడుల విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. కొన్ని సమస్యల మనసునందు చికాకుగా ఉంటుంది. పట్టుదలతో చేసిన పనుల యందు విజయం లభించును. జీవిత భాగస్వామి తోటి ఆనందంగా గడుపుతారు. చెడు వార్తలు వినడం వలన బాధ కలుగుతుంది. ఉద్యోగమునందు అధికారుల యొక్క ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వృత్తి వ్యాపారములు సామాన్యంగా ఉంటాయి. ఇతరులతోటి సంభాషణ ఆలోచించి మాట్లాడాలి. భూ గృహ క్రయవిక్రయాలు యందు ధన లాభం కలుగుతుంది. వారాంతంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు.  కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి.
 

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
ఈ వారం లాభసాటిగా ఉంటుంది. శారీరకంగా మానసికంగా బలపడతారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. సంఘం నందు మీ ప్రతిభకు తగ్గ గౌరవం లభిస్తుంది. తలపెట్టిన కార్యాలు అన్ని విజయం చేకూరుతాయి. వృత్తి వ్యాపారాలు యందు ఊహించన ధన లాభం కలుగుతుంది.  పాత స్నేహాలు బలపడతాయి. కుటుంబ అభివృద్ధి కోసం తీసుకున్న  నిర్ణయాలు  ఫలిస్తాయి. కీలక సమస్యల యందు సమయస్ఫూర్తి తోటి వ్యవహరించాలి. శుభకార్యాలలో పాల్గొంటారు.  అనవసరమైన ప్రయాణాలు చికాకు పుట్టిస్తాయి. ప్రభుత్వ సంబంధిత పనుల్లో అవాంతరాలు ఏర్పడుతాయి. ఇతరులకు మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారు. వారాంతంలో  ధన లాభం నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి.

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
ఆదాయ మార్గాలు తగ్గుతాయి.వచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకోవాలి. ఇతరుల యందు ద్వేషం కోపం తగ్గించుకొని వలెను. చేయని పనులకు మీరు బాధ్యత వహించవలసి వస్తుంది. మనసునందు ఆందోళనగా ఉంటుంది .బంధుమిత్రులతో టి మనస్పర్ధలు వస్తాయి. అనవసరమైన ఖర్చులు బాధపెడతాయి. తలపెట్టిన పనులు ఆటంకాలు ఏర్పడతాయి. కోర్టు వ్యవహారాల్లో ప్రతికూలంగా ఉంటాయి . ఆర్థికంగా బలంగా ఉన్న  ఎంతో కొంత రుణం చేయవలసి ఉంటుంది . అనుకోని కలహాలు ఏర్పడును. చెడు స్నేహాలకు దూరంగా ఉండాలి . వారాంతంలో శుభవార్తలు వింటారు. ప్రయాణాలు లాభిస్తాయి . ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి .  తలపెట్టిన పనులలో పట్టుదలతో పూర్తి చేయాలి. ఖర్చులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి .

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
కోపతాపాలకు దూరంగా ఉండాలి. ఆదాయ మార్గాల్లో స్తబ్దత ఏర్పడతుంది.  మీ చుట్టూ ఉండే వారే మీకు అపకారం చేయాలని చూస్తారు .  కొత్త సమస్యలు ఏర్పడతాయి . కీలకమైన సమస్యలలో ధైర్యంగా ముందడుగు వేయండి. అనవసరమైన ఆలోచనతోటి సమయాన్ని వృధా చేయకండి. విద్యార్థులు చదువుపై దృష్టి సారించాలి. వృత్తి వ్యాపారం కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. గృహమునందు ఆహ్లాదకరమైన వాతావరణం .  జీవిత భాగస్వామి తోటి ఆనందంగా గడుపుతారు. ఆరోగ్యం చేకూరి ప్రశాంతత లభిస్తుంది. కొత్త పనులకు శ్రీకారం చేస్తారు. ఉద్యోగమనందు అధికారుల యొక్క స్నేహ సంబంధాలు బలపడతాయి.  వారాంతంలో మిత్రుల యొక్క సహాయ సహకారాలు అందుకుంటారు. తలపెట్టిన కార్యాలలో విజయం లభిస్తుంది. ఇంట బయట గౌరవం పెరుగుతుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు . విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేస్తారు.
 


తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):

ప్రభుత్వ సంబంధిత పనులు చురుగ్గా సాగును. బంధు మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఉద్యోగమునందు  అధికారుల యొక్క ఆదర  అభిమానములు లభించును. విద్యార్థులకు నూతన విద్య ఉద్యోగం అవకాశములు ప్రయత్నాలు ఫలించును. అనుకున్న పనులు అనుకొట్లు అనుకున్నట్లుగా జరుగుతాయి. గృహమునందు శుభకార్యములు ఘనంగా నిర్వహించారు. వృత్తి వ్యాపారముల యందు ధన లాభం కలుగుతుంది. ఆరోగ్యం సమకూరి ప్రశాంతత లభించును. అభివృద్ధి  కార్యక్రమాల ఆలోచనలు ఫలిస్తాయి. వచ్చిన అవకాశాల్ని అశ్రద్ధ చేయకుండా అందిపుచ్చు కొనవలెను.  కొత్త సమస్యలు ఏర్పడి మనసు నందు ఆందోళనగా ఉంటుంది. మిత్రు వలన కొన్ని సమస్యలు ఏర్పడగలరు చేయి పనుల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. సంఘము నందు గౌరవ ప్రతిష్టలు పెరుగును. ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు.

వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
అనవసరమైన కలహాలకు దూరంగా ఉండటం మంచిది. దీర్ఘకాలిక అనారోగ్యాలు వలన ఇబ్బందులు ఏర్పడవచ్చు. దూర ప్రయాణాలు వలన చికాకుగా ఉంటుంది. సంతానం తోటి ప్రతికూలత వాతావరణం . ఉద్యోగమునందు పై అధికారుల యొక్క ఒత్తిడిలు పని ఎక్కువగా ఉండడం జరుగుతుంది. మానసికంగా శారీరకంగా బలహీన పడతారు . మీరంటే ఇష్టం లేనివారు అపకారం చేయాలని చూస్తారు. అనవసరమైన ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. ఇంట బయట గౌరవం తగ్గుతుంది. చేయ పనులలో అలసత్వం పెరుగుతుంది . కుటుంబంలో పెద్దల యొక్క ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొని వలెను . ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు . తలపెట్టిన పనులన్నీ పట్టుదలతోటి పూర్తి చేయాలి. వారాంతంలో మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. జీవిత భాగస్వామ్య తోటి ఆనందంగా గడుపుతారు . చేయ పనుల్లో అభివృద్ధి కనబడుతుంది . వృత్తి వ్యాపారాలలో ధన లాభం కలుగుతుంది .
 

ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
కొన్ని విషయాలలో మానసికంగా బాధపడతారు . ఉద్యోగ వ్యాపారం నందు శ్రమ అధికంగా ఉంటుంది. ఇతరులతో వాదనలకు గాని గొడవలు గాని దూరంగా ఉండండి.  కీలకమైన సమస్యలు జీవిత భాగస్వామి తోటి చర్చించి  నిర్ణయాలు తీసుకొనే వలెను.  విలువైన వస్తువుల యందు తగు జాగ్రత్తలు వహించాలి .ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొని వలెను. దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. సంతానంతో ప్రతికూలత వాతావరణం ఏర్పడవచ్చు. శారీరకంగా బలహీనంగా ఉంటుంది. చేయ పనుల యందు పని ఒత్తిడి అలసట ఏర్పడతాయి. కొంతమంది మీకు హాని చేయాలని చూస్తారు. సమాజంలో గౌరవం తగ్గుతుంది. వారాంతంలో అనుకున్న పనులు సకాలంలో జరుగుతాయి .  గృహము నందు ఆనందకరమైన వాతావరణం . ఉద్యోగంలో అధికార ప్రాప్తి కలుగుతుంది.
 


మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
వృత్తి వ్యాపారముల యందు అధిక ధనలాభం కలుగుతుంది.  సమాజము నందు  పలుకుబడి పెరుగుతుంది.  మానసికంగా ఉత్సాహంగా ఉంటుంది. మిత్రుల యొక్క సహాయ సహకారములు లాభిస్తాయి. ప్రయాణాలు లాభిస్తాయి .  బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు . ఉద్యోగమనందు అనుకూలమైన మార్పులు చేర్పులు . తలపెట్టిన పనులు సకాలంలోనే పూర్తి అవుతాయి.  దాంపత్య జీవితం సంతోషంగాగడుపుతారు.  వివాహ ప్రయత్నాలు చేయు వారికి ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. గృహ నిర్మాణ పనులు ఆటంకాలు తొలగి ముందుకు సాగుతాయి .గృహమునందు పెద్దవారి యొక్క ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొని వలెను. రక్త సంబంధీకుల తోటి మనస్పర్ధలు ఏర్పడతాయి. కోపాన్ని అదుపులో ఉంచుకొని వ్యవహరించాలి. వారాంతంలో బలహీనంగా ఉంటుంది . అనవసరమైన ఖర్చులు ఆందోళనకు గురిచేస్తాయి . అనవసరమైన కలహాలు ఏర్పడతాయి.
 

కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
శుభవార్తలు వింటారు.ఆరోగ్యం సమకూరి ప్రశాంతత లభిస్తుంది. సంఘమునందు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. జీవిత భాగస్వామి తోటి ఆనందంగా గడుపుతారు . వృత్తి వ్యాపారముల యందు ధన లాభం కలుగుతుంది. నూతన వస్తు వాహన కొనుగోలు చేస్తారు . ఆర్థిక ఇబ్బందులు తొలగి తొలుగుతాయి . వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి రావలసిన బాకీలు వసూలు అవుతాయి. దైవ కార్యాలలో పాల్గొంటారు. ఇతరులకు మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారు. విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. తలపెట్టిన పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. నూతన పరిచయాలు కలిసి వస్తాయి. వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు . వారాంతంలో అధిక శ్రమ. పని వారి తోటి ఇబ్బందులు కలుగుతాయి. చెడు స్నేహాలకు దూరంగా ఉండండి. అనుకోని ప్రయాణాలు విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొనవలెను.
 


మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
కొత్త సమస్యలు ఏర్పడతాయి. మానసిక బాధలుంటాయి. చేయు పని యందు నిర్లక్ష్యం వహిస్తారు . నిరాశ నిస్పృహలకు లోనవుతుంటారు. ఆర్థిక సమస్యలు  ఇబ్బంది పెడతాయి. చేయ పనుల యందు ఆటంకాలు ఏర్పడును. ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి.  గృహమునందు సమాజము నందు  ప్రతికూలంగా ఉంటుంది. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగం నందు అధికారుల యొక్క ఒత్తిడి అధికంగా ఉంటుంది.  ఇతరులతోటి వాదనలకు దూరంగా ఉండండి. ఆ కారణ కోపాలు కొత్త సమస్యలు ఏర్పడును . ముఖ్యమైన వస్తువుల యందు జాగ్రత్తగా ఉండండి. వారాంతంలోవృత్తి వ్యాపారాల యందు ధనలాభం కలుగుతుంది. సమాజము నందుమీ ప్రతిభకుతగ్గ గౌరవం లభిస్తుంది . మనసు నందు ఉత్సాహంగా ఉంటుంది. మిత్రుల యొక్క సహాయ సహకారా లభిస్తాయి. కుటుంబ అభివృద్ధి మీకు ఆనందం కలిగిస్తుంది. గృహ  క్రయవిక్రయాలునిర్మాణాలు పనులు కలిసి వస్తాయి.  ఉద్యోగం కోసం నిరీక్షించే వారికి శుభవార్త వింటారు.

click me!