daily horoscope 2023 New 01
వార ఫలాలు :13 ఆగస్ట్ 2023 నుంచి 19 ఆగస్ట్ 2023 వరకూ
జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది) 'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం. - ఫోన్: 8523814226 (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది? ఎవరికీ శుభం జరుగుతుంది.. వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి. ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ వారం రాశి ఫలాలు లో తెలుసుకుందాం.
telugu astrology
మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
నామ నక్షత్రములు:-(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 9
ఆర్థిక లావాదేవీలు బాగుండును.నిరుద్యోగులు ప్రయత్నాలు ఫలించును. కష్టపడిన శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. నూతన వస్తు వాహనాదివ కొనుగోలు చేస్తారు. బంధువర్గము నుండి ఆహ్వానం అందుతుంది. గత కొంతకాలంగా ఉన్న ఆలోచనలను కార్యాచరణలో పెడతారు. వ్యాపారాల అభివృద్ధి కొరకు నిర్ణయాలు తీసుకొంటారు.కీలక నిర్ణయాలు తీసుకుంటారు. దూరప్రయాణాలు కలిసి వస్తాయి. అన్ని వ్యవహారాల యందు ప్రోత్సాహకరంగా ఉంటుంది. రావలసిన సొమ్ము అందుతుంది. వివాదాలు నుంచి బయటపడే అవకాశం.బంధువులతో కలిసి ఆనందంగా గడుపుతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.వాహనసౌఖ్యం కలుగును.
ఈ వారం అశ్విని నక్షత్రం వారికి శుభదినములు:- 15-8మంగళవారం/ 16-8బుధవారం/ 18-8శుక్రవారం/
ఈ వారం భరణి నక్షత్రం వారికి శుభదినములు:-14-8సోమవారం/ 16-8బుధవారం/ 17-8గురువారం/ 19-8శనివారం/
ఈ వారం కృత్తిక నక్షత్రం వారికి శుభదినములు:-15-8మంగళవారం/ 17-8గురువారం/ 18-8శుక్రవారం/
telugu astrology
వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
నామ నక్షత్రములు:-(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 6
ఉద్యోగమునందు అధికారుల వలన ఇబ్బందులు ఎదురవుతాయి. అధిక ఖర్చులు. తలపెట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడి చికాకులు కలిగిస్తాయి. సన్నిహితులతో అనవసరమైన కలహాలు. గృహ నిర్మాణ ఆలోచనలను వాయిదా వేసుకోవడం మంచిది. సంతాన విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకోవడం మంచిది. అనవసరమైన ఆలోచనలు చేస్తారు. ఆరోగ్య విషయంలో దీర్ఘకాలిక రోగములు ఇబ్బంది కలిగిస్తాయి. చెడు సావాసాలకు దూరంగా ఉండండి. మనసునందు ఆందోళన.శారీరక శ్రమ అధికంగా ఉండును.కొంత మేర రుణాలు చేయవలసి వస్తుంది. రుణ రోగ శత్రు పెరుగునుమ. ఉద్యోగ వృత్తి వ్యాపారులకు సామాన్యం. కుటుంబంలో ప్రతికూల వాతావరణం. సహోద్యోగులతో మనస్పర్ధలు. పై అధికారుల నుండి ఒత్తిడి. సంఘంలో తెలివిగా వ్యవహరించవలెను. ఆదాయానికి మించిన ఖర్చులు. ఆధ్యాత్మిక చింతన. తలపెట్టిన పనులలో ఆటంకాలు.
ఈ వారం కృత్తిక నక్షత్రం వారికి శుభదినములు:-15-8మంగళవారం/ 17-8గురువారం/ 18-8శుక్రవారం/
ఈ వారం రోహిణి నక్షత్రం వారికి శుభదినములు:- 14-8సోమవారం/ 16-8బుధవారం/ 18-8శుక్రవారం/ 19-8శనివారం/
ఈ వారం మృగశిర నక్షత్రం వారికి శుభదినములు:-15-8మంగళవారం/ 17-8గురువారం/ 19-8శనివారం/
telugu astrology
మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
నామ నక్షత్రములు:-(కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 5
శుభవార్తలు అందును.ప్రారంభించిన పనులలో ఇబ్బందులు ఎదురైనా చివరకు పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి మీ అంచనాలు అందుకుంటారు. రుణ బాధలు తగ్గి ప్రశాంతత లభించును. సంఘము నందు నూతన పరిచయాలు ఏర్పడగలవు. చిన్ననాటి స్నేహితులతో కలిసి ఆనందంగా గడపగలరు. విద్యార్థులకు అనుకూలంగా ఉండను. వృత్తి వ్యాపారములు యందు లాభాలు పొందగలరు. ఉద్యోగమునందు విధి నిర్వహణ సక్రమంగా నిర్వహిస్తారు. కీలకమైన సమస్యలు పరిష్కారమగును. ఉద్యోగాల్లో అభివృద్ధి కనిపిస్తుంది . నూతన వ్యాపారాలందు విజయం సాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలు లాభిస్తాయి. ఆర్థిక విషయాల్లో అభివృద్ధి సాధిస్తారు.గృహనిర్మాణ ప్రయత్నాలు ఫలిస్తాయి. దంపతుల మధ్య సదావగాహన ఏర్పడుతుంది. విద్యార్థులు విద్య యందు రాణిస్తారు. ఉన్నత విద్యా విషయాలు యందు ప్రయత్నాలు ఫలించును.
ఈ వారం మృగశిర నక్షత్రం వారికి శుభదినములు:-15-8మంగళవారం/ 17-8గురువారం/ 19-8శనివారం/
ఈ వారం ఆరుద్ర నక్షత్రం వారికి శుభదినములు:-14-8సోమవారం 16-8బుధవారం/ 18-8శుక్రవారం/
ఈ వారం పునర్వసు నక్షత్రం వారికి శుభదినములు:-15-8మంగళవారం/ 17-8గురువారం/ 19-8శనివారం/
telugu astrology
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
నామ నక్షత్రములు:-(హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 2
చేయ పనులలో బుద్ధి కుశలత తగ్గి ఆటంకములు ఏర్పడగలవు. ఉద్యోగ ప్రయత్నాలలో అనుకోని రీతిలో ఇబ్బందులు. భూ గృహ క్రయ విక్రయాలు యందు జాగ్రత్త అవసరము. కోర్టు న్యాయ సంబంధిత వ్యవహారములు అనుకూలమైన తీర్పులు రావచ్చు. వృత్తి వ్యాపారములు లాభసాటిగా జరుగును. ఆదాయ మార్గాలు ధన ఆలోచన చేస్తారు.
ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. కుటుంబసభ్యులతో వివాదాలు రాగలవు.ఇంటాబయటా ఒత్తిడులు పెరుగును. దూరప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆరోగ్యపరంగా చికాకులు. దైవ దర్శనాలుఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులక
పట్టుదలతో చదవ వలెను.ఆదాయానికి మించిన ఊహించని ఖర్చులు
ఈ వారం పునర్వసు నక్షత్రం వారికి శుభదినములు:-15-8మంగళవారం/ 17-8గురువారం/ 19-8శనివారం/
ఈ వారం పుష్యమి నక్షత్రం వారికి శుభదినములు:-14-8సోమవారం/ 16-8బుధవారం/ 17-8గురువారం/ 18-8శుక్రవారం/
ఈ వారం ఆశ్రేష నక్షత్రం వారికి శుభదినములు:-14-8సోమవారం/ 15-8మంగళవారం/ 17-8గురువారం/ 19-8శనివారం/
telugu astrology
సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
నామ నక్షత్రములు-:-(మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 1
జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. మొండి బాకీలు వసూలు చేస్తారు. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. అనవసరమైన ప్రయాణాలు. విలువైన వస్తువుల యందు జాగ్రత్త అవసరం. . దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో జీవిత భాగస్వామి యొక్క సలహాలు తీసుకోవడం మంచిది.ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం తగదు.నూతన కార్యాలకు శ్రీకారం చేస్తారు. బంధువులతో కలిసి ఆనందంగా గడుపుతారు.ఉద్యోగయత్నాలలో మీ కృషికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. వస్తు ఆభరణాలు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులకు అనుకూలం. ఉత్సాహంగా గడుపుతారు
ఈ వారం మఖ నక్షత్రం వారికి శుభదినములు:- 15-8మంగళవారం/ 16-8బుధవారం/ 18-8శుక్రవారం/
ఈ వారం పూ.ఫల్గుణి నక్షత్రం వారికి శుభదినములు:-14-8సోమవారం/ 16-8బుధవారం/ 17-8గురువారం/ 19-8శనివారం/
ఈ వారం ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి శుభదినములు:-15-8మంగళవారం/ 17-8గురువారం/ 18-8శుక్రవారం/
telugu astrology
కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
నామ నక్షత్రములు:-(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 5
ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. పనులు సకాలంలో పూర్తి అగును. నూతన వస్తు వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు.విద్యార్థుల ప్రతిభ కనబరుస్తారు.చిన్ననాటి మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. స్థిరాస్తుల కొనుగోలు ప్రయత్నాలు ఫలించును. వృత్తి వ్యాపారంలో లాభాలు పొందగలరు.ఆదాయ మార్గాలు పెరుగును.వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి కలుగును.సంతానం అభివృద్ధి ఆనందం పొందగలరు.వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు ఉన్నత విద్య ప్రయత్నాలు ఫలిస్తాయి. పెద్దల ఆరోగ్యం విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఖర్చులు పెరుగును. పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. చేయు వ్యవహారం నందు ఎన్ని ఇబ్బందులు ఎదురైన అధిగమించి మీరు అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. అన్ని విధాల ప్రోత్సాహకరంగా ఉంటుంది.
ఈ వారం ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి శుభదినములు:-15-8మంగళవారం/ 17-8గురువారం/ 18-8శుక్రవారం/
ఈ వారం హస్త నక్షత్రం వారికి శుభదినములు:- 14-8సోమవారం/ 16-8బుధవారం/ 18-8శుక్రవారం/ 19-8శనివారం/
ఈ వారం చిత్త నక్షత్రం వారికి శుభదినములు:-15-8మంగళవారం/ 17-8గురువారం/ 19-8శనివారం/
telugu astrology
తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 6
నామ నక్షత్రములు:-(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
ఆచితూచి మాట్లాడ వలెను . శారీరకంగా మానసికంగా బలహీనపడతారు . మనసునందు ఆందోళనగా ఉంటుంది. బంధువుల తోటి మనస్పర్ధలు రాగలవు. తలపెట్టి పనులలో ఆటంకాలు.దురాలోచనలకు దూరంగా ఉండండి.ఇతరులతోటి వాదనలు తగ్గించుకోవాలి .కుటుంబ సభ్యుల తోటి సఖ్యతగా మెలగండి. చేయ వృత్తి యందు సామాన్యంగా ఉండగలదు. వ్యాపారం నందు పెట్టుబడులు వాయిదా వేయడం మంచిది. ఆర్థిక ఇబ్బందులు ఎదురవగలవు. కొన్ని సంఘటనలు వలన భయాందోళనలు చెందుతారు. మీరు నమ్మిన వారవలనే మీకు మెసగించ బడతారు. కుటుంబం నందు ప్రతికూలత
ఈ వారం చిత్త నక్షత్రం వారికి శుభదినములు:-15-8మంగళవారం/ 17-8గురువారం/ 19-8శనివారం/
ఈ వారం స్వాతి నక్షత్రం వారికి శుభదినములు:-14-8సోమవారం 16-8బుధవారం/ 18-8శుక్రవారం/
ఈ వారం విశాఖ నక్షత్రం వారికి శుభదినములు:-15-8మంగళవారం/ 17-8గురువారం/ 19-8శనివారం/
telugu astrology
వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
నామ నక్షత్రములు:-(తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 9
శారీరిక మానసిక అనారోగ్యాలు ఏర్పడగలవు. ఇతరుల మీద చెడు అభిప్రాయం రాగలదు. అనుకున్న సమయంలో అనుకున్న రీతిలో సౌకర్యాలు లభించడం కష్టమగా ఉండును. తలచిన పనులలో ఆటంకాలు ఎదురవుతాయి. రావలసిన బాకీలు స్తబ్దత ఏర్పడి ఇబ్బందులు గురి అవుతారు. ప్రభుత్వ సంబంధిత పనులు మందగించును. ఇతరులతోటి చిన్న చిన్న వివాదాలు ఏర్పడగలవు. ఉద్యోగం నందు అధికారుల యొక్క ఆగ్రహానికి గురి కావచ్చు . ఊహించని రీతి గా అధిక ఖర్చులు ఏర్పడగలవు .అనవసర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. చెడు స్నేహాలకు దూరంగా ఉండండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకొనవద్దు
ఈ వారం విశాఖ నక్షత్రం వారికి శుభదినములు:-14-8సోమవారం/ 16-8బుధవారం/ 17-8గురువారం/ 18-8శుక్రవారం/
ఈ వారం అనూరాధ నక్షత్రం వారికి శుభదినములు:-14-8సోమవారం/ 16-8బుధవారం/ 17-8గురువారం/ 18-8శుక్రవారం/
ఈ వారం జ్యేష్ట నక్షత్రం వారికి శుభదినములు:-14-8సోమవారం/ 15-8మంగళవారం/ 17-8గురువారం/ 19-8శనివారం/
telugu astrology
ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
నామ నక్షత్రములు:-(యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 3
ఉద్యోగమునందు అధికారుల యొక్క ఆదరణ పొందుతారు. ఆర్థికంగా లాభపడతారు.నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి.వచ్ఛిన అవకాశాలను మీకు అనుకూలంగా మార్చుకుంటారు. యంత్రాల యందు వాహనాల యందు జాగ్రత్త అవసరము. సంతాన అభివృద్ధి ఆనందం కలిగిస్తుంది. ధనాన్ని ఇచ్చి పుచ్చుకునే వ్యవహారముల నందు జాగ్రత్త అవసరం. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.వృత్తి వ్యాపారములు అనుకూలించను. అకారణ కోపం చేత తలపెట్టిన పనులలో ఆటంకాలు ఎదురౌతాయి. ఇతరుల యొక్క సహాయ సహకారాలు పొందుతారు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. శారీరక శ్రమ తగ్గి శరీర సౌఖ్యం లభిస్తుంది.
ఈ వారం మూల నక్షత్రం వారికి శుభదినములు:- 15-8మంగళవారం/ 16-8బుధవారం/ 18-8శుక్రవారం
ఈ వారం పూ.షా నక్షత్రం వారికి శుభదినములు:-14-8సోమవారం/ 16-8బుధవారం/ 17-8గురువారం/ 19-8శనివారం/
ఈ వారం ఉ.షా నక్షత్రం వారికి శుభదినములు:-15-8మంగళవారం/ 17-8గురువారం/ 18-8శుక్రవారం/
telugu astrology
మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
నామ నక్షత్రములు:-(భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 8
వృత్తి వ్యాపారాలలో ధన లాభాలు.భూ గృహ క్రయవిక్రయాలు కలిసి వస్తాయి. వివాహ ప్రయత్నాలకు అనుకూలం. దూర ప్రయాణాలలో లాభాలు పొందుతారు. ఆధ్యాత్మిక చింతచ. దైవ కార్యాలలో పాల్గొంటారు. కుటుంబంతో కలిసి ఆనందంగా గడుపుతారు. కోర్టు వ్యవహారములలో అనుకూలమైన వాతావరణం. ప్రభుత్వ సంబంధిత పనులలో పురోగతి. సంఘము నందు మీ గౌరవం పెరుగుతుంది. బంధుమిత్రుల కలయిక. రుణ బాధలు తీరి ఉపశమనం పొందుతారు.ఆదాయం మార్గాలు బాగుంటాయి. రుణాలు తీర్చే ప్రయత్నాలు చేస్తారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. తలచిన పనులు అనుకున్న సమయంలో పూర్తి అవును. నూతన వ్యాపార ఆలోచనలు చేస్తారు. కీలకమైన సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి.బంధుమిత్రుల సహకారం లభిస్తుంది.
ఈ వారం ఉ.షా నక్షత్రం వారికి శుభదినములు:-15-8మంగళవారం/ 17-8గురువారం/ 18-8శుక్రవారం/
ఈ వారం శ్రవణం నక్షత్రం వారికి శుభదినములు:- 14-8సోమవారం/ 16-8బుధవారం/ 18-8శుక్రవారం/ 19-8శనివారం/
ఈ వారం ధనిష్ఠ నక్షత్రం వారికి శుభదినములు:-15-8మంగళవారం/ 17-8గురువారం/ 19-8శనివారం/
telugu astrology
కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
నామ నక్షత్రములు:-(గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 8
చేయ పనులలో శ్రమ అధికంగా ఉంటుంది. సంఘంలో అగౌరవం రాగలదు. ఉద్యోగము నందుఅధికారులతోటి అకారణంగా గొడవలు. శారీరక గాయాలు ప్రమాదాలు జరిగే అవకాశం. భూ గృహ నిర్మాణ పనులు వాయిదా వేయడం మంచిది. భార్య ఆరోగ్య విషయంలోజాగ్రత్తలు తీసుకొనవలెను. వృత్తి వ్యాపారులు. సామాన్యంగా ఉండును. ఇతరులతోటి వాదోపవాదములకు దూరముగా ఉండవలెను. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అత్యధికమైన ఖర్చులు. కుటుంబ సభ్యులతో అకారణంగా మనస్పర్ధలు. అవమానాలు అపనందులు రాగలవు జాగ్రత్త వహించడం మంచిది.
ఈ వారం ధనిష్ఠ నక్షత్రం వారికి శుభదినములు:-15-8మంగళవారం/ 17-8గురువారం/ 19-8శనివారం/
ఈ వారం శతభిషం నక్షత్రం వారికి శుభదినములు:-14-8సోమవారం 16-8బుధవారం/ 18-8శుక్రవారం/
ఈ వారం పూ.భాద్ర నక్షత్రం వారికి శుభదినములు:-15-8మంగళవారం/ 17-8గురువారం/ 19-8శనివారం/
telugu astrology
మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
నామ నక్షత్రములు:-(దీ--దూఝ-దా-దే-దో-చా-చి)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 3
అనవసరమైన ఖర్చులు పెరుగును.కుటుంబసభ్యులతో వివాదాలు. మానసిక అశాంతి. ఆర్థిక లావాదేవీలు యందు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.ఉద్యోగుం నందు చికాకులు.మానసికంగా బలహీనంగా ఉండటం.చిన్నపాటి అనారోగ్య సమస్యలు రాగలవు. మాతృవర్గం తో విరోధాలు ఏర్పడవచ్చు. బంధు మిత్రులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది.ప్రయాణాలలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఊహించని వివాదాలు చోటు చేసుకో వచ్చు.ప్రతి విషయంలోనూ ఆచితూచి అడుగు వేయాలి. వాదోపవాదాలకు దూరంగా ఉండడం మంచిది. మిత్రులు శత్రువులగా మారే అవకాశం వ్యవహారంలోనూ తొందరవద్దు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు.
ఈ వారం పూ.భాద్ర నక్షత్రం వారికి శుభదినములు:-15-8మంగళవారం/ 17-8గురువారం/ 19-8శనివారం/
ఈ వారం ఉ.భాద్ర నక్షత్రం వారికి శుభదినములు:-14-8సోమవారం/ 16-8బుధవారం/ 17-8గురువారం/ 18-8శుక్రవారం/
ఈ వారం రేవతి నక్షత్రం వారికి శుభదినములు:-14-8సోమవారం/ 15-8మంగళవారం/ 17-8గురువారం/ 19-8శనివారం/