ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ వారం ఉన్నతమైన విద్యా ప్రయాత్నాలు ఫలిస్తాయి.వృత్తి వ్యాపారాలలో ఊహించని ధన లాభం పొందగలరు.
జోశ్యుల రామకృష్ణ - ప్రముఖ జ్యోతిష, జాతక, వాస్తు సిద్ధాంతి, స్మార్త పండితులు - గాయత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ విద్యార్థి) 'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్: 8523814226 (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్యలు చెప్పండి ...సాయంత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది? ఎవరికీ శుభం జరుగుతుంది.. వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి. ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ వారం రాశి ఫలాలు లో తెలుసుకుందాం
మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
నామ నక్షత్రాలు(చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 9
ఈ రాశి వారికి చతుర్దాది పతి అయిన చంద్రుడు కళత్ర స్థానము మరియు భాగ్యస్థానములో సంచారం. ఈ సంచారం వలన మంచి శుభ ఫలితాలు పొందుతారు. ఇంటికి సంబంధించిన గృహాపకరణాలు కొనుగోలు శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు.భూ గృహ నిర్మాణ క్రయ విక్రయాలు అనుకూలంగా ఉంటాయి. కోర్టు విషయాలలో అనుకూలమైన తీర్పులు వస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. దూరపు బందోవర్గముతో శుభవార్త వింటారు.వైవాహిక జీవితం ఆనందంగా గడుపుతారు. సంతోషకరమైన ప్రయాణాలు చేస్తారు.ప్రయాణాలు కలిసి వస్తాయి. ఉన్నతమైన విద్యా ప్రయాత్నాలు ఫలిస్తాయి.వృత్తి వ్యాపారాలలో ఊహించని ధన లాభం పొందగలరు. చేపట్టిన కార్యాలలో మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి.వారాంతం లో శారీరక పీడ. అనవసరమైన ఖర్చులు పెరుగును. చేయు పనులలో అలసత్వం పెరుగుతుంది. మానసిక భయాందోళన.
వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
నామ నక్షత్రములు:-(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 6
ఈ రాశి వారికి తృతీయాధిపతి అయిన చంద్రుడు ఈవారం శత్రు స్థానం మరియు ఆయుః స్థానం లో సంచారము ఈ సంచారం వలన శుభ ఫలితాలు పొందగలరు. మధ్యవర్తిత్వం వలన లాభాలు పొందగలరు. దగ్గర బందోవర్గముతో సహాయ సహకారాలు లభిస్తాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరి అధికారుల అభిమానం పొందుతారు. చేతి వృత్తుల వారికి అనుకూలంగా ఉంటుంది. సహోదయోగుల సహాయ సహకారాలు లభించగలవు.గత కొద్దిరోజులుగా ఉన్న అనారోగ్య సమస్యలు తీరి ప్రశాంతత లభిస్తుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. సమాజము నందు ప్రతిభ తగ్గ గౌరవం లభిస్తుంది. మిత్రుల యొక్క సహాయ సహకారాలతో పనులు సజావుగా పూర్తి చేయగలుగుతారు.వారాంతం లో మానసిక ఉద్రేకతలు పెరుగును. ఆకస్మిక పరిణామాలు ఎదురవుతాయి. ఇతరులతో వాదోపవాదమునలకు దూరంగా ఉండటం మంచిది.
మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
నామ నక్షత్రములు:-(కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 5
ఈ రాశి వారికి ధనాధిపతి అయిన చంద్రుడు ఈ వారం పంచమ స్థానంలో మరియు కళత్ర స్థానం లో సంచారము. ఈ సంచారము వలన వ్యతిరేక ఫలితాలుంటాయి. నగదు వ్యాపార విషయాలలో జాగ్రత్త అవసరము.భూ గృహ క్రయ విక్రయాలు ఈవారం వాయిదా వేయడం ఆదాయ వ్యయాలు హెచ్చుతగ్గులు సంతానముతో ఇబ్బందులు రాగలవు. ఆత్మీయులతో సఖ్యతగా ఉండవలెను. వ్యవహారాలలో ఆచితూచి నిర్ణయాలు తీసుకొనవలెను.మానసికంగా భయంగా ఉండుట. చేయు కార్యాలలో నిరాశ స్పృహలకు గురి అవుతారు. సమాజము నందు అవమానాలు కలగవచ్చు. వ్యవహారమంతా తికమకగా ఉండును.వారాంతం లో సమాజము నందు కీర్తి ప్రతిష్టలు పెరుగును. శరీర సౌఖ్యం లభిస్తుంది. కుటుంబ సమస్యల తీరి ప్రశాంతత లభిస్తుంది.సంతోషకరమైన ప్రయాణాలు చేస్తారు. వ్యాపారము లో ధన లాభం పొందగలరు.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
నామ నక్షత్రములు:-(హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 2
ఈ రాశి వారికి జన్మరాశ్యాధి పతి అయిన చంద్రుడు ఈ వారం చతుర్థ స్థానం మరియు శత్రు స్థానం లో సంచారం. ఈ సంచారం వలన కొద్దిపాటి ఇబ్బందులు కలుగును. శారీరకమైన ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టగలవు. మిత్రులతో సత్యతగా ఉండాలి.పరిశ్రమలలో పనిముట్లతో జాగ్రత్త అవసరము.మానసికంగా భయాందోళన గా ఉంటుంది. వ్యాపారాలలో ధన నష్టం రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. చేతి వృత్తి వారికి శ్రమ ఒత్తిడి అధికంగా ఉంటాయి. చేయు పనులలో బుద్ధి కుశలత తగ్గును. తలపెట్టిన కార్యాలలో ప్రతిబంధకాలు ఏర్పడగలవు. కుటుంబములో పెద్దవారి యొక్క ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొనవలెను.వారాంతం లో వృత్తి వ్యాపారాలలో ధన లాభం పొందగలరు. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు.
సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
నామ నక్షత్రములు-:-(మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 1
ఈ రాశి వారికి వ్యయాధిపతి అయిన చంద్రుడు ఈ వారం తృతీయ స్థానం మరియు పంచమ స్థానం లో సంచరించును. ఈ సంచారం వలన అనుకూల శుభ ఫలితాలు పొందగలరు. వ్యవహారాలలో సహచరుల సహాయ సహకారాలు లభిస్తాయి. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. విందు వినోదాలలో పాల్గొంటారు. వృత్తిపరమైన విషయాలలో ఉన్నత స్థితి. సంతానం అభివృద్ధి ఆనందం కలిగిస్తుంది.నూతన వస్తు ఆభరణాలు లభించును. మానసిక ప్రశాంతత లభిస్తుంది. వైవాహక జీవితం ఆనందంగా గడుపుతారు.అన్ని విధాల ప్రయోజనకరంగా ఉంటుంది.ధైర్య సాహసాలతో కీలకమైన సమస్యలను పరిష్కరించుకుంటారు.వారాంతం లో అనవసరమైన ఖర్చులు చేయవలసిన వస్తుంది. కొన్ని సంఘటనలు బాధ కలిగించును. అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు.
కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
నామ నక్షత్రములు:-(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 5
ఈ రాశి వారికి లాభాధిపతి అయిన చంద్రుడు ఈ వారం ధన స్థానము మరియు మాతృ స్థానంలో చంద్రసంచారం. ఈ సంచారము వలన కొద్దిపాటి ఇబ్బందులు కలుగును. సభలో సమావేశాలలో పాల్గొనేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి.ఆశయం ఏదైతే ఉందో అది పూర్తిగా కాక ఇబ్బందులకు గురవుతారు. ఉద్యోగాలలో అధికారుల తో విరోధాలు రాగలవు. సమాజంలో ఆచుతూచి మాట్లాడవలెను.అనవసరమైన ఖర్చులు పెరుగును. వృత్తి వ్యాపారములు సామాన్యంగా ఉంటాయి. జీవిత భాగస్వామితో సఖ్యతగా మెలగవలెను.అనారోగ్య సమస్యలు రాగలవు. సమాజంలో అపనిందలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యమైన పనులలో ఆటంకాలు ఏర్పడి చికాకు పుట్టించును.వారాంతం లో అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. ఇతరులతో అకారణంగా విరోధాలు రాగలవు.
తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 6
నామ నక్షత్రములు:-(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
ఈ రాశి వారికి రాజ్యాధిపతి అయిన చంద్రుడు జన్మ రాశి లో మరియు తృతీయ స్థానము లో సంచారం. ఈ సంచారము వలన శుభ ఫలితాలు పొందగలరు.తలపెట్టిన కార్యాలు మిత్రుల సహాయ సహకారాల తో పూర్తి అగును . సమాజంలో మీకంటూ ఒక ప్రత్యేకత ఉంటుంది ఉద్యోగాలలో అధికారుల ఆదరాభిమానాలు పొందగలరు. స్థిరాస్తి విషయాలు లో సమస్యలు తీరి ప్రశాంతత లభిస్తుంది. రాజకీయ నాయకులు ప్రజల యొక్క అభిమానాన్ని పొందగలరు.ఆర్థిక మరియు కుటుంబ విషయాలలో అభివృద్ధి కనబడుతుంది. సభలో సమావేశాలలో పాల్గొంటారు. శారీరక శ్రమ తగ్గి శరీర సౌఖ్యం లభిస్తుంది. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి చూపుతారు.వారాంతం లో నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు.
వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
నామ నక్షత్రములు:-(తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 9
ఈ రాశి వారికి భాగ్యాధిపతి అయిన చంద్రుడు ఈవారం వ్యయస్థానం మరియు ధన స్థానము లో సంచరించును. ఈ సంచారము వ్యతిరేక ఫలితాలు కలుగును. విదేశీ ప్రయాణ ప్రయత్నాలలో ఆటంకాలు ఏర్పడతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. అనవసరమైన ప్రయాణాలు చేయవలసి వస్తుంది. బంధవర్గంతో అకారణ కలహాలు రాగలవు. వ్యాపారాలలో జాగ్రత్త అవసరము. వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరించవలెను. పనులలో శ్రమ అధికంగా ఉంటుంది.ఆర్థిక ఇబ్బందులు ఎదురవగలవు. సమాజంలో ప్రతికూలత వాతావరణ. కొన్ని సందర్భాల్లో మిత్రుల వలన నష్టము కలగవచ్చు. అనవసరమైన ఖర్చులు పెరగకుండా జాగ్రత్త వహించాలి.వారాంతం లో తలపెట్టిన కార్యాలలో ఆటంకాలు. ఆరోగ్య సమస్యలు రాగలవు. వ్యవహారాలలో తగు జాగ్రత్తలు పాటించాలి. అనవసరమైన ఖర్చులు తగ్గించాలి.
ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
నామ నక్షత్రములు:-(యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 3
ఈ రాశి వారికి అష్టమాధిపతి అయిన చంద్రుడు ఈవారం లాభ స్థానము మరియు జన్మరాశి లో సంచారము. ఈ సంచారము వలన శుభ ఫలితాలు పొందుతారు. కొంత కాలముగా ఉన్న ఆస్తి వివాదాలు పరిష్కారమగును. వృత్తి వ్యాపారములు లాభసాటిగా జరుగును. ఆదాయ మార్గాలు బాగుంటాయి. చేసే ప్రయత్నాలలో సానుకూల ఫలితాలు పొందగలరు. బందు వర్గంలో మీ విలువను గుర్తిస్తారు.ఆరోగ్యం సమకూరి ప్రశాంతత లభిస్తుంది. అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చేస్తారు. వృత్తి వ్యాపారాలలో ఊహించని ధన లాభం పొందగలరు. ఉద్యోగాలలో అధికారుల అభిమానాలు పొందగలరు. అనేక మార్గాల ద్వారా ఆదాయాన్ని పొందుతారు.వారాంతం లో శరీర సౌఖ్యం లభిస్తుంది. జీవిత భాగస్వామి తో ఆనందంగా గడుపుతారు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. అన్ని రంగాలు వారు అభివృద్ధి చెందుతారు. వృత్తి వ్యాపారాలు అనుకూలిస్తాయి.
మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
నామ నక్షత్రములు:-(భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 8
ఈ రాశి వారికి కళత్రాధిపతి అయిన చంద్రుడు ఈవారం రాజ్యస్థానము మరియు వ్యయస్థానము లో సంచరించును. ఈ సంచారం వలన శుభ ఫలితాలు పొందగలరు. వివాహ ప్రయాత్నాలు ఫలిస్తాయి . వ్యాపార భాగస్వామ్యం వలన లాభాలు పొందగలరు. స్నేహ పరిచయాలు పెరుగును. నూతన కాంట్రాక్టులు లభించును. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం పొందగలరు. ఉన్నతమైన వ్యక్తులు తో పరిచయాలు కలిసి వస్తాయి.అనారోగ్య సమస్యలు నుండి ఉపశమనం పొందుతారు. తలపెట్టిన కార్యాలలో విజయం సాధిస్తారు. కుటుంబములో సంతోషకరమైన వాతావరణం. ఉద్యోగాలలో అధికారవృద్ధి పొందగలరు.వారాంతం లో సమాజము లో అవమానాలు కలగవచ్చు.తలపెట్టిన పనులలో ఆటంకములు ఏర్పడను.
కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
నామ నక్షత్రములు:-(గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 8
ఈ రాశి వారికి షష్ఠమాధిపతి అయిన చంద్రుడు ఈవారం భాగ్యస్థానం మరియు లాభ స్థానములో సంచరించును. ఈ సంచారం వలన మిశ్రమ ఫలితాలు కలుగును. కొద్దిపాటి రుణాలు తీరి ప్రశాంతత లభిస్తుంది. వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరము. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు రాగలవు. చేతి వృత్తి వారికి కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించడం కష్టతరముగా ఉండును. చేయు ప్రయత్నాలలో ఆటంకాలు ఏర్పడను. సమాజంలో ఆచితూచి మాటలాడడం వలన శత్రువర్గము నుండి బయట పడతారు. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. అభివృద్ధి కార్యక్రమాలకు గూర్చి ఆలోచనలు చేస్తారు. దూరపు ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఉద్యోగాలలో అధికారుల ఆగ్రహానికి గురి అవుతారు.
వారాంతం లో స్త్రీ సౌఖ్యం లభిస్తుంది. ఆరోగ్యం అనుకూలించును. వృత్తి వ్యాపారాలలో ధనలాభం పొందగలరు.
మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
నామ నక్షత్రములు:-(దీ--దూఝ-దా-దే-దో-చా-చి)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 3
ఈ రాశి వారికి పంచమాధిపతి అయిన చంద్రుడు ఈవారం అష్టమ స్థానము మరియు రాజ్యస్థానము లో సంచారం.ఈ సంచారం వలన ప్రతికూల ఫలితాలు కలుగును. సంతానంతో మనస్పర్థలు రాగలవు. చేయ వ్యవహారాలలో ఆలోచన శక్తి తగ్గి ఇబ్బందులకు గురి అవుతారు . విందు వినోదాలలో పాల్గొనేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి అవమానాలు రుణ బాధలు పెరుగును. ఇతరుల విషయాలకు దూరంగా ఉండాలి. అన్నదమ్ములతో స్థిరాస్తి విషయాలలో కలహాలు రాగలవు. వృత్తి వ్యాపారములు సామాన్యంగా ఉండును.ఉదర సంబంధిత అనారోగ్య సమస్యలు రాగలవు. పరామర్శ చేస్తారు .మానసిక ఆవేదన వ్యక్తం చేస్తారు. ఊహించని పరిణామాలు ఎదురవుతాయి.వారాంతం లో ఉద్యోగం నందు అధికార అభివృద్ధి కలుగును.అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి అగును.