వారఫలాలు: ఓ రాశివారికి వివాహ ప్రయత్నాలు పలిస్తాయి

First Published | Jun 11, 2023, 10:00 AM IST

ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ వారం   తలచిన పనులు సకాలంలో పూర్తి అగును. అన్ని రంగముల వారికి అనుకూలంగా ఉన్నది. వారాంతంలో అనుకోని సమస్యలు ఏర్పడ గలవు.

వార ఫలాలు :11  జూన్ 2023 నుంచి 17 జూన్   2023 వరకు
 
 రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరు నష్టపోతున్నారు. మొత్తం రాశుల వారికి ఎలా ఉంటుందో  ఈ వార ఫలాలు లో తెలుసుకుందాం

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీమాతా' జ్యోతిష్యాలయం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

telugu astrology


మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
నామ నక్షత్రములు:-(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 9
అనుకూలమైన తేదీలు:-3-6-9
అనుకూలమైన వారములు॥ మంగళ- గురు -శుక్ర

చతుర్దాధిపతి అయిన చంద్రుడు:-లాభ వ్యయస్థానం జన్మరాశి యందు సంచారము. ఈ సంచారం వలన ధన ధాన్యాది లాభాలు పొందగలరు. ప్రయాణాలు కలిసి వస్తాయి. సమాజంలో గౌరవ స్థానం గుర్తింపు పొందగలరు. అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చేస్తారు. వృత్తి వ్యాపారములు లాభసాటిగా జరుగును. స్నేహితులతో సత్సంబంధాలు మెరుగుపడతాయి. ఉద్యోగవనందు అధికారాల యొక్క మన్ననలు పొందగలరు. తలచిన పనులు సకాలంలో పూర్తి అగును. అన్ని రంగముల వారికి అనుకూలంగా ఉన్నది. వారాంతంలో అనుకోని సమస్యలు ఏర్పడ గలవు. వృధా ఖర్చులు పెరుగును. తలపెట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడగలవు.

అశ్విని నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:     12-06-23 సోమవారం        13-06-23 మంగళవారం   15-06-23 గురువారం  17-06-23 శనివారం

భరణి నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:-11-06-23 ఆదివారం    13-06-23 మంగళవారం 14-06-23 బుధవారం 16-06-23 శుక్రవారం

కృత్తిక  నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:-12-06-23 సోమవారం       14-06-23 బుధవారం 15-06-23 గురువార   17-06-23 శనివారం
 


telugu astrology


వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
నామ నక్షత్రములు:-(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 6
అనుకూలమైన తేదీలు:- 3-6-9
అనుకూలమైన వారములు॥ మంగళ- గురు -శుక్ర

తృతీయాధిపతిఅయిన చంద్రుడు:-రాజ్య లాభ వ్యయస్థానమునందు సంచరించును. ఈ సంచారం వలన తలపెట్టిన పని విజయవంతంగా పూర్తగును. గృహమునందు సమస్యల తీరి ప్రశాంతత లభిస్తుంది. ఉద్యోగవనందు అభివృద్ధి ప్రార్థించును. కుటుంబ విషయాలలో పురోగతిని పొందుతారు. అందరి అభిమానాలు పొందగలరు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.  వ్యవహారము నందు  అన్నదమ్ముల సహాయ సహకారాలు లభిస్తాయి. వృత్తి వ్యాపారాలు లాభసాధికా జరుగును. కోర్టు వ్యవహారాలు అనుకూలంగాను. భూ గృహ క్రయ విక్రయాలు నిర్మాణ పనులు కలిసి వస్తాయి. వారాంతంలో సోమరితనం వలన వచ్చిన అవకాశాలను చేజారుస్తారు. అనవసరమైన ఖర్చులు పెరుగును. సమాజమునందు అవమానాలు కలగ గలవు.

కృత్తిక నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:-
  12-06-23 సోమవారం  14-06-23 బుధవారం          15-06-23 గురువారం    17-06-23 శనివారం

రోహిణి నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:-
11-06-23 ఆదివారం      13-06-23 మంగళవారం
15-06-23 గురువారం    16-06-23 శుక్రవారం

మృగశిర నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:-12-06-23 సోమవారం/14-06-23 బుధవారం  /16-06-23 శుక్రవారం/17-06-23 శనివారం
 

telugu astrology


మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
నామ నక్షత్రములు:-(కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 5
అనుకూలమైన తేదీలు:- 3-5-6
అనుకూలమైన వారములు॥ ఋధ -శుక్ర

ద్వితీయాధిపతి అయిన చంద్రుడు:-భాగ్య రాజ్య లాభ స్థానం నందు సంచరించును. ఈ సంచారం వలన ఇతరులతోటి మరియు కుటుంబ సభ్యులతో అకారణంగా కలహాలు ఏర్పడగలవు. అనారోగ్య సమస్యలు రాగలవు. వ్యవహారమునందు ఆచితూనే నిర్ణయాలు వలన సత్ఫలితాలు పొందగలరు. కొద్దిపాటి ఆర్థిక ఇబ్బందులు ఎదురవగలవు. మనసునందు భయాందోళనగా ఉండును. అనవసరమైన ప్రయాణాలు చేయవలసి వస్తుంది. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉండును. ఉద్యోగము నందు అధికారులతోటి సమస్యలు ఏర్పడగలవు. ప్రభుత్వ సంబంధిత పనులలో మందగవనం ఏర్పడుతుంది. వారాంతంలో జీవిత భాగస్వామి తోటి ఆనందంగా గడుపుతారు. అభివృద్ధి పనులు కలిసి వస్తాయి. వృత్తి వ్యాపారములు లాభసాటిగా జరుగును.

మృగశిర నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:-12-06-23 సోమవారం/14-06-23 బుధవారం  /16-06-23 శుక్రవారం/17-06-23 శనివారం

ఆరుద్ర నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:-
11-06-23 ఆదివారం    13-06-23 మంగళవారం     15-06-23 గురువారం   17-06-23 శనివారం

పునర్వసు నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:-12-06-23 సోమవారం 13-06-23 మంగళవారం   16-06-23 శుక్రవారం

telugu astrology

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
నామ నక్షత్రములు:-(హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 2
అనుకూలమైన తేదీలు:-1-2-4-7
అనుకూలమైన వారములు॥ ఆది- సోమ

జన్మరాశి అధిపతి అయిన చంద్రుడు:-ఆయుః భాగ్య రాజ్య స్థానమునందు సంచారము.ఈసంచారం వలన ఇష్టం లేని కార్యములు కష్టముగా చేయవలసి వస్తుంది. మానసిక ఆవేదన ఉద్రేకతలు పెరుగును. ఇతరులతోటి విరోధాలకు దూరంగా ఉండటం మంచిది. కొన్ని సంఘటనలు ఆందోళన కలిగించును. వృత్తి వ్యాపారములో ధన నష్టం రావచ్చు. మానసిక శారీరకంగా బలహీనంగా ఉండును. ఉద్యోగమునందు అధికారులతోటి వ్యతిరేకతలు ఏర్పడవచ్చు. తలచిన పనులలో అడ్డంకులు ఏర్పడగలవు. సమాజము నందు ఆచితూచి మాట్లాడడం వలన శత్రుత్వం నుండి బయటపడతారు. వారాంతంలో గృహమునందు అనుకూలమైన వాతావరణము. తలపెట్టిన పని విజయవంతం అగును. ఆరోగ్యం చేకూరి ప్రశాంత లభించును.

పునర్వసు నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:-  12-06-23 సోమవారం        13-06-23 మంగళవారం   16-06-23 శుక్రవారం

పుష్యమి నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:- 
11-06-23 ఆదివారం      13-06-23 మంగళవారము     15-06-23 గురువారం    17-06-23 శనివారం

ఆశ్రేష  నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:-
11-06-23 ఆదివారం           12-06-23 సోమవారం   14-06-23 బుధవారం       16-06-23 శుక్రవారం
 

telugu astrology


సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
నామ నక్షత్రములు-:-(మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 1
అనుకూలమైన తేదీలు:-1-2-4-7
అనుకూలమైన వారములు॥ ఆది- సోమ

వ్యయాధిపతి అయిన చంద్రుడు:- సప్తమ ఆయుః భాగ్య స్థానం నందు సంచరించును. ఈ సంచారం వలన వృత్తి వ్యాపారం ఉద్యోగ విషయాలలో ప్రోత్సాహకంగా ఉండును. నూతన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు.  తలపెట్టిన కార్యాలను పూర్తి చేస్తారు. శారీరక శ్రమ తగ్గి శరీర సౌఖ్యం లభించును. సమాజము నందు కీర్తి ప్రతిష్టలు లభించును. వివాహ ప్రయత్నాలు పలిస్తాయి. ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆదాయ మార్గాలు మరియు ఆర్థికంగా బాగుండను. వారాంతంలో సంతానం తోటి ప్రతికూలత వాతావరణం. ఉద్యోగాల నందు అధికారులతోటి అకారణంగా కలహాలు రాగలవు.

మఖ  నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:-
12-06-23 సోమవారం        13-06-23 మంగళవారం   15-06-23 గురువారం      
17-06-23 శనివారం

పూ.ఫల్గుణి నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:-
11-06-23 ఆదివారం   13-06-23మంగళవారం
14-06-23 బుధవారం      16-06-23 శుక్రవారం

ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:-
12-06-23 సోమవారం       14-06-23 బుధవారం          15-06-23 గురువారం          
17-06-23 శనివారం
 

telugu astrology

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
నామ నక్షత్రములు:-(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 5
అనుకూలమైన తేదీలు:-3-5-6
అనుకూలమైన వారములు॥ బుధ- శుక్రవారం

లాభాధిపతి అయిన చంద్రుడు:- శత్రు కళత్ర ఆయుః స్థానములందు సంచారము. ఈ సంచారం వలన సమాజం నందు కీర్తి ప్రతిష్టలు లభించును. ఆరోగ్యం సమస్యల తీరి ప్రశాంతత లభించును. అధికారులకు అనుకూలంగా ఉండును. ఉద్యోగ విషయంలో అనుకూల స్థితి. వృత్తి వ్యాపారములు సంతృప్తికరంగానుండను. చేయ పనులలో తెలివిగా వ్యవహరించి సానుకూలం చేసుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విందు వినోదాలలో ఆనందంగా గడుపుతారు. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వారాంతంలో మానసిక ఆవేదన పెరుగును. ఆకస్మిక పరిణామాలు ఆందోళన కలిగిస్తాయి.

ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:-
12-06-23 సోమవారం       14-06-23 బుధవారం          15-06-23 గురువారం          
17-06-23 శనివారం

హస్తం నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:-
11-06-23 ఆదివారం      13-06-23 మంగళవారం
15-06-23 గురువారం           16-06-23 శుక్రవారం

చిత్త నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:-
12-06-23 సోమవారం/14-06-23 బుధవారం  /16-06-23 శుక్రవారం/17-06-23 శనివారం

telugu astrology

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 6
నామ నక్షత్రములు:-(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
అనుకూలమైన తేదీలు:- 3-6-9
అనుకూలమైన వారములు॥ మంగళ -గురు- శుక్ర

రాజ్యాధిపతి అయిన చంద్రుడు:-పంచమ శత్రు కళత్ర స్థానమునందు సంచారం చేయను. ఈ సంచారం వలన చేయు పనుల యందు కోపావేశములు తగ్గించుకోవాలి. వ్యాపారమునందు తెలివిగా ప్రదర్శించవలెను. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించవలెను.  పనులలో ఏదో విధంగా అవరోధములు ఏర్పడగలవు. ఉద్యోగమనందు అధికారులతోటి జాగ్రత్త అవసరం. మిత్రుల యొక్క స్నేహభావాలు తగ్గే అవకాశం. కుటుంబం నందు మరియు సంతానమునందు ప్రతికూలత వాతావరణం. వారాంతంలో జీవిత భాగస్వామితోటి ఆనందంగా గడుపుతారు. వివాహ ప్రయత్నాలు ఫలించును. శరీర సౌఖ్యం లభిస్తుంది.

చిత్త నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:-
12-06-23 సోమవారం/14-06-23 బుధవారం  /16-06-23 శుక్రవారం/17-06-23 శనివారం

స్వాతి  నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:-
11-06-23 ఆదివారం    13-06-23 మంగళవారం     15-06-23 గురువారం          
17-06-23 శనివారం

విశాఖ నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:-
12-06-23 సోమవారం        13-06-23 మంగళవారం   16-06-23 శుక్రవారం

telugu astrology


వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
నామ నక్షత్రములు:-(తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 9
అనుకూలమైన తేదీలు:- 3-6-9
అనుకూలమైన వారములు॥ మంగళ-గురు -శుక్ర

భాగ్యాధిపతి అయిన చంద్రుడు:-చతుర్ధ పంచమ శత్రు స్థానములందు సంచారం చేయను. ఈసంచారం వలన వ్యవహారమునందు బుద్ధి కుశలత తగ్గి ఆటంకాలు ఏర్పడగలవు. ఏదో తెలియని అసంతృప్తి ఉంటుంది.అనవసరమైన ఖర్చులు పెరగగలవు. మానసిక చికాకులు ఏర్పడగలవు. ఇతరులతోటి కోపావేశాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గి మనస్పర్ధలు రాగలవు. కొత్త సమస్యలు రావచ్చు. ఇతరుల యొక్క వ్యవహారములందు దూరంగా ఉండడం మంచిది. వారాంతంలో ఆరోగ్యం అనుకూలించను. కుటుంబము నందు సంతోషకరమైన వాతావరణము. మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు.

విశాఖ నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:-
12-06-23 సోమవారం        13-06-23 మంగళవారం   16-06-23 శుక్రవారం

అనూరాధ నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:-
11-06-23 ఆదివారం      13-06-23 మంగళవారము     15-06-23 గురువారం     
17-06-23 శనివారం

జ్యేష్ట నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:-
11-06-23 ఆదివారం           12-06-23 సోమవారం   14-06-23 బుధవారం       16-06-23 శుక్రవారం
 

telugu astrology


ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
నామ నక్షత్రములు:-(యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 3
అనుకూలమైన తేదీలు:- 3-6-9
అనుకూలమైన వారములు॥ గురు -శుక్ర- మంగళ

అష్టమాధిపతి అయిన చంద్రుడు:-తృతీయ చతుర్ధ పంచమ స్థానము నందు సంచారము. ఈ సంచారం వలన.అనుకూలమైన ఫలితాలు పొందగలరు. తలచిన పనులు సకాలంలో పూర్తవుతాయి. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. వ్యవహారముల యందు మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. జీవిత భాగస్వామి తోటి ఆనందంగా గడుపుతారు ‌. వారాంతంలో బుద్ధి కుశలత తగ్గును. మనస్సునందు ఆందోళనగా ఉండుట. వృధా ఖర్చులు పెరుగును. వాదోపవాదములకు దూరంగా ఉండవలెను.

మూల నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:-  
12-06-23 సోమవారం        13-06-23 మంగళవారం   15-06-23 గురువారం      
17-06-23 శనివారం

పూ.షాఢ నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:-
11-06-23 ఆదివారం       13-06-23 మంగళవారం
14-06-23 బుధవారం       16-06-23 శుక్రవారం

ఉ.షాఢ నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:-
12-06-23 సోమవారం       14-06-23 బుధవారం          15-06-23 గురువారం       17-06-23 శనివారం
 

telugu astrology


మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
నామ నక్షత్రములు:-(భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 8
అనుకూలమైన తేదీలు:- 2-3-6-8
అనుకూలమైన వారములు॥ ఆది -సోమ- శని

కళత్రాధిపతి అయిన చంద్రుడు:-ధన తృతీయ చతుర్ధ స్థానములందు సంచారము చేయను. ఈ సంచారము వలన అనవసరమైన ఖర్చులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకొనవలెను. ఆరోగ్య సమస్యలు చికాకు పుట్టించును. ఆగ్రహావేశాలు తగ్గించుకొనవలెను. స్నేహితుల తోటి సన్నిహితంగా జాగ్రత్తగా మెలగాలి. ఉద్యోగమునందు ఓర్పు అవసరము. వృత్తి వ్యాపారములు సామాన్యంగా ఉండును. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఏర్పడగలరు. కొద్దిపాటి ఆర్థిక సమస్యలు రాగలవు. సమాజం నందు ప్రతికూలత వాతావరణ. తలపెట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడగలవు. వారాంతంలో అనుకున్నట్లుగా పూర్తి అగును. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.

ఉ.షాఢ నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:-
12-06-23 సోమవారం       14-06-23 బుధవారం          15-06-23 గురువారం      17-06-23 శనివారం

శ్రవణం నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:-
11-06-23 ఆదివారం      13-06-23 మంగళవారం
15-06-23 గురువారం           16-06-23 శుక్రవారం

ధనిష్ట నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:-
12-06-23 సోమవారం/14-06-23 బుధవారం  /16-06-23 శుక్రవారం/17-06-23 శనివారం

telugu astrology


కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
నామ నక్షత్రములు:-(గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 8
అనుకూలమైన తేదీలు:- 1-2-6-8
అనుకూలమైన వారములు॥ శని- ఆది -సోమ

షష్ఠమాధిపతి అయిన చంద్రుడు:-జన్మ ధన తృతీయ స్థానము నందు సంచారము. ఈ సంజవరము వలన శరీర సౌఖ్యం లభిస్తుంది. వ్యవహారమునందు బుద్ధి కుశలత ప్రదర్శించి వ్యవహారములను పూర్తి చేస్తారు. అందరితో స్నేహపూర్వక సంచరిస్తారు. గౌరవ మర్యాదలు అందుకుంటారు. అనుకున్న పనులలో విజయం సాధిస్తారు. ఉద్యోగ వ్యాపార విషయంలో అనుకూలంగా ఉండును. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇంటా బయట అనుకూలంగా ఉండును. ఆర్థిక విషయాలలో అభివృద్ధి కనపడుతుంది. దైవ ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వారాంతంలో అనారోగ్య సమస్యలు తలెత్తగలవు. అనవసరమైన ఖర్చులు పెరుగును.

ధనిష్ఠ నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:-
12-06-23 సోమవారం/14-06-23 బుధవారం  /16-06-23 శుక్రవారం/17-06-23 శనివారం

శతభిషం నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:- 
11-06-23 ఆదివారం    13-06-23 మంగళవారం     15-06-23 గురువారం    17-06-23 శనివారం

పూ.భాద్ర  నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:-
12-06-23 సోమవారం        13-06-23 మంగళవారం   16-06-23 శుక్రవారం

telugu astrology


మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
నామ నక్షత్రములు:-(దీ--దూఝ-దా-దే-దో-చా-చి)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 3
అనుకూలమైన తేదీలు:-3-6-9
అనుకూలమైన వారములు॥ గురు- శుక్ర -మంగళ

పంచమాధిపతి అయిన చంద్రుడు:-వ్యయ జన్మ ధనస్థానములందు సంచరించును. ఈ సంచారం వలన వచ్చిన అవకాశాలను అందుపుచ్చుకొనవలెను. సమాజం నందు అవమానాలు కలగ గలవు. ఉద్యోగవనందు అధికారుల యొక్క ఒత్తిడి పెరుగును. తొందరపాటు పనుల వలన ఇబ్బందులకు గురి అవుతారు. వ్యాపారాలందు ధన నష్టం రావచ్చు. కుటుంబం నందు ప్రతికూలత వాతావరణం. మానసిక వేదన పెరుగును. అనవసరమైన ఖర్చులు తగ్గించుకొనవలెను. జీవిత భాగస్వామి తోటే అకారణంగా కలహము ఏర్పడగలదు. వారాంతంలో సన్మానాలో బహుమానాలు పొందగలరు. మిత్రుల యొక్క ఆదరణ అభిమానాలు పొందగలరు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది.

పూ.భాద్ర నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:-
12-06-23 సోమవారం        13-06-23 మంగళవారం   16-06-23 శుక్రవారం

ఉ.భాద్ర నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:-
11-06-23 ఆదివారం      13-06-23 మంగళవారము     15-06-23 గురువారం     
17-06-23 శనివారం

రేవతి నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:-
11-06-23 ఆదివారం           12-06-23 సోమవారం   14-06-23 బుధవారం       16-06-23 శుక్రవారం
 

Latest Videos

click me!