వార ఫలాలు: ఓ రాశివారికి వారం మధ్యలో శుభవార్తలు.

First Published | Dec 18, 2022, 10:03 AM IST

ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ వారం బంధుమిత్రులు కలయిక. తలపెట్టిన పనులన్నీ సకాలంలో పూర్తవును. భూ గృహ నిర్మాణ క్రయ విక్రయాలు కలిసి వచ్చును. కుటుంబ అభివృద్ధి ఆనందం కలిగించును. వారాంతంలో కొన్ని సమస్యలు వలన  మానసిక ఒత్తిడి పెరుగును. ఆకస్మిక ప్రయాణాలు.

Weekly Horoscope 18th December to 24th december 2022

రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరు నష్టపోతున్నారు. మొత్తం రాశుల వారికి ఎలా ఉంటుందో  ఈ వార ఫలాలు లో తెలుసుకుందాం

Weekly Horoscope 18th December to 24th december 2022
Vijaya Rama krishna


జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి  ఈ వారం ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ వారం రాశి ఫలాలు లో తెలుసుకుందాం
  


Zodiac Sign

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
ఈ రాసి వారికి ఈ వారం చాలా పాజిటివ్ గా ఉంది. గత కొద్దికాలంగా ఇబ్బంది పెడుతున్న  ఆరోగ్యంలో మార్పు వచ్చి సర్దుకుంటుంది.ప్రశాంతత లభిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. సంఘమునందు కీర్తి ప్రతిష్ఠలు లభిస్తాయి.  ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. జీవిత భాగస్వామి తోటి ఆనందంగా గడుపుతారు. ప్రత్యర్థులు పై విజయం సాధిస్తారు. మిత్రుల యొక్క సహాయ సహకారాలు లాబిస్తాయి. అనుకోని ధన లాభం కలుగుతుంది. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. కీలకమైన సమస్యలు పరిష్కారం అవుతాయి. వృత్తి వ్యాపారాల యందు ధన లాభం కలుగుతుంది. ప్రయాణాలు లాభిస్తాయి. బంధుమిత్రులు కలయిక. తలపెట్టిన పనులన్నీ సకాలంలో పూర్తవును. భూ గృహ నిర్మాణ క్రయ విక్రయాలు కలిసి వచ్చును. కుటుంబ అభివృద్ధి ఆనందం కలిగించును. వారాంతంలో కొన్ని సమస్యలు వలన  మానసిక ఒత్తిడి పెరుగును. ఆకస్మిక ప్రయాణాలు.

Zodiac Sign

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
ఈ రాశివారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు చూపిస్తున్నాయి.  కొందరి వ్యాఖ్యలు నిరుత్సాహపరుస్తాయి. విమర్శలు పట్టించుకోవద్దు. ఆది, సోమవారాల్లో ముఖ్యుల కలయిక వీలుపడదు. చేయి పనులు యందు అలసత్వం .  అరుదుగా వచ్చిన అవకాశాలని తెలివితేటలుగా అందుపుచ్చుకొనవలెను. శారీరక శ్రమ పెరుగుతుంది. మనసు నందు ఆందోళనగా ఉంటుంది. నిరాశ నిస్పృహలకు లోనవుతారు.   ఆరోగ్యం నందు తగు జాగ్రత్తలు తీసుకొని వలెను. సమాజం నందు కీర్తి ప్రతిష్టలు తగ్గును.  ఉద్యోగమునందు పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు నందు తన నష్టం ధన నష్టం ఏర్పడుతుంది. గృహమునందు పెద్దవారు యొక్క ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అన్నదమ్ములతోటి మనస్పర్ధలు రావచ్చును. మిత్రులతోటి సఖ్యతగా ఉండవలెను వారాంతంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. బంధుమిత్రులతో కలయిక ‌. మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభించును.

Zodiac Sign


మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):

ఈ రాశివారికి ఈ వారం కొన్ని జాగ్రత్తలతో గడపాల్సిన సూచనలు కపడుతున్నాయి. మనసునందు అనేక ఆలోచనలతోటి తికమకగా ఉంటుంది. గొడవలకు దూరంగా ఉండటం మంచిది. బుద్ధికుశలత  తగ్గుతుంది. చేయ పనులలో ఆటంకాలు ఎదురైనా వాటిని పట్టుదలతో పూర్తి చేయాలి.  ముఖ్యమైన వస్తువులు యందు జాగ్రత్త అవసరం. ధనహాని కలుగుతుంది. బంధుమిత్రులతోటి మనస్పర్ధలు రావచ్చును. వాహన ప్రయాణాల యందు తగు జాగ్రత్త అవసరం. ఉద్యోగమునందు పై అధికారులతోటి కలహాలు ఏర్పడతాయి.  సమాజము నందు ప్రతికూలత వాతావరణం ఏర్పడుతుంది.  ఆర్థికంగా బలహీన పడి రుణాలు చేయవలసి వస్తుంది. ప్రభుత్వ సంబంధిత పనులలో ఆటంకాలు ఏర్పడతాయి. వారాంతంలో ఆరోగ్యం చేకూరి ప్రశాంతత లభించును. సంతోషకరమైన వార్తల వింటారు. సమాజమనందు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు

Zodiac Sign

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
తలపెట్టిన  పనులను ఆలోచన శక్తితోటి పూర్తగును. శారీరకంగా మానసికంగా బలపడతారు. మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. వైవాహిక జీవితం ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాల యందు ధనలాభం కలుగుతుంది. గృహ నిర్మాణ పనులలో ఆటంకాలు ఏర్పడవచ్చును .కుటుంబం అభివృద్ధి చెందుతుంది .నూతన ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు .వ్యాపార సంబంధిత విషయాలు గూర్చి బంధువులు యొక్క సహకారం తీసుకుంటారు. విందు వినోదాలలో పాల్గొంటారు స్థిరాస్తి విషయంలో కలహాలు ఏర్పడను .వివాహ ప్రయత్నాలు అనుకూలించును .సహోద్యోగుల వలన కొన్ని సమస్యలు పరిష్కారమగును. వారాంతంలో ఆరోగ్య విషయంలో ఒక జాగ్రత్తలు తీసుకొనవలెను. అనవసరమైన ఖర్చులు తగ్గించుకొనవలెను. ఆదాయ వనరులలో కొరత ఏర్పడవచ్చు. సమాజమునందు కీర్తి ప్రతిష్టలు తగ్గును

Zodiac Sign

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
అనవసరమైన ఖర్చులు పెరుగుతూ సమాజము నందు కీర్తిహాని ఏర్పడవచ్చు. చేయు పనులందు ఆటంకాలు ఏర్పడుతాయి. వ్యాపారాల యందు పెట్టబడి విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకొనవలెను. గురు గృహ క్రయవిక్రయాలు వాయిదా వేయుట మంచిది. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. మానసిక ఆరాటం ఆధ్యాత్మిక చింతన. బంధుమిత్రుల తోటి మనస్పర్ధలు .వాహన ప్రయాణమందు జాగ్రత్త అవసరం. కొన్ని అవకాశాలు చేతిదాకా వచ్చి పోతాయి. నిరాశ స్పృహలకు లోను అవుతారు. ఆకస్మిక ప్రయాణాలు వలన చికాకులు.  అయితే వారాంతంలో తలపెట్టిన పనులన్నీ పనులలో విజయం సాధిస్తారు. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. మృదువుగా సంభాషణ చేస్తూ కీలకమైన సమస్యలు పరిష్కారం చేసుకోవాలి. ఉద్యోగమునందు అధికారుల యొక్క స్నేహ సంబంధాలు బలపడతాయి. ఆరోగ్యం చేకూరి ప్రశాంతత లభించును.
 

Zodiac Sign


కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
  కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు.  ఇంటి యందు సమాజము నందు పేరుతో ప్రతిష్టలు లభించును. గృహ మరమ్మతులు లేదా విలాస వస్తువులు ఊహించిన దాని కంటే ఎక్కువ డబ్బు ఖర్చు కావొచ్చు. ఈ వారం మధ్యలో సోదరులు లేదా తండ్రి మధ్య ఏదో ఒక విషయంలో మనస్పర్థలు రావొచ్చు.  సన్మానాలు బహుమానాలు లభిస్తాయి. ఆకస్మిక మలాపం కలుగును.  మిత్రుల యొక్క ఆదరణ అభిమానాలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాల యందు ధనలాభం కలుగుతుంది.  కుటుంబ అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది.  ఉద్యోగమునందు పై అధికారుల స్నేహ స్నేహ సంబంధాలు బలపడతాయి.  వైవాహిక జీవితం ఆనందంగా గడుపుతారు. 
 

Zodiac Sign

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
బంధుమిత్రులతోటి విరోధాలు రావచ్చు.  ఉద్యోగమునందు పై అధికారుల ఒత్తిడిలో ఎక్కువగా ఉండను.  ఆరోగ్య విషయంలో తగు జాగర్తలు అవసరం. వృత్తి వ్యాపారాల యందు ధన నష్టం కలుగును . వచ్చిన అవకాశాలు అందుపుచ్చుకొనవలెను. దురాలోచనలు దూరంగా ఉండటం మంచిది. గృహమునందు సమాజం నందు ప్రతికూలత వాతావరణం ఏర్పడవచ్చును. శారీరక శ్రమ పెరుగుతుంది . మానసిక ఒత్తిడి పెరుగును. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి . అసూయ ద్వేషాలకు దూరంగా ఉండండి. తలపెట్టిన పనాలలో ఆటంకాలు ఏర్పడతాయి.భూ గృహ స్థిరాస్తులు క్రయవిక్రయాలు వాయిదా వేయటం మంచిది. వారాంతంలో తలపెట్టిన పనులన్నీ పనులలో విజయం సాధిస్తారు. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి.
 

Zodiac Sign


వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
శారీరకంగా మానసికంగా బలపడతారు .వృత్తి వ్యాపారాల యందు ధనలాభం కలుగుతుంది. జీవిత భాగస్వామి తోటి ఆనందంగా గడుపుతారు. ఆరోగ్యం చేరి ప్రశాంతత లభిస్తుంది. అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చేస్తారు .అనుకోని ధనలాభం. మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి.  ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.  ఆదాయ మార్గాలు అన్వేషణ చేస్తారు.  అన్ని విధాల లాభం చేకూరును. మీరు ఎక్కువ సమయం శుభకార్యాల్లో పాల్గొంటూ సరదాగా గడుపుతారు. వ్యాపారులు ఈ వారం ఆశించిన ప్రయోజనాలను పొందుతారు. ఈ వారం మొదట్లో మీరు పెట్టిన పెట్టుబడికి ప్రయోజనం లభిస్తుంది. గృహ మరమ్మతులు లేదా విలాస వస్తువులు ఊహించిన దాని కంటే ఎక్కువ డబ్బు ఖర్చు కావొచ్చు. 

Zodiac Sign

ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):

శారీరక శ్రమ తగ్గి దేహారోగ్యం కలుగుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లుగా సాధిస్తారు.  గృహమునందు శుభకార్యా చరణ. ఉద్యోగులకు అధికార వృద్ధి. వైవాహిక జీవితం ఆనందంగా గడుస్తుంది. వృత్తి వ్యాపారాల యందు ధనలాభం కలుగుతుంది .ప్రయాణాలు లాభిస్తాయి .ప్రత్యర్థులపై పై చేయి సాధిస్తారు. సంతాన అభివృద్ధి ఆనందం కలిగిస్తుంది .నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలుగును.  ఆది, సోమవారాల్లో నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది. ఇంటి విషయాలు పట్టించుకోండి. అధికారులతో టి సంభంధాలు లాభిస్తాయి. వారాంతంలో మనసునందు దురాలోచనలు కలుగుతాయి. జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. 

Zodiac Sign

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):

ఇతరులతోటి కలహాలకు దూరంగా ఉండటం మంచిది. దీర్ఘకాలిక అనారోగ్యం ఇబ్బందులు వలన ఇబ్బందులు ఎదురవుతాయి. దూరపు ప్రయాణాలు కలుగును. పిల్లల తోటి ఆనందంగా గడపండి .ఉద్యోగులకు అధికారుల యొక్క ఒత్తుడులు ఎక్కువగా ఉంటాయి.  మీకు అపకారం చేయాలని కొంతమంది చూస్తారు. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. సమాజం నందు కీర్తి ప్రతిష్టలు తగ్గును. ప్రభుత్వ సంబంధిత పనులలో ఆటంకాలు ఏర్పడును. జీవిత భాగస్వామి తోటి మనస్పర్ధలు రావచ్చు.  వాహన ప్రయాణాలయందు తగు జాగ్రత్తలు అవసరము. మానసికంగా మానసిక ఉద్రేకత పెరుగును. ఆ కారణంగా కలహాలు రావచ్చు వారాంతంలో మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి.  కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు వృత్తి వ్యాపారాల యందు ధనలాభం కలుగుతుంది అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చేస్తారు
 

Zodiac Sign


కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):

మానసిక వేదన ఉద్రేకతలు పెరుగుతాయి .ఇతరులతోటి విరోధాలు ఏర్పడవచ్చు.  జాగ్రత్త అవసరం.  కొన్ని సంఘటనలు వలన ఆందోళన పడతారు. దీర్ఘకాలిక అనారోగ్యం వలన ఇబ్బందులు తలెత్తుతాయి. సంతానం తో  ప్రతికూలత వాతావరణం ఏర్పడుతుంది . మానసికంగా శారీరకంగా బలహీనత పడతారు. శత్రువుల నుంచి ఒత్తడి యొక్క అధికంగా ఉంటుంది. అనవసరమైన ఖర్చులు బాధించును.  సమాజము నందు ప్రతికూలత వాతావరణం. చేయి పనులయందు అలసత్వం. అయినా వీకెండ్ లో   మీ జోక్యంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. నిర్మాణాలు ఊపందుకుంటాయి. బిల్డర్లకు ఆదాయాభివృద్ధి. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. షాపుల అలంకరణ ఆకట్టుకుంటుంది.

Zodiac Sign


మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4): వృత్తి వ్యాపారాలు  లాభసాటిగా సాగుతాయి. గృహమునందు సమాజము నందు కీర్తి ప్రతిష్టలు.  శారీరక శ్రమ తగ్గుతుంది ,సంతోషకరమైన వార్తలు వింటారు. ప్రయాణాలు లాభిస్తాయి. బంధుమిత్రుల యొక్క కలయిక. ఉద్యోగమునందు అనుకూలమైన మార్పులు. గృహ నిర్మాణ క్రయవిక్రయాలు కలిసి వస్తాయి ప్రభుత్వ సంబంధిత పనులు సజావుగా సాగును. ఆరోగ్యం సంతృప్తికరం. కీలక పత్రాలు అందుకుంటారు. ఆధ్మాత్మికత పెంపొందుతుంది. సంతానం విషయంలో శుభఫలితాలున్నాయి. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. నిరుద్యోగులకు ఓర్పు, ఏకాగ్రత ప్రధానం.
 

Latest Videos

click me!