Vastu tips: పాజిటివిటీని పెంచే వాస్తు చిట్కాలు..!

First Published Jun 29, 2022, 3:28 PM IST

ఆ ఇంట్లో సంతోషం వెల్లివిరిస్తుంది. అంతేకాదు.. ఆ  ఇంట్లో సిరి సంపదలు కూడా  ఉంటాయి.  మరి ఆ పాజిటివిటీని ఎలా పెంచుుకోవాలి అంటే.. వాస్తు ప్రకారం కొన్ని మార్పులు చేసుకోవాలట. మరి ఆ మార్పులేంటో ఓసారి చూసేద్దాం..

Vastu Tips

ఇంట్లో పాజిటివిటీ ఉంటే.. ఆ ఇంట్లో సంతోషం వెల్లివిరిస్తుంది. అంతేకాదు.. ఆ  ఇంట్లో సిరి సంపదలు కూడా  ఉంటాయి.  మరి ఆ పాజిటివిటీని ఎలా పెంచుుకోవాలి అంటే.. వాస్తు ప్రకారం కొన్ని మార్పులు చేసుకోవాలట. మరి ఆ మార్పులేంటో ఓసారి చూసేద్దాం..

1.ఎక్వేరియం...

చాలా మంది ఇంట్లో ఎక్వేరియం ని అందం కోసమో.. లేదంటే... సరదా కోసమే పెట్టుకుంటారు. అయితే.. వాస్తు ప్రకారం మాత్రం ఎక్వేరియం ఇంట్లో ఉంటే పాజిటివిటీ పెరుగుతుందట. ఇంట్లో తూర్పు లేదంటే.. దక్షిణ దిశలో.. ఎక్వేరియంను ఉంచాలట. ఎక్వేరియం అంటే.. పెద్ద గాజు తొట్టే పెట్టుకోవాల్సిన అవసరం లేదు. చిన్న గాజు కుండీ లాంటిది పెట్టి.. దానిలో రెండు చిన్న చేపలు పెంచుకొని.. వాటికి ఆహారం పెట్టినా సరిపోతుందట. అలా వాటికి ఆహారం వేయడం..  నీరు.. వాటి ప్రవాహాం అంతా.. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని పెంచడానికి సహాయపడుతుందట.
 

2.కిచెన్ లో మందులు..

చాలా మంది.. తెలియకుండానే కొన్ని వాస్తు పొరపాట్లు చేస్తూ ఉంటారు. వాటిలో మొదటిది.. మందులను కిచెన్ లో పెడుతూ ఉంటారట. అవి ఎలాంటి మందులు అయినా సరే.. వాటిని కిచెన్ లో అస్సలు ఉంచకూడదట. కిచెన్ అనేది మంచి ఆరోగ్యానికీ చిహ్నమట. అయితే.. మందులు మాత్రం.. వాటికి పూర్తి భిన్నమట. అలా కిచెన్ లో మందులను ఉంచడం వల్ల..న్యూటిషన్, సైకలాజికల్ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందట. కాబట్టి.. వాటిని కిచెన్ లో ఎట్టి పరిస్థితుల్లో ఉంచకూడదు.

3.బెడ్రూమ్ లో అద్దాలు..

చాలా మంది అందం కోసమే... క్లాసీగా కనపడాలని బెడ్రూమ్ లో సైతం అద్దాలు పెడుతూ ఉంటారు. కానీ.. వాస్తు ప్రకారం.. బెడ్రూమ్ లో ఎలాంటి అద్దాలు ఉండకూడదట. అవి నెగిటివ్ ఎనర్జీని విడుదల చేస్తాయట.  ఇంట్లో గొడవలు, వాదనలు లాంటివి జరుగుతాయట. అంతేకాదు.. బెడ్రూమ్ లో అద్దాలు ఉండటం వల్ల.. నిద్రలేమి సమస్యలు కూడా ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉందట. ముఖ్యంగా బెడ్ మీద పడుకుంటే.. మనకు మనం అద్దంలో అస్సలు కనపడకూడదు. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.

4.తులసి మొక్క..
ఇంట్లో తులసి మొక్క పెంచుకోవడం చాలా అవసరం. ఇంటి ఆవరణలో తులసి మొక్క ఉంటే.. ఆ ఇంట్లో పాజిటివిటీ ఎక్కువగా పెరుగుతుందట. అందుకే.. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ  పెరగాలి అంటే... వాస్తు ప్రకారం తులసి మొక్కను కచ్చితంగా పెంచాలట.

5.క్యాక్టస్ మొక్కలు..
చాలా మంది ఇంట్లో అందంగా ఉంటాయి కదా అని.. చాలా మంది క్యాక్టస్ మొక్కలను పెంచుతారట. కానీ... ఆ మొక్కలు నెగిటివ్ ఎనర్జీని వ్యాపింప చేస్తాయట.  అంతేకాదు.. ఈ మొక్కలు ఇంట్లో ఉంటే కుటుంబసభ్యుల మధ్య బేధాభిప్రాయాలు రావడం.. సంబంధాలు చెడిపోవడం లాంటివి జరుగుతాయట. అందుకే క్యాక్టస్ మొక్కలకు దూరంగా ఉండాలట.

6.గణేష విగ్రహం..
ఇంటి గుమ్మానికి ముందు గణేషుని విగ్రహాన్ని ఉంచాలి. ఇంటి గుమ్మంలోకి అడుగుపెడుతుండగా.. ఎదురుగా వినాయకుని విగ్రహాన్ని ఉంచడం వల్ల  ఆ ఇంట శుభం జరుగుతుంది. వినాయకుని విగ్రహం లేకుండా.. ఖాళీగా ఉండే గోడ వల్ల.. ఇంట్లో వారు ఒంటరితనంతో బాధపడుతూ ఉంటారట. అందుకోసమే.. కచ్చితంగా.. వినాయకుడి విగ్రహం లేదా ఫోటో పెట్టుకోవాలి. ఇవి ఇంట్లోకి సంతోషాన్ని తీసుకువస్తాయి.

7.విరిగిపోయిన వస్తువులు..

చాలా మంది ఇంట్లో పనికిరాని వస్తువులను పేరుస్తూ ఉంటారు.  ముఖ్యంగా కొన్ని వస్తువులు విరిగిపోయినా.. పగిలిపోయినా వాటిని పారేయడానికి వారికి మనసు రాదు. అయితే... అలాంటి వస్తువులు ఇంట్లో ఉండటం వల్ల నెగిటివ్ ఎనర్జీ పెరిగే అవకాశం ఉందట. విరిగిపోయిన వస్తువు కుర్చీ అయినా, ఎదైనా డెకరేటివ్ వస్తువు అయినా..  ఏదైనా సరే.. విరిగిపోతే పక్కన పడేయాలట. ఇంట్లో ఉంచుకోకూడదని వాస్తు శాస్త్రం చెబుతోంది.
 

click me!