Vastu Tips: వాస్తు ప్రకారం సాయంత్రం పూట ఈ పనులు చేస్తే ఇంట్లో డబ్బులు ఖాళీ!

Kavitha G | Published : Mar 11, 2025 12:09 PM
Google News Follow Us

ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని, డబ్బుకు లోటు ఉండకూడదని కోరుకుంటారు. కానీ ఎంత కష్టపడినా కొంతమందికి ఫలితాలు రావు. వాస్తు శాస్త్రం ప్రకారం మనం చేసే చిన్న చిన్న తప్పుల వల్ల ఇంట్లో డబ్బు, శాంతి ఉండవు. మరి ఇళ్లు ఎప్పుడు సిరిసంపదలతో కళకళలాడాలంటే కొన్ని పనులను కొన్ని సమయాల్లో చేయకూడదట. మరి అవెంటో చూసేయండి.

15
Vastu Tips: వాస్తు ప్రకారం సాయంత్రం పూట ఈ పనులు చేస్తే ఇంట్లో డబ్బులు ఖాళీ!

ఇళ్లు, ఇంట్లో వస్తువులు, పరిసరాలు వాస్తు ప్రకారం ఉంటే ఇళ్లు సంతోషంగా, సిరిసంపదలతో తులతూగుతుందని చాలామంది నమ్ముతారు. అయితే వాస్తు ప్రకారం కొన్ని పనులను కొన్ని సమయాలల్లో అస్సలు చేయకూడదట. మరి ఏ పనులను ఏ టైంలో చేయకూడదో ఇక్కడ చూద్దాం.

వాస్తుశాస్త్రం ప్రకారం సూర్యాస్తమయం సమయంలో కొన్ని పనులు చేయకూడదు. చేసినా డబ్బు కొరత వస్తుంది. లక్ష్మీ దేవి ఇంటి నుంచి వెళ్లిపోతుంది.

25
తినకూడదు

సూర్యాస్తమయం సమయంలో అస్సలు తినకూడదు.
వాస్తు శాస్త్రం ప్రకారం, సూర్యాస్తమయం సమయంలో ఎవరూ తినకూడదని చెబుతుంటారు. ఎందుకంటే ఈ సమయంలో దేవుడిని పూజిస్తారు.

35
పెరుగు దానం

వాస్తు శాస్త్రం ప్రకారం, సూర్యాస్తమయం సమయంలో లేదా తర్వాత పెరుగు దానం చేయకూడదు. ఇది శుక్ర గ్రహానికి సంబంధించింది. సంపదకు చిహ్నంగా భావిస్తారు.

Related Articles

45
నిద్రపోకూడదు

సూర్యాస్తమయం సమయంలో నిద్రపోకూడదని పెద్దలు చెబుతుంటారు. సూర్యాస్తమయం సమయంలో నిద్రపోవడం వల్ల ఆరోగ్యం, సంపదపై చెడు ప్రభావం పడుతుంది.

55
ఊడవకూడదు

వాస్తు శాస్త్రం ప్రకారం సూర్యాస్తమయం సమయంలో చీపురును ఇంట్లో ఉపయోగించకూడదు. ఎందుకంటే ఈ సమయంలో ఊడిస్తే లక్ష్మీదేవి ఇంటిని వదిలి వెళ్ళిపోతుందని నమ్ముతారు.

Recommended Photos