Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారు చాలా డేంజర్..!

ramya Sridhar | Published : Mar 11, 2025 10:40 AM
Google News Follow Us

చాలా విషయాల్లో ది బెస్ట్ గా ఉంటారు. వారు తప్ప..మరెవరూ ఆ పనులు చేయలేరేమో అనిపించేలా ఉంటారు. కానీ.. అంతే ప్రమాదకరంగా కూడా వారు ప్రవర్తించగలరు.మరి, వారెవరో తెలుసుకుందామా..

14
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారు చాలా డేంజర్..!

జోతిష్యశాస్త్రం ప్రకారం మనిషి జాతకం ఎలా తెలుసుకోవచ్చో.. న్యూమరాలజీ ప్రకారం పుట్టిన తేదీ ప్రకారం.. వ్యక్తుల వ్యక్తిత్వాలు, ప్రవర్తన కూడా తెలుసుకోవచ్చు. ఇప్పుడు న్యూమరాలజీ ప్రకారం కొన్ని ప్రత్యేక తేదీల్లో పుట్టిన వ్యక్తుల గురించి తెలుసుకుందాం.. వాళ్లు.. చాలా విషయాల్లో ది బెస్ట్ గా ఉంటారు. వారు తప్ప..మరెవరూ ఆ పనులు చేయలేరేమో అనిపించేలా ఉంటారు. కానీ.. అంతే ప్రమాదకరంగా కూడా వారు ప్రవర్తించగలరు.మరి, వారెవరో తెలుసుకుందామా..

24

ఏ నెలలో అయినా 8, 16, 18, 28 తేదీల్లో జన్మించిన వ్యక్తులు చాలా ఆకర్షణీయంగా ఉంటారు.వారికి జీవితంలో మంచి ఆశయాలు ఉంటాయి. దృఢ సంకల్పంతో ముందుకు దూసుకుపోతారు.జీవితంలో వారు అనుకున్నది సాధిస్తారు. మంచి విజయం కూడా సాధిస్తారు. కానీ.. తమ ప్రత్యర్థులను మాత్రం భయపెట్టేలా వారి ప్రవర్తిస్తారు.వీరిని ఎదురించి గెలవడం ఎవరి సాధ్యమూ కాదు.

34

8, 16, 18, 28 తేదీల్లో పుట్టిన వారిలో ఒక తెలియని అయస్కాంతం ఉంటుంది. ఎవరినైనా ఇట్టే ఆకర్షించే శక్తి కలిగి ఉంటారు. ఈ నాలుగు తేదీల్లో పుట్టినవారు ఎక్కడుంటే అక్కడ సందడి ఉంటుంది.చాలా మంచి లక్షణాలు ఉన్నా వీరిని చూస్తే అప్పుడప్పుడు ప్రమాదకరమైన వారు అనే భావన కలుగుతుంది. అయితే.. ప్రమాదకరమైనవారు అంటే.. వారితో జీవితం ఎప్పుడూ హానికరం కాదు. అప్పుడప్పుడు.. తమ శత్రువులతో మాత్రమే వారు చెడుగా ప్రవర్తిస్తారు. కాస్త మొండితనం ఎక్కువ. అనుకున్నది సాధించడానికి, తాము ఓడించాలని అనుకునేవారిని ఓడించేదాకా వీరికి నిద్రపట్టదు.

Related Articles

44


ఈ తేదీలలో జన్మించిన వారు తరచుగా విజయం సాధించాలనే అవిశ్రాంత తపన కలిగి ఉంటారు. వారు ఎటువంటి సవాలు నుండి వెనక్కి తగ్గరు. ఉదాహరణకు, 8వ సంఖ్య శక్తి భౌతిక విజయంతో ముడిపడి ఉంటుంది, అయితే 16, 18 వంటి సంఖ్యలు ఆధ్యాత్మిక లోతు , ఒక నిర్దిష్ట దృఢత్వాన్ని కలిగి ఉంటాయి. ఈ వ్యక్తులను తరచుగా నాయకులు, దార్శనికులు లేదా తిరుగుబాటుదారులుగా చూస్తారు, నిబంధనలను సవాలు చేయడానికి  సరిహద్దులను దాటడానికి భయపడరు. రి లక్ష్యాలను నెరవేర్చని ఎవరితోనైనా లేదా దేనితోనైనా సంబంధాలను తెంచుకోవడానికి వెనుకాడరు. వారి బలం ప్రశంసనీయం అయినప్పటికీ, వారి తీవ్రత కొన్నిసార్లు  క్రూరంగా కనిపిస్తుంది.

 ఈ వ్యక్తులు తాము శ్రద్ధ వహించే వారి పట్ల బలమైన విధేయతను కలిగి ఉంటారు.వారు ప్రేమించినప్పుడు, వారు గాఢంగా ప్రేమిస్తారు.వారి స్నేహితులు, కుటుంబం లేదా భాగస్వాములకు మద్దతు ఇవ్వడానికి వారు చాలా కష్టపడతారు.ఎవరైనా వారిని మోసం చేస్తే..వారిలోని ప్రమాదకరమైన మరో వ్యక్తి బయటకు వస్తాడు.
 

Recommended Photos