Published : May 20, 2022, 01:10 PM ISTUpdated : May 20, 2022, 01:44 PM IST
మరీ ముఖ్యంగా బెడ్రూమ్ లో కొన్ని వస్తువులను అస్సలు పెట్టకూడదట. వాటి వల్ల..దంపతుల మధ్య మనస్పర్థలు రావడానికి కారణమౌతాయట. మరి ఎలాంటి వస్తువునుల ఉంచకూడదో మనం తెలుసుకుందామా..
మనలో చాలా మంది ఇంటిని చాలా శుభ్రంగా పెట్టుకుంటాం. ముఖ్యంగా బెడ్రూమ్ ని మరింత నీట్ గా.. మనకు నచ్చిన విధంగా పెట్టుకుంటూ ఉంటాం. అయితే.. మనకు నచ్చిన విధంగా పెట్టే క్రమంలో మనకు తెలీయకుండానే కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటాం. ముఖ్యంగా వాస్తు శాస్త్రం ప్రకారం.. మనం తెలీకుండానే ఇంట్లో పెట్టే కొన్ని వస్తువులు సమస్యలు తెచ్చిపెడతాయట. మరీ ముఖ్యంగా బెడ్రూమ్ లో కొన్ని వస్తువులను అస్సలు పెట్టకూడదట. వాటి వల్ల..దంపతుల మధ్య మనస్పర్థలు రావడానికి కారణమౌతాయట. మరి ఎలాంటి వస్తువునుల ఉంచకూడదో మనం తెలుసుకుందామా..
26
పడక గదిలో చాలా మందికి పుస్తకాలు పెట్టుకునే అలవాటు ఉంటుంది. రాత్రిపూట పుస్తకం చదవనిదే నాకు నిద్రపట్టదు అని కొందరు అంటూ ఉంటారు. ఈ క్రమంలో.. బెడ్రూమ్ లోనే పుస్తకాల అర పెట్టుకుంటారు. కానీ.. వాటిని అలా పెట్టకూడదట. పుస్తకాలను లైబ్రరీ లాగా ఉంచవద్దు. దాని వల్ల ఒక పార్టనర్ రెసెర్వ్డ్ నేచర్ లాగా అయిపోయే ప్రమాదం ఉంది.. దాని వల్ల దంపతులు ఇద్దరూ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
36
ఇక పిల్లలు ఉన్న ఇంట్లో బొమ్మలు ఉండటం సహజం. అయితే.. ఆ బొమ్మలను హాలు వరకే పరిమితం చేయాలట. వాటిని తెచ్చి బెడ్రూమ్ లో ఉంచకూడదట. అలా ఉంచడం వల్ల కూడా దంపతుల మధ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. పడక గదిలో బొమ్మలు ఉంచొద్దు ఉంచితే ఇద్దరి మధ్య పవర్ అంటే నేను గొప్పంటే నేను గొప్ప అనే గొడవలు జరిగే ప్రమాదం ఎక్కువగా ఉంది.
46
shoes
ఇక చాలా మంది తమ బెడ్రూమ్ లో కొత్త షూస్, చెప్పలు దాచుకుంటూ ఉంటారు. ఎక్కువగా ఉండటం వల్ల.. అలా బెడ్రూమ్ లో పెడుతూ ఉంటారు. కానీ.. నిజానికి అలా పడకగదిలో షూస్ ఉంచొద్దు. తామే ఈ సంసారాన్ని అతికష్టం మీద లాగుతున్నామని ఒక పార్టనర్ ఫీల్ అయ్యే ప్రమాదం ఉంది.. ఇక అలాంటి సమస్య మొదలయ్యాక వారి సంసారం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అనుకుంట. అందుకే.. వాస్తు ప్రకారం.. వీటిని బెడ్రూమ్ దరిదాపుల్లోకి కూడా రానివ్వకుండా ఉంటే మంచిది.
56
వీటితో పాటు బెడ్రూమ్ లో మొబైల్ ఫోన్లు కూడా పెట్టకూడదట.ఈ రోజుల్లో ఫోన్‌లు మన జీవితంలో అంతర్భాగమైనందున, మనం నిద్రపోతున్నప్పుడు కూడా దానిని మన నుండి దూరంగా ఉంచడం కష్టం. అయితే, మనం నిద్రపోయేటప్పుడు దిండు కింద పెట్టుకోవడం లాంటివి చేయకూడదు. మొబైల్ టవర్‌తో మొబైల్ ఫోన్‌లు నిరంతరం టచ్‌లో ఉన్నందున, ఇది చాలా విద్యుదయస్కాంత రేడియేషన్‌ను ఉత్పత్తి చేస్తుందనేది రహస్యం కాదు. ఫోన్ ఛార్జ్‌లో ఉన్నప్పుడు లేదా మీరు పేలవమైన నెట్‌వర్క్ ప్రాంతంలో ఉన్నప్పుడు పరిస్థితి మరింత దిగజారుతుంది. ఫోన్ చుట్టూ ఉన్న రేడియేషన్ మన మెదడును దెబ్బతీస్తుంది.మన పెరుగుదల ప్రక్రియను నెమ్మదిస్తుంది. ఫోన్‌లు, ట్యాబ్‌ల వంటి ఎలక్ట్రానిక్‌ల నుండి అటువంటి హానికరమైన ప్రభావాలను నివారించడానికి, మీరు నిద్రిస్తున్నప్పుడు దాన్ని స్విచ్ ఆఫ్ చేయండి లేదా ఎయిర్‌ప్లేన్ మోడ్‌లో ఉంచండి. లేదంటే కీనసం ఏడు అడుగుల దూరంలో ఉంచడం మంచిది.
66
డార్క్ పెయింటింగ్స్
చాలా మంది వ్యక్తులు తమ మంచం వెనుక లేదా తమ పడకగదిలో ఎక్కడో ఒక పెద్ద పెయింటింగ్‌ని వేలాడదీయడానికి ఇష్టపడతారు. పెయింటింగ్ ప్రకాశవంతంగా మరియు ఆనందంగా ఉంటే, మీరు మంచి రాత్రి నిద్రను ఆస్వాదించడానికి ఇది ఖచ్చితంగా సహాయపడుతుంది. కానీ డార్క్ పెయింటింగ్‌ను వేలాడదీయడం, చీకటి భావోద్వేగాలను చూపడం, మీ మానసిక స్థితి , ఆత్మను తగ్గిస్తుంది. నిజానికి మీ మంచం వెనుక పెయింటింగ్‌ని వేలాడదీయకపోవడమే మంచిది.