Travel Horoscope:ఏ రాశివారు ఎక్కడ ప్రయాణిస్తారో..!

Published : Mar 05, 2022, 11:44 AM ISTUpdated : Mar 05, 2022, 11:48 AM IST

జోతిష్యశాస్త్రం ప్రకారం ఈ మార్చి నెలలో ఏ రాశివారు.. ఏయే ప్రదేశాలను చూసే అవకాశం ఎక్కువగా ఉందో ఓసారి చూద్దాం..  

PREV
113
Travel Horoscope:ఏ రాశివారు ఎక్కడ ప్రయాణిస్తారో..!

ట్రావెలింగ్ ని ఇష్టపడేవారు మనలో చాలా మందే ఉంటారు. కొత్త విషయాలను తెలుసుకునేందుకు.. కొత్త ప్రదేశాలను చూడటాన్ని చాలా మంది ఇష్టపడతారు. మరి.. జోతిష్యశాస్త్రం ప్రకారం ఈ మార్చి నెలలో ఏ రాశివారు.. ఏయే ప్రదేశాలను చూసే అవకాశం ఎక్కువగా ఉందో ఓసారి చూద్దాం..  

 

213

1.మీన రాశి..
ఈ రాశివారు ప్రతి విషయాన్ని చాలా క్రియేటివ్ గా ఉండాలని కోరుకుంటారు. ఈ రాశివారికి ప్రపంచం మొత్తం చూడాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది. ఈ  మార్చి నెలలో ఈ రాశివారు.. తమ డ్రీమ్ ల్యాండ్ అయిన అమెరికా సందర్శించే అవకాశం ఎక్కువగా కనపడుతోంది. అక్కడ అనేక ప్రదేశాలను వీరు చూసే అవకాశం ఉంది.

313

2.మేష రాశి..
మేష రాశివారు.. ఈ మార్చి నెలలో నిశబ్దంగా, ఏకాంతంగా ఉండే ద్వీపానికి వెళ్లాలి అని అనుకుంటారు. మేషరాశిని తమ రాశిగా కలిగి ఉన్న వ్యక్తులు రీఛార్జ్ చేయడానికి, చైతన్యం నింపుకోవడానికి, తమతో మళ్లీ కనెక్ట్ అయ్యే ప్రదేశానికి వెళ్లాలని అనుకుంటూ ఉంటారు. కాబట్టి వీరు.. అండమాన్ వెళ్లే అవకాశం ఎక్కువగా ఉంది.

413

3.వృషభ రాశి..
ఈ రాశివారు చాలా రొమాంటిక్ గా ఉంటారు. వీరు సరదా ప్రదేశానికి వెళ్లాలని అనుకుంటారు. కాబట్టి.. ఈ రాశివారు..  రోమ్, వీనస్  వంటి ప్రదేశాలకు వెళ్లే అవకాశం ఎక్కువగా ఉంది.

513

4మిథున రాశి..
మిథున రాశివారు.. మార్చి నెలలో సరదాగా స్నేహితులతో ట్రిప్ కి వెళ్లాలి అనుకుంటారు. వీరు సాహాసాలు ఎక్కువగా ఇష్టపడతారు.. కాబట్టి.. వీరు థాయిలాండ్ వెళ్లే అవకాశం ఉంది.

613

5.కర్కాటక రాశి..
కలలు కనే కర్కాటక రాశివారు ఎల్లప్పుడూ నిశ్శబ్ద ,  ప్రశాంతమైన ప్రదేశాల వైపు ఆకర్షితులవుతారు. ఈ వ్యక్తులు అలల శబ్దం , ప్రశాంతమైన సముద్రాన్ని  చూడాలని అనుకుంటారు. కాబట్టి వీరు స్పెయిన్ వెళ్లే అవకాశం ఉంది.
 

713

6.సింహ రాశి..
ఈ రాశివారు ట్రిప్స్ చాలా ఉత్సాహంగా, రొమాంటిక్ గా ఉండాలని కోరుకుంటారు. కాబట్టి.. వీరు మార్చిలో... ట్రిప్ కి వెళ్లేందుకు కేరళ  అయితే.. చాలా బాగుంటుంది.

813

7.కన్య రాశి..
కన్యారాశి వారు ఈ మార్చిలో శృంగారభరితంగా గడపాలని కోరుతున్నారు. అంతులేని సముద్ర వీక్షణలతో కూడిన క్రూయిజ్ ట్రిప్ ఈ నెలలో అందమైన సముద్రంలో రొమాన్స్ చేస్తున్నప్పుడు కన్య రాశివారు ప్రశాతంగా ఉండాలని కోరుకుంటారు. కాబట్టి వీరు... క్రూజ్ ట్రిప్ ఎంచుకోవచ్చు.

913

8.తుల రాశి..
 తులారాశివారు ఎల్లప్పుడూ ప్రపంచమంతా (ఆరోగ్యం, పని, వినోదం) సమతుల్యతను కలిగి ఉండే గమ్యాన్ని కోరుకుంటారు. ప్రకృతి మధ్య ప్రశాంతమైన స్పా వెకేషన్ ఈ నెలలో మీకు అవసరం. మీ మనస్సు ప్రశాతంగా ఉండేందుకు వీరు కేరళ ఎంచుకోవాలి.
 

1013

9.వృశ్చిక రాశి..
ఈ రాశివారు.. ఈ మార్చి నెలలో ఆనందంగా , రొమాంటిక్ గా ఉండేందుకు ఇష్టపడతారు. సాహసాన్ని ఇష్టపడే వ్యక్తులు ఈ నెలలో స్కూబా డైవింగ్ ,నీరు ఆడటం ఇష్టపడతారు. వీరు మాల్దీవులు వెళ్లడం ఉత్తమం.

1113

10.ధనస్సు రాశి..
ఈ రాశివారు ఈ మార్చి నెలలో లగ్జరీ ట్రిప్ వెళ్లడానికి ఇష్టపడతారు. ఖరీదైన విమాన టిక్కెట్‌ల కోసం ఖర్చు చేయడానికి బదులుగా  ఇంటికి దగ్గరలో ఏదైనా విలాసవంతమైన ప్రదేశాన్ని ఎంచుకోవడం ఉత్తమం.
 

1213

11.మకర రాశి..
వైన్స్ , రోడ్ ట్రిప్‌లు మకర రాశివారు  ఇష్టపడే రెండు విషయాలు. మార్చి  నెలలో ఈ రాశివారు  స్థానిక వైన్ తయారీ కేంద్రాలకు లేదా సమీపంలోని నగరాలకు రోడ్ ట్రిప్‌లకు  వెళ్లడం ఉత్తమం. నాసిక్ వీరు ఎంచుకోవడం బెస్ట్.

1313

12.కుంభ రాశి..
కుంభ రాశివారు ఈ మార్చి నెలలో రోడ్డు ట్రిప్ లు వెళ్లడానికి ఇష్టపడతారు. అవసరంగా ఖర్చు చేయకూడదు అంటే.. దగ్గరలోని ప్రదేశాలకు వెళ్లి సరదాగా గడపడం ఉత్తమం.

click me!

Recommended Stories