ఇంట్లో తాబేలు బొమ్మ పెడితే అదృష్టం కలసివస్తుందా..?

First Published Oct 6, 2021, 1:31 PM IST

తాబేలు బొమ్మను పెట్టుకోవడం వల్ల.. ఇంట్లో మంచి జరుగుతుందని  చాలా మంది చెబుతుంటారు. ఇది ఎంత వరకు నిజం..? దీని గురించి వాస్తు శాస్త్రం ఏం చెబుతుందో ఇప్పుడు చూద్దాం..
 

వాస్తు శాస్త్రాన్ని  చాలా మంది నమ్ముతారు. ముఖ్యంగా కొత్త ఇంట్లో కి వెళ్లినప్పుడు వాస్తు విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. వాస్తు లోపాలు ఉంటే ఇంట్లో సమస్యలు వస్తాయని.. ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉందని కూడా వాస్తు శాస్ట్రం చెబుతోంది.
 

అయితే.. ఈ క్రమంలో తాబేలు బొమ్మను పెట్టుకోవడం వల్ల.. ఇంట్లో మంచి జరుగుతుందని  చాలా మంది చెబుతుంటారు. ఇది ఎంత వరకు నిజం..? దీని గురించి వాస్తు శాస్త్రం ఏం చెబుతుందో ఇప్పుడు చూద్దాం..
 

వాస్తు శాస్త్రం ప్రకారం తాబేలు ఇంట్లోకి ప్రవేశిస్తే.. వాస్తు దోషాలు తొలగిపోతాయని నిపుణులు చెబుతున్నారు. చైనా వాస్తు అని పిలువబడే ఫెంగ్‌షుయ్ పద్ధతిలో తాబేలు ఎలా తన ఐదు అవయవాలను (తల, నాలుగుకాళ్లను) ఎలా లోనికి లాక్కొని శత్రువుల నుంచి తనను తాను రక్షించుకుంటుందో.. అలాగే వాస్తు శాస్త్రం ప్రకారం తాబేలు.. ఆయుర్దాయం, శుభాలకు సంకేతంగా చెప్పబడుతోంది. అందుకే లోహంలో తయారు చేయబడిన తాబేలును.. నీటితో నింపిన బౌల్‌లో వుంచి.. ఇంట్లో ఉత్తర దిశలో వుంచాలి. 
 

ఉత్తర దిశలో పడకగది వున్నట్లైతే నీరు లేని లోహంతో తయారైన తాబేలును వుంచవచ్చు. ఇలా చేస్తే.. ఆయురారోగ్యాలు, ఆర్థికాభివృద్ధి, శత్రుభయం, శత్రుదోషాలు, నరదృష్టి, అసూయ, ఈర్ష్య ప్రభావం మనపై వుంటే తొలగిపోతుంది. తాబేలు మాత్రమే కాకుండా.. తాబేలు లాంటి కూర్మావతారం వంటి శంఖం, కామధేనువు, కల్పవృక్షం, శమంతకమణి, ఐరావతం వంటివి వాస్తు దోషాలను తొలగిస్తాయని ఫెంగ్‌షుయ్ నిపుణులు చెప్తున్నారు.
 


ఇంట్లో ఎలాంటి సమస్యలు ఉన్నా.. స్పటికంతో తయారు చేసిన తాబేలును ఉత్తరం దిక్కులో ఉంచితే.. ఆ ఇంట్లో సమస్యలు తగ్గి.. ఆనందంగా ఉంటారని నిపుణులు సూచిస్తున్నారు.

కొన్నిసార్లు, ఇంట్లో అశాంతి తరచుగా ఆందోళన కలిగిస్తుంది. అందుకే తాబేళ్లు ఎప్పుడూ తూర్పు ముఖంగా ఉండాలి. దానిని గదిలో ఉంచడం వల్ల ఇంట్లో శాంతి మరియు సామరస్యం లభిస్తుంది
 

తాబేలును నీటిలో మాత్రమే ఉంచాలి. మీరు దానికి కొన్ని రంగు రాళ్లను కూడా జోడించవచ్చు. ఇది ప్రశాంతత, సామరస్యం, శాంతి, దీర్ఘాయువు సంపదను తెస్తుంది. గృహ ఆర్థిక వ్యవస్థను పరిష్కరించడానికి ఇలా చేయడం ఉత్తమం.

click me!