Today Horoscope: ఓ రాశివారికి ఆర్థిక ప్రయత్నాలలో విజయం లభిస్తుంది

First Published Mar 9, 2024, 5:30 AM IST

Today Horoscope:ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి.  ఓ రాశివారికి ఈ రోజు.. వృత్తి వ్యాపారాల్లో ధన నష్టము. ఆరోగ్య సమస్యలు రావచ్చు. విలువైన వస్తువుల యందు జాగ్రత్త అవసరం.అనవసరమైన ప్రయాణాలు చేయవలసి వస్తుంది. 

9-3-2024,శనివారం  మీ  రాశి ఫలాలు (దిన ఫల,తారా ఫలాలు తో..)

జోశ్యుల  రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్ధాంతి, స్మార్త పండితులు - గాయత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు  సమస్యలు పెట్టండి ...సాయంత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.

telugu astrology

మేషం (అశ్విని భరణి కృత్తిక 1)
నామ నక్షత్రాలు(చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
తారా బలము
అశ్విని నక్షత్రం వారికి (సాధన తార)నూతన వస్తు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. బంధు మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు.మానసిక ప్రశాంతత లభిస్తుంది.(అన్ని పనుల్లో విజయం సాధిస్తారు)

భరణి నక్షత్రం వారికి (ప్రత్యక్తార)విలువైన వస్తువులు తో జాగ్రత్త అవసరం. ఇతరులతో వాదోపవాదాలకు  దూరంగా ఉండాలి.వ్యాపారంలో జాగ్రత్తలు తీసుకోవాలి.(పనులలో ఆటంకాలు ఏర్పడతాయి)

కృత్తిక నక్షత్రం వారికి (క్షేమతార) సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఆసక్తికరమైన విషయాలు వింటారు.తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.(ఆనందంగా గడుపుతారు)

దిన ఫలం:-అనవసరమైన ప్రయాణాలు చేయవలసి వస్తుంది.మానసికంగా భయాందోళన గా ఉంటుంది. ఉద్యోగాలలో అధికారులు తో అకారణంగా విరోధాలు రాగలవు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.అనుకున్న పనులు పూర్తి గాక ఇబ్బందులకు గురి అవుతారు.సమాజంలో గౌరవ మర్యాదలు తగ్గును. భాగస్తుల మూలకంగా కష్టనష్టాలు రాగలవు.ఓం ఆదిత్యాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

Latest Videos


telugu astrology

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి మృగశిర 1 2)
నామ నక్షత్రాలు(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
తారాబలం
రోహిణి నక్షత్రం వారికి(విపత్తార) పనుల్లో అలసత్వం వల్ల ఇబ్బందులు పడతారు. మిత్రులతో అకారణంగా కలహాలు రావచ్చు.(ప్రతి పని ఆలోచించి చేయడం మంచిది)

మృగశిర నక్షత్రం వారికి(సంపత్తార)తలపెట్టిన పనులు పట్టుదలతో చేసినట్లయితే సకాలంలో పూర్తి అగును.వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును.(అన్ని విధాలా బాగుంటుంది)

దిన ఫలం:-కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు.శుభ సమాచారం అందుకుంటారు, వ్యాపారాలు పరంగా సానుకూల ఫలితాలను పొందవచ్చు. వ్యాపార పరమైన చర్చలు జరుపుతారు.తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మానసికంగా ఆనందంగా గడుపుతారు. ఓం మహేశ్వరాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

telugu astrology

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర పునర్వసు 1 2 3)
నామ నక్షత్రాలు (కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
తారాబలం
ఆరుద్ర నక్షత్రం వారికి (జన్మతార)ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకొనవలెను. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉండును.అధికారులు తో విరోధాలు రావచ్చు.(సామాన్యంగా ఉండును)

పునర్వసు నక్షత్రం వారికి (‌పరమమిత్ర తార)వాహన ప్రయాణంలో జాగ్రత్తలు తీసుకోవాలి. తలపెట్టిన పనులు పూర్తి గాక చిరాకు కలుగుతుంది(సామాన్యంగా ఉంటుంది)

దిన ఫలం:-ఉద్యోగాలలో అధికారుల తో సమస్యలు ఏర్పడును. వ్యాపారాల్లో ప్రతిబంధకాలు ఏర్పడకుండా చూసుకోవాలి.ఇతరుల విషయాల్లో జోక్యం తగదు.బంధుమిత్రులతో మనస్పర్థలు రాగలవు. దుష్ట సహవాసాలు కు దూరంగా ఉండాలి.అనవసరమైన ఆలోచనలు.ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.ఓం మహేశ్వరాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

telugu astrology


కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి ఆశ్లేష )
నామ నక్షత్రాలు(హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
తారాబలం
పుష్యమి నక్షత్రం వారికి (మిత్ర తార)వృత్తి వ్యాపారాలలో ధన లాభం కలుగుతుంది.నూతన పరిచయాలు వలన కొన్ని సమస్యలు తీరును.శుభవార్తలు వింటారు.(అన్ని విధాలా శ్రేయస్కరం గా ఉంటుంది)

ఆశ్రేష నక్షత్రం వారికి  (నైధనతార)ప్రతి పనిలోనూ ఆచితూచి అడుగు వేయవలెను.ఆరోగ్య విషయంలో శ్రద్ద తీసుకోవాలి. వాహన ప్రయాణంలో జాగ్రత్త అవసరం.(జాగ్రత్తగా మెలగాలి)

దిన ఫలం:-వృత్తి వ్యాపారాల్లో ధన నష్టము. ఆరోగ్య సమస్యలు రావచ్చు. విలువైన వస్తువుల యందు జాగ్రత్త అవసరం.అనవసరమైన ప్రయాణాలు చేయవలసి వస్తుంది. సమాజంలో అవమానాలు కలగవచ్చు.ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి.రుణాలు చేయవలసి వస్తుంది. చెడు పనుల యందు ఆసక్తి పెరుగుతుంది. ప్రయత్నించిన ప్రతి పనిలో అడ్డంగులు ఏర్పడగలవు. ఇతరుల నిందలకు పాత్రులు అవుతారు.ఓం దుర్గాయై నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి
 

telugu astrology

సింహం (మఖ  పుబ్బ ఉత్తర 1)
నామ నక్షత్రాలు(మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
తారాబలం
మఘ నక్షత్రం వారికి (సాధన తార) నూతన వస్తు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. బంధు మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు.మానసిక ప్రశాంతత లభిస్తుంది.(తలపెట్టిన పనుల్లో విజయం సాధిస్తారు)

పూ.ఫల్గుణి నక్షత్రం వారికి  (ప్రత్యక్తార)విలువైన వస్తువులు తో జాగ్రత్త అవసరం. ఇతరులతో వాదోపవాదాలకు  దూరంగా ఉండాలి.(పనులలో ఆటంకాలు ఎదురవుతాయి)

ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి (క్షేమతార) సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఆసక్తికరమైన విషయాలు వింటారు.తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. (ఆనందంగా గడుపుతారు)

దిన ఫలం:-కారణం లేకుండానే తగాదాలు రావొచ్చు. ఖర్చులు అధికంగా ఉంటాయి. క్రయ విక్రయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి.ఆర్థిక విషయాలు నిరుత్సాహం కలిగిస్తాయి. శారీరకంగా మానసికంగా బలహీనంగా ఉంటుంది. పనులలో ఆటంకాలు ఏర్పడతాయి.శ్రమకు తగిన ఫలితం లభించడం కష్టంగా ఉంటుంది.ఆరోగ్య సమస్యలు రాగలవు.ప్రతి విషయంలో ఆచితూచి అడుగులు వేయాలి. తెలీకుండానే పొరపాట్లు జరగవచ్చు.ఓం శ్రీనివాసాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

telugu astrology

కన్య (ఉత్తర 2 3 4, హస్త  చిత్త 1 2)
నామ నక్షత్రాలు(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
తారాబలం
హస్త నక్షత్రం వారికి  (విపత్తార) పనుల్లో అలసత్వం వల్ల ఇబ్బందులు. మిత్రులతో అకారణంగా కలహాలు రావచ్చు.(ప్రతి పని ఆలోచించి చేయవలెను)

చిత్త నక్షత్రం వారికి (సంపత్తార)తలపెట్టిన పనులు పట్టుదలతో చేసినట్లయితే సకాలంలో పూర్తి కాగలవు.వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును.(అన్ని విధాలా బాగుంటుంది)

దిన ఫలం:-శుభ ఫలితాలను పొందగలరు.ఉత్సాహంగా గడుపుతారు.అన్ని రకాల సౌకర్యాలు సమకూరుతాయి.ఇతరుల సహాయ సహకారాలు అంది వస్తాయి.వృత్తి వ్యాపారాలు కలిసి వస్తాయి.హోదా గల వ్యక్తులు తో స్నేహ లాభాలు పొందగలరు.విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ప్రయాణాలను చేయవలసి వస్తుంది. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొంటారు.ఓం వినాయకాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

telugu astrology

తుల (చిత్త 3 4, స్వాతి ,విశాఖ 1 2 3)
నామ నక్షత్రాలు(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
తారాబలం
స్వాతి నక్షత్రం వారికి (జన్మతార)ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.అధికారులు తో విరోధాలు రావచ్చు.(సామాన్యంగా ఉంటుంది)

విశాఖ నక్షత్రం వారికి (పరమమిత్ర తార)వాహన ప్రయాణంలో జాగ్రత్తలు తీసుకోవాలి.తలపెట్టిన పనులు పూర్తి గాక ఇబ్బందులు ఎదురవుతాయి. (సామాన్యంగా ఉంటుంది)

దిన ఫలం:-ఇతరులతో అకారణంగా కలహాలు రాగలవు.తలపెట్టిన పనులు లో ఆటంకాలు ఏర్పడగలవు. శత్రువులు మూలకం గా భయంగా ఉండును.వ్యవహారాలలో ఆలోచించి అడుగు వేయుట మంచిది.ఆదాయానికి మించి ఖర్చు చేయాల్సి వస్తుంది. వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. నూతన ఆలోచనలు కలుగును. ఓం దక్షిణామూర్తయే నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

telugu astrology

వృశ్చికము (విశాఖ 4, అనూరాధ  జ్యేష్ఠ )
నామ నక్షత్రాలు(తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-య)
తారాబలం
అనూరాధ నక్షత్రం వారికి (మిత్ర తార)వృత్తి వ్యాపారాలలో ధన లాభం పొందుతారు.నూతన పరిచయాలు వలన కొన్ని సమస్యలు తీరును.శుభవార్తలు వింటారు.(అన్ని విధాలా శ్రేయస్కరం గా ఉంటుంది)

జ్యేష్ట నక్షత్రం వారికి(నైధనతార)ప్రతి విషయంలో ఆచితూచి అడుగు వేయాలి.ఆరోగ్య విషయంలో శ్రద్ద తీసుకోవాలి. వాహన ప్రయాణంలో జాగ్రత్త అవసరం.(జాగ్రత్తగా ఉండటం మంచిది)

దిన ఫలం:-పెద్దలు మరియు గురువు లు యందు భక్తిశ్రద్ధలు పెరుగుతాయి.అలంకార వస్తువులు కొనుగోలు చేస్తారు. సమాజంలో గౌరవం లభించును.ఆసక్తికరమైన విషయాలు వింటారు. వృత్తి వ్యాపారాలలో ధనలాభం కలుగుతుంది. ఉద్యోగంలో ఉన్నత స్థితి ఏర్పడుతుంది. తలచిన పనులు సకాలంలో పూర్తవుతాయి.శారీరక సుఖం లభిస్తుంది.బంధుమిత్రుల సహాయ సహకారాలు అంది వస్తాయి.ఓం శంకరాయ నమః అనే జపించండి శుభ ఫలితాలను పొందండి.

telugu astrology

ధనుస్సు (మూల పూ.షాఢ ఉ.షాఢ 1)
నామ నక్షత్రాలు(యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే
తారాబలం
మూల నక్షత్రం వారికి (సాధన తార)నూతన వస్తు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. బంధు మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు.మానసిక ప్రశాంతత లభిస్తుంది.(అన్ని పనుల్లో విజయం సాధిస్తారు)

పూ.షాఢ నక్షత్రం వారికి  (ప్రత్యక్తార)విలువైన వస్తువులు తో జాగ్రత్త అవసరం. ఇతరులతో వాదోపవాదాలకు  దూరంగా ఉండాలి. (పనులలో ఆటంకాలు ఏర్పడును)

ఉ.షాఢ నక్షత్రం వారికి(క్షేమతార) సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఆసక్తికరమైన విషయాలు వింటారు.తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.( ఆనందంగా గడుపుతారు)

దిన ఫలం:-బంధు మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. విద్యావంతుల తో పరిచయాలు ఏర్పడతాయి.వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగును.అధికారులు తో స్నేహ సంబంధాలు బలపడతాయి.అనుకున్న పనిలో విజయం సాధిస్తారు.అన్ని విషయాలు అనుకూలంగా ఉంటాయి.సంఘంలో ప్రతిభకు తగ్గ గౌరవం లభిస్తుంది. ముఖంలో వర్చస్సు పెరుగుతుంది. మానసిక ఆనందం పొందగలరు.ఓం వేంకటేశ్వరాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

telugu astrology

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం ధనిష్ట 1 2)
నామ నక్షత్రాలు(భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
తారాబలం
శ్రవణా నక్షత్రం వారికి (విపత్తార)పనుల్లో అలసత్వం వల్ల ఇబ్బందులు.మిత్రులతో అకారణంగా కలహాలు రావచ్చు.(ప్రతి పని ఆలోచించి చేయవలెను)

ధనిష్ఠ నక్షత్రం వారికి (సంపత్తార)తలపెట్టిన పనులు పట్టుదలతో చేసినట్లయితే సకాలంలో పూర్తి అగును. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును.(అన్ని విధాలా బాగుంటుంది)

దిన ఫలం:-వైవాహిక జీవితం ఆనందంగా గడుపుతారు.వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును. మానసికంగా ప్రశాంతంగా ఉంటుంది. బంధు మిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. రావలసిన బాకీలు చేతికి అందుతాయి.నూతన కార్యాలకు శ్రీకారం చేస్తారు.ఓం విజయలక్ష్మి యై నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి .
 

telugu astrology

కుంభం (ధనిష్ట 3 4, శతభిషం పూ.భాద్ర 1 2 3)
నామ నక్షత్రాలు(గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
తారాబలం
శతభిషం నక్షత్రం వారికి (జన్మతార)ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. అధికారులు తో విరోధాలు రావచ్చు. (సామాన్యంగా ఉంటుంది.)

పూ.భాద్ర నక్షత్రం వారికి (పరమమిత్ర తార)వాహన ప్రయాణంలో జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.తలపెట్టిన పనులు పూర్తి గాక ఇబ్బందులు ఎదురవుతాయి.(సామాన్యంగా ఉంటుంది)

దిన ఫలం:-జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.వృత్తి వ్యాపారాలలో ధన లాభం. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు.సమాజంలో ఉన్నతమైన వ్యక్తులు తో పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహము కలుగును.పాత బాకీలు వసూలు చేస్తారు.ఓం అనంత పద్మనాభాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

telugu astrology

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర రేవతి )
నామ నక్షత్రాలు(దీ-దూ -ఝ-దా-దే-దో-చా-చ)
తారాబలం
ఉ.భాద్ర  నక్షత్రం వారికి(మిత్ర తార)వృత్తి వ్యాపారాలలో ధన లాభం పొందుతారు.నూతన పరిచయాలు వలన కొన్ని సమస్యలు తీరును.శుభవార్తలు వింటారు.(అన్ని విధాలా శ్రేయస్కరం గా ఉండును)

రేవతి నక్షత్రం  వారికి(నైధనతార)ప్రతి పనిలోనూ ఆచితూచి అడుగు వేయవలెను.ఆరోగ్య విషయంలో శ్రద్ద తీసుకోవాలి.వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.(జాగ్రత్తగా ఉండటం మంచిది)

దిన ఫలం:-అనవసరమైన కలహాలకు దూరంగా ఉండాలి.శత్రువుల వలన అపకారం జరగవచ్చు. మానసిక భయాందోళన గా ఉంటుంది.తలచిన పనులు తగు సమయానికి పూర్తి గాక ఇబ్బందులకు గురి అవుతారు.ప్రతి విషయంలో నిరుత్సాహంగా ఉంటుంది.ఓం మృత్యుంజయాయ నమః అన్న జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

click me!