Today Horoscope: ఓ రాశివారికి బ్యాంకు పనులు, దూరప్రయాణాలలో జాగ్రత్త చాలా అవసరం.

First Published | Jan 30, 2024, 5:30 AM IST

Today Horoscope:ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి.  ఓ రాశివారికి ఈ రోజు సమాజము నందు కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. ఉద్యోగం పనులపై బయటకు వెళ్లాల్సి రావచ్చు. సహోద్యోగులతో మీ స్నేహం పెరుగుతుంది. ఆసక్తికరమైన అవకాశాలు పొందుతారు. 
 

30  -1-2024  మంగళ వారం మీ రాశి ఫలాలు (దిన ఫల,తారా ఫలాలుతో..)


జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్ధాంతి, స్మార్త పండితులు - గాయత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ విద్యార్థి)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్యలు చెప్పండి ...సాయంత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం

ప్రతి రాశికి చెందిన నక్షత్రాలకు తారాబలం చూపబడినది. వీటిలో  (జన్మతార విపత్తార ప్రత్యక్తార నైధనతార) దోష ప్రదమైన తారలు
మీ నక్షత్రానికి ఉన్న తారాబలం చూసుకొని వ్యవహరించి శుభ ఫలితాలను పొందండి.

telugu astrology


మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1)
నామ నక్షత్రాలు (చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)

చేతి వృత్తి వ్యాపారాలలో  ఒడిదుడుకులు ఎదుర్కోవలసి ఉంటుంది. కొన్ని విషయాలు లో పట్టుదలగా వ్యవహరిస్తారు. వచ్చిన అవకాశాలను చేజార్చుకో వద్దు. ఉద్యోగమునందు అధికారుల నుంచి ప్రతికూలత వాతావరణ ఏర్పడుతుంది. ఆర్థిక కార్యకలాపాలు యందు కొద్దిపాటి ఇబ్బందులు కలుగుతాయి. కుటుంబంలో సమస్యలు ఏర్పడి చికాకు పుట్టించును. ఇతరుల యొక్క విషయాల్లో జోక్యం తగదు.పనుల్లో ఆటంకాలు ఏర్పడవచ్చు.బంధుమిత్రులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు ఏర్పడగలవు. అనారోగ్య సమస్యలు రాగలవు. ఈ రాశి వారు ఓం దత్తాత్రేయాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 


telugu astrology

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2)
నామ నక్షత్రాలు (ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)

మీ ప్రత్యర్థులు బలహీన పడతారు .నూతన వ్యవహారాలు వైపు మొగ్గు చూపుతారు. బాధ్యతలను పూర్తిగా నిర్వర్తించండి. ముఖ్యమైన పనులను పూర్తి చేయడం లాభదాయకంగా ఉంటుంది . ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. అనారోగ్య సమస్యలు తగ్గి ఉపశమనం పొందుతారు. వృత్తి వ్యాపారాలలో రాణిస్తారు.  వ్యవహారము నందు కఠినంగా మాట్లాడటం వలన ఇబ్బందులు కలుగుతాయి. ధనాదాయ మార్గాలు అన్వేషణ చేస్తారు. ఈ రాశి వారు ఓం సుబ్రహ్మణ్యాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

telugu astrology

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3)
నామ నక్షత్రాలు (కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)

సమాజము నందు కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. ఉద్యోగం పనులపై బయటకు వెళ్లాల్సి రావచ్చు. సహోద్యోగులతో మీ స్నేహం పెరుగుతుంది. ఆసక్తికరమైన అవకాశాలు పొందుతారు. మనసు ఆనందంగా ఉంటుంది. ఇతరులతో విభేదాలున్నా తొలిగిపోతాయి. చేసే పని యందు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు సానుకూలంగా ఉండును. వ్యాపార భాగస్వామ్యం గురించి చర్చలు జరుపుతారు. మీ పని నిదానంగా జరుగుతున్నట్లు కనిపిస్తుంది. తెలియని వ్యక్తులకు దూరంగా ఉండవలెను. ఈ రాశి వారు ఓం నమశ్శివాయ అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

telugu astrology

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4)
నామ నక్షత్రాలు (హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)

ఆర్థిక ప్రణాళికలు సంబంధించిన విషయాలు గూర్చి ఆలోచన చేస్తారు. ఉద్యోగులు పని విషయంలో మీ బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తారు. వివాదాస్పద విషయాలకు దూరంగా ఉండవలెను. మిత్రులు తోటి కొంత ఇబ్బందులు ఎదురవుతాయి. ఖర్చు యందు ఆచితూచి ఖర్చు చేస్తారు.కుటుంబ కలహాలు తొలగి ప్రశాంతత లభిస్తుంది. వ్యాపారులకు కావలసిన సౌకర్యం అందుతుంది. వ్యాపారం యందు లాభం కనబడను. శత్రు బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ రాశి వారు ఓం నమో నారాయణాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి

telugu astrology


సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1)
నామ నక్షత్రాలు (మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)

నూతన పనులు చేయకుండా ప్రస్తుతం చేస్తున్న వాటి పైనే శ్రద్ధ వహించాలి.పారిశ్రామిక రంగంలో వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ధనవ్యయం విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. ఉద్యోగాలలో అధికారులు తో సమస్యలు ఏర్పడతాయి.సభలు, సమావేశాలు లో మీ ప్రతిభతో అందరినీ ఆకట్టుకుంటారు. అనవసరమైన విషయాలు కు దూరంగా ఉండవలెను.బ్యాంకు పనులు, దూరప్రయాణాలలో జాగ్రత్త చాలా అవసరం.  వదిలిపెట్టిన అవకాశాల గురించి ఎక్కువ ఆలోచనలు చేస్తారు. ఈ రాశి వారు ఓం ఆంజనేయాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

telugu astrology

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2)
నామ నక్షత్రాలు:-(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)

ఆగిపోయిన పనులు ప్రారంభమగును. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. నూతన వ్యాపార ఒప్పందాన్ని అమలు చేస్తారు. పనిచేసే విధానంలో మార్పులు చేర్పులు చేయదురు.వృత్తి ఉద్యోగ అభివృద్ధికి సంబంధించిన వార్త వింటారు. గృహంలో ఆనందకరమైన వాతావరణం ఏర్పడుతుంది. బంధుమిత్రులతో కలిసి శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఉత్సాహపరుస్తాయి. ఈ రాశి వారు ఓం సదాశివాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

telugu astrology

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3)
నామ నక్షత్రాలు(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)

కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. అదృష్టం కలిసి వస్తుంది. కార్యాలయంలో సహోద్యోగుల సహాయం అందుతుంది.చేయు పనులు లో అలసత్వం వహించొద్దు.   శుభవార్తలు వింటారు.ఆహ్వానాలు అందుతాయి. వ్యవహారం నందు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.పనుల్లో విజయం సాధిస్తారు. ఆస్తి లాభం కలుగుతుంది. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. వివిధ రకాల మార్గాలు ద్వారా ఆదాయం ఉంటుంది. సమాజంలో ప్రతిభ తగ్గ గౌరవం లభించును.పలుకుబడి పెరుగుతుంది. ఈ రాశి వారు ఓం మహాలక్ష్మి నమోస్తుతే అని జపించండి శుభ ఫలితాలను పొందండి .

telugu astrology

వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4)
నామ నక్షత్రాలు (తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-య)

పాత వివాదాలు తలెత్తి చికాకు పుట్టించును. రుణాలు ఇవ్వడం గానీ తీసుకోవడం గాని  చేయవద్దు. ఇతర ఆలోచనలు మాని వ్యాపార వ్యవహారాలు చూసుకోవాలి.ఇతరులకు ఆర్థిక హామీలు కు మధ్యవర్తిత్వానికి దూరంగా ఉండటం మంచిది. బంధువులతో వివాదాలు ఏర్పడవచ్చు. శ్రమతో కూడిన పనులు పూర్తి అగును.పక్కవారిని కలుపుకొని పోవడం వల్ల ఇబ్బందులు తగ్గుతాయి. కొన్ని విషయాలు లో మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. విద్యార్థులు చదువుపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలి. ఈ రాశి వారు ఓం దుర్గాయై నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

telugu astrology

ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1)
నామ నక్షత్రాలు (యే-యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)

చేయు కార్యాలయంలో పనిభారం  అధికంగా ఉండి ఒత్తిడికి లోనవుతారు..  అనుకోకుండా ప్రయాణం చేయవలసి వస్తుంది.  ప్రతి విషయంలోను తొందరపాటు నిర్ణయాలు తీసుకొనవద్దు. డబ్బు ఆదా చేయడం పై దృష్టి సారించాలి. ఉద్యోగులకు శుభవార్త అందుతుంది. శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండడం అవసరం. కోపావేశము తగ్గించు కొనవలెను. వ్యాపారస్తులు ఓర్పు సహనం పాటించవలెను. ఆరోగ్య జాగ్రత్తలు తీసుకొనవలెను.ఈ రాశి వారు ఓం సూర్యాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

telugu astrology

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2)
నామ నక్షత్రాలు (భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)

సామాజికంగా నూతన వ్యక్తుల తోటి పరిచయాలు ఏర్పడతాయి. ఒత్తిడి ఉన్నప్పటికీ కార్యాలయంలో  పనితీరు బాగుంటుంది.విద్యార్థులు  తలచిన  పనులు అనుకున్న సమయానికి ముందే పూర్తవుతాయి. కీలకమైన సమస్యలను ధైర్యంగా ఎదుర్కొని విజయం సాధిస్తారు. రోజంతా ఖాళీ లేకుండా ఉంటారు.మంచి పనులు చేపడతారు. గొప్ప వారితో సత్సాంగత్యం ఏర్పడుతుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. ప్రయాణంలో జాగ్రత్తలు అవసరం. ఈ రాశి వారు ఓం దుర్గాయై నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి
 

telugu astrology

కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3)
నామ నక్షత్రాలు (గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)

చిన్న పని అని భావించినా పనుల్లో సమస్యలు ఏర్పడగలవు.  సన్నిహితుల వల్ల కొంత ఇబ్బందులు ఎదురవుతాయి. చేయి వ్యవహారము నందు మృదువుగా  వ్యవహరిస్తూ వ్యవహారాలను చక్కబెట్టుకోవాలి.. కుటుంబ సభ్యులతో విభేదాలు రావచ్చు. తోటి వారితో కలిసి శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. ఆదాయానికి తగ్గ ఖర్చు ఉంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. సమాజంలో  వ్యతిరేకతలు రాగలవు. ఈ రాశి వారు ఓం మృత్యుంజయాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి .

telugu astrology

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4)
నామ నక్షత్రాలు (దీ-దూ-ఝ-దా-దే-దో-చా-చ)

వృత్తి వ్యాపారాల్లో  ఊహించని ధన లాభం కలుగుతుంది. మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు.  స్థిరాస్తి  విషయంలో ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. శత్రువులు మీకు వ్యతిరేకంగా కుట్ర చేయాలని చూస్తారు.  విద్యార్థులు కొత్త విషయాలు మీద ఆసక్తి పెరుగుతుంది . కుటుంబ సమస్యలు పరిష్కార మగును.పెద్దల సాంగత్యము వలన అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి.విలువైన బహుమానం సన్మానాలు సత్కారాలు అందుకుంటారు. స్నేహితులతో మీ సంబంధాలు పెరుగుతాయి .ఈ రాశి మహాలక్ష్మి యై నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

Latest Videos

click me!