Today Horoscope:ఓ రాశివారు ఈ రోజు సమస్యలను చాకచక్యంగా పరిష్కరిస్తారు

First Published | Feb 26, 2024, 5:30 AM IST

Today Horoscope:ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి.  ఓ రాశివారికి ఈ రోజు..ప్రతి పని పట్టుదలతోటి ధైర్యంగా చేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అధిక శ్రమ ఉంటుంది.కానీ సామాన్య ఫలితం పొందగలరు. మనసు చంచలంగా ఉంటుంది.
 

Horoscope


26-2-2024  సోమవారం మీ  రాశి ఫలాలు  (దిన ఫల,తారా ఫలాలుతో..)

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్ధాంతి, స్మార్త పండితులు - గాయత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ విద్యార్థి)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్యలు చెప్పండి ...సాయంత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం

ప్రతి రాశికి చెందిన నక్షత్రాలకు తారాబలం చూపబడినది. వీటిలో  (జన్మతార విపత్తార ప్రత్యక్తార నైధనతార) దోష ప్రదమైన తారలు
మీ నక్షత్రానికి ఉన్న తారాబలం చూసుకొని వ్యవహరించి శుభ ఫలితాలను పొందండి.
  

telugu astrology

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1)
నామ నక్షత్రాలు(చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
దినాధిపతులు
అశ్విని నక్షత్రం వారికి  (దినాధిపతి కుజుడు) బంధువర్గంతో మనస్పర్థలు రాగలవు.దుష్కార్య ఆలోచనలకు దూరంగా ఉండాలి.వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి

భరణి నక్షత్రం వారికి  (దినాధిపతి గురుడు) ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. చేపట్టిన పనులు పూర్తి కాగలవు.వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా ఉంటాయి.

కృత్తిక నక్షత్రం వారికి (దినాధిపతి శని) వ్యవహారిక చిక్కులు. అకారణ విరోధాలు రాగలవు.వృత్తి వ్యాపారాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

దిన ఫలం:-ప్రతి పని పట్టుదలతోటి ధైర్యంగా చేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అధిక శ్రమ ఉంటుంది.కానీ సామాన్య ఫలితం పొందగలరు. మనసు చంచలంగా ఉంటుంది. అనవసరమైన ఖర్చులు చేయవలసి వస్తుంది.అనుకున్న సమయానికి డబ్బు అందక ఇబ్బందులకు గురవుతారు. ఆరోగ్యపరంగా కొద్దిపాటి సమస్యలు ఏర్పడగలవు. రాజకీయ వ్యవహారములు అనుకూలిస్తాయి.  ఓం రవయే‌నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

Latest Videos


telugu astrology

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2)
నామ నక్షత్రాలు (ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
దినాధిపతులు
రోహిణి నక్షత్రం వారికి  (దినాధిపతి కేతువు ) తలచిన పనుల్లో ఆటంకాలు.కుటుంబ సభ్యులతో ప్రతికూలత. శారీరక బాధలు నిస్సత్తువ .ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.

మృగశిర నక్షత్రం వారికి  (దినాధిపతి చంద్రుడు) నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు.సంతోషకరమైన వార్త వింటారు.

దిన ఫలం:-వృత్తి వ్యాపారములు లాభసాటిగా జరుగును. ఉద్యోగాలలో అధికారుల నుండి  గుర్తింపు లభిస్తుంది. ప్రయాణాలు చేయవలసి వస్తుంది. బంధుమిత్రులతో కొద్దిపాటి మనస్పర్ధలు ఏర్పడగలవు. ఆర్థికంగా అన్ని విధాల బాగుండును. సమాజంలో మీ ప్రతిభకు తగ్గ గౌరవం లభిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. సమస్యలను చాకచక్యంగా పరిష్కరిస్తారు.తలచిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఓం దత్తాత్రేయాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

telugu astrology

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3)
నామ నక్షత్రాలు(కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
దినాధిపతులు
ఆరుద్ర నక్షత్రం వారికి  (దినాధిపతి బుధుడు) నూతన వ్యక్తులు తో స్నేహ సంబంధాలు బలపడతాయి.వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగుతాయి. కార్య లాభం.

పునర్వసు నక్షత్రం వారికి  (దినాధిపతి శుక్రుడు) ప్రయత్న కార్యాలు సిద్ధించ గలవు. వృత్తి వ్యాపారాల్లో ధన లాభం పొందగలరు. సంసార సౌఖ్యం లభిస్తుంది.

దిన ఫలం:-తలపెట్టిన పనులు సక్రమంగా నిర్వహించలేక ఇబ్బందులు ఎదురవుతాయి. అనవసరమైన గొడవలు విరోధాలకు దూరంగా ఉండటం మంచిది. ప్రతి చిన్న విషయం భయంగా ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు తగ్గుతాయి. మానసిక ఆందోళనకు గురి అవుతారు. చేయు పనిలో అలసట ఎక్కువగా ఉంటుంది.వృత్తి వ్యాపారాలు సామాన్యంగా నుండును. బంధుమిత్రులతో విరోధాలు రాగలవు. ఉద్యోగాలలో అధికారుల వలన సమస్యలు ఏర్పడతాయి. ఓం గణాధిపాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

telugu astrology


కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4)
నామ నక్షత్రాలు(హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
దినాధిపతులు
పుష్యమి నక్షత్రం వారికి  (దినాధిపతి రాహు) అపవాదము రాగలవు జాగ్రత్త అవసరం. వ్యవహారాలు లో బుద్ధి స్థిరత్వం లేక ఇబ్బందులకు గురి అవుతారు.

ఆశ్రేష నక్షత్రం వారికి  (దినాధిపతి రవి) ఉద్యోగాల్లో సమస్యలు రాగలవు. ఆర్థిక విషయాలు నిరత్సాహపరుస్తాయి. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు రాగలవు.

దిన ఫలం:-మానసిక ఆందోళన చెందుతుంటారు. వృత్తి వ్యాపారంలో అనుకోని అవాంతరాలు ఏర్పడతాయి. ప్రయత్నించి పనులు వృధా అగును.ఉద్యోగాలలో అధికారులచే ఒత్తుడులు ఏర్పడగలవు. ఇంటా బయట ప్రతికూలత వాతావరణం. కోపాన్ని అదుపు చేసుకోవాలి. అకారణంగా కలహాలు ఏర్పడవచ్చు. వ్యాపార అభివృద్ధి కోసం ఆలోచన చేస్తారు. ఓం అంబికాయై నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి
 

telugu astrology


సింహం (మఖ 1 2 3 4, పుబ్బ 1 2 3 4, ఉత్తర 1)
నామ నక్షత్రాలు (మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
దినాధిపతులు
మఘ నక్షత్రం వారికి  (దినాధిపతి కుజుడు) బంధువర్గంతో మనస్పర్థలు రాగలవు.దుష్కార్య ఆలోచనలకు దూరంగా ఉండాలి.వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి

పూ.ఫల్గుణి నక్షత్రం వారికి  (దినాధిపతి గురుడు) ఆర్థిక పరిస్థితి బాగుంటుంది.చేపట్టిన పనులు పూర్తి కాగలవు. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా ఉంటాయి.

ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి  (దినాధిపతి శని) వ్యవహారిక చిక్కులు.అకారణ విరోధాలు రాగలవు.వృత్తి వ్యాపారాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

దిన ఫలం:-కుటుంబ సభ్యుల మధ్య భిన్నాభిప్రాయాలు ఏర్పడగలవు. ముఖ్యమైన నిర్ణయాలు కుటుంబ సభ్యులతో కలిసి తీసుకొవాలి. వ్యాపారంలో ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి.ఊహించని రీతిలో ధనాన్ని ఖర్చు చేయవలసి వస్తుంది. ఆరోగ్య విషయం నందు జాగ్రత్త అవసరము. దుష్ట సహవాసం వలన కష్ట నష్టాలు ఏర్పడగలవు. తలచిన పనులలో సరైన ఆలోచన అవగాహన లేకపోవడం వల్ల పనులు మధ్యలో నిలిచిపోను. ఓం జనార్ధనాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

telugu astrology

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2)
నామ నక్షత్రాలు (టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
దినాధిపతులు
హస్త నక్షత్రం వారికి   (దినాధిపతి కేతువు ) తలచిన పనుల్లో ఆటంకాలు.కుటుంబ సభ్యులతో ప్రతికూలత. శారీరక బాధలు నిస్సత్తువ .ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.

చిత్త నక్షత్రం వారికి   (దినాధిపతి చంద్రుడు) నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. సంతోషకరమైన వార్తల వింటారు.

దిన ఫలం:-తలపెట్టిన పనులలో విజయం చేకూరుతుంది. కుటుంబంలో ఆనందకరమైన  వాతావరణం.ఇతరులకు మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారు. ప్రతి విషయం జాగ్రత్తగా క్రమ పద్ధతిలో చేస్తారు. బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. లాభకరమైన దూర ప్రయాణాలు చేస్తారు. ఆరోగ్య విషయాలు బాగుంటాయి.ఓం విశ్వేశ్వరాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

telugu astrology

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3)
నామ నక్షత్రాలు(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
దినాధిపతులు
స్వాతి నక్షత్రం వారికి   (దినాధిపతి బుధుడు) నూతన వ్యక్తులు తో స్నేహ సంబంధాలు బలపడతాయి.వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగుతాయి.

విశాఖ  నక్షత్రం వారికి  (దినాధిపతి శుక్రుడు) ప్రయత్న కార్యాలు సిద్ధించ గలవు. వృత్తి వ్యాపారాల్లో ధన లాభం పొందగలరు. సంసార సౌఖ్యం లభిస్తుంది.

దిన ఫలం:-ధనాధాయ మార్గాలను అన్వేషణ చేస్తారు. ఇతరులతో కఠినంగా వ్యవహరిస్తారు. ప్రతి చిన్న విషయంలో అకారణ కోపంతో పనులు పూర్తి అవడం కష్టంగా ఉంటుంది . వృత్తి వ్యాపారములు సామాన్యంగా ఉంటాయి. సమాజంలో కొన్ని సంఘటనలు వలన నిరాశ నిస్పృహలకు లోనవుతారు. శారీరక శ్రమ పెరుగుతుంది. ఇంటా బయట మానసిక అశాంతి నెలకొంటుంది. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి.ఓం సుబ్రహ్మణ్యాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

telugu astrology

వృశ్చికము (విశాఖ 4, అనూరాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4)
నామ నక్షత్రాలు (తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
దినాధిపతులు
అనూరాధ నక్షత్రం వారికి (దినాధిపతి రాహువు) అపవాదము రాగలవు. జాగ్రత్త అవసరం. వ్యవహారాల్లో బుద్ధి స్థిరత్వం లేక ఇబ్బందులకు గురి అవుతారు.

జ్యేష్ట నక్షత్రం వారికి (దినాధిపతి రవి) ఉద్యోగాల్లో సమస్యలు రాగలవు. ఆర్థిక విషయాలు నిరత్సాహపరుస్తాయి. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు రాగలవు.


దిన ఫలం:-ఉద్యోగాలలో ఉన్నత స్థితి కలుగుతుంది. గృహములో సంతోషకరమైన వాతావరణం. వ్యాపారంలో  భాగస్వామ్యులు కలిసి వస్తారు. వృత్తి వ్యాపారాలు విజయవంతంగా సాగుతాయి.సమస్యలు పరిష్కారమగును. విద్యార్థులు చదువు మీద ఏకాగ్రత పెరుగుతుంది. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తగును. ఓం వీరభద్రాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

telugu astrology

ధనుస్సు (మూల 1 2 3 4 పూ.షాఢ 1 2 3 4, ఉ.షాఢ 1)
నామ నక్షత్రాలు (యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
దినాధిపతులు
మూల నక్షత్రం వారికి (దినాధిపతి కుజుడు) బంధువర్గంతో మనస్పర్థలు రాగలవు.దుష్కార్య ఆలోచనలకు దూరంగా ఉండాలి.వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి

పూ.షాఢ నక్షత్రం వారికి (దినాధిపతి గురుడు) ఆర్థిక పరిస్థితి బాగుంటుంది.చేపట్టిన పనులు పూర్తి కాగలవు. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా ఉంటాయి.

ఉ.షాఢ నక్షత్రం వారికి (దినాధిపతి శని) వ్యవహారిక చిక్కులు. అకారణ విరోధాలు రాగలవు.వృత్తి వ్యాపారాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

దిన ఫలం:-సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. ఇతరులకు మీ వంతు సహాయ సహకారాలు చేస్తారు.మానసిక ప్రశాంతత లభిస్తుంది.కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం.వృత్తి వ్యాపారములు లాభదాయకంగా ఉంటాయి. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఉద్యోగాలలో అధికారులతో సత్సంబంధాలు మెరుగుపడతాయి.ఓం రామచంద్రాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

telugu astrology


మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2)
నామ నక్షత్రాలు(భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
దినాధిపతులు
శ్రవణా నక్షత్రం వారికి (దినాధిపతి కేతువు ) తలచిన పనుల్లో ఆటంకాలు.కుటుంబ సభ్యులతో ప్రతికూలత. శారీరక బాధలు నిస్సత్తువ .ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.

ధనిష్ఠ నక్షత్రం వారికి (దినాధిపతి చంద్రుడు) నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. సంతోషకరమైన వార్తల వింటారు.

దిన ఫలం:-శుభవార్తలు వింటారు.అనుకున్న పనులు అనుకున్నట్లుగా సాధిస్తారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చేస్తారు. ఆర్థిక అభివృద్ధి బాగుంటుంది. దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. సమాజంలో ఉన్నతమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి వ్యాపారాలలో ధన లాభం కలుగుతుంది. బంధువర్గముతో సహాయ సహకారాలు పొందగలరు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఓం చండికాయై నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

telugu astrology


కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3)
నామ నక్షత్రాలు (గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
దినాధిపతులు
శతభిషం నక్షత్రం వారికి (దినాధిపతి బుధుడు) నూతన వ్యక్తులు తో స్నేహ సంబంధాలు బలపడతాయి.వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగుతాయి.

పూ.భాద్ర నక్షత్రం వారికి (దినాధిపతి శుక్రుడు) ప్రయత్న కార్యాలు సిద్ధించ గలవు. వృత్తి వ్యాపారాల్లో ధన లాభం పొందగలరు.సంసార సౌఖ్యం లభిస్తుంది.

దిన ఫలం:-వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి సంబంధించిన విషయాలు ఆనందాన్ని కలిగిస్తాయి. బంధుమిత్రులతో  కలిసి ఆనందంగా గడుపుతారు. సమాజంలో కొన్ని సంఘటనలు ఉత్సాహపరుస్తాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో  పాల్గొంటారు. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. కుటుంబ సౌఖ్యం పొందగలరు. రావలసిన పాత బాకీలు వసూలు అగును. కీర్తి లక్ష్మీయై నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

telugu astrology


మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4)
నామ నక్షత్రాలు(దీ--దూ- ఝ-దా-దే-దో-చా-చి)
దినాధిపతులు
ఉ.భాద్ర నక్షత్రం వారికి (దినాధిపతి రాహు) అపవాదము రాగలవు జాగ్రత్త అవసరం. వ్యవహారాల్లో  బుద్ధి స్థిరత్వం లేక ఇబ్బందులకు గురి అవుతారు.

రేవతి నక్షత్రం  వారికి (దినాధిపతి రవి) ఉద్యోగాల్లో సమస్యలు రాగలవు. ఆర్థిక విషయాలు నిరత్సాహపరుస్తాయి. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు రాగలవు.

దిన ఫలం:-ముఖ్యమైన వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరించాలి. కుటుంబంలో తొందరపాటు నిర్ణయాల వలన మానసిక ఆందోళన చెందుతారు. అనవసరపు ఖర్చులు తగ్గించుకోవడం ఉత్తమం. శారీరక శ్రమతో ఎలాంటి  కార్యాన్నైనా సాధించగలరు. వృత్తి ఉద్యోగాలు ఒడిదుడుకులు గా ఉంటాయి. వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. కొద్దిపాటి ఆర్థిక ఇబ్బంది పడతారు.ఓం హనుమతే నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

click me!