Today Horoscope: ఓ రాశివారికి శ్రమాధిక్యం తప్ప పనులు ముందుకు సాగవు

First Published | Mar 25, 2024, 5:30 AM IST

Today Horoscope:ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. అనుకున్న పనులు అనుకున్నట్లు సాధిస్తారు.ఆరోగ్య అన్ని విధాలా బాగుంటుంది. మానసికంగా ఆనందంగా ఉల్లాసంగా గడుపుతారు. ప్రత్యర్థులపై పై చేయి సాధిస్తారు.
 

Horoscope 2024 11

25-3-2024, సోమవారం మీ  రాశి ఫలాలు (దిన ఫలం,తారా ఫలాలు తో..)

జోశ్యుల రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్ధాంతి, స్మార్త పండితులు - గాయత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్యలు పెట్టండి ...సాయంత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం

telugu astrology


మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1)
నామ నక్షత్రాలు(చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
తారా బలము
అశ్విని నక్షత్రం వారికి  (క్షేమతార): వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగును. గొప్పవారితో పరిచయాలు ఏర్పడతాయి.అధికారుల అభిమానాలు పొందగలరు

భరణి నక్షత్రం వారికి (విపత్తార)అనుకోని కలహాలు ఏర్పడగలవు. పట్టుదలతో చేసే పనులు పూర్తి అగును.నూతన సమస్యలు ఎదురవుతాయి.అవసరమైన ఖర్చు అదుపు చేసుకోవాలి.

కృత్తిక నక్షత్రం వారికి (సంపత్తార)కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారంలో ధన లాభం కలుగుతుంది. శుభవార్తలు వింటారు.

దిన ఫలం:-పుత్రులతో ప్రతికూలత వాతావరణ.బంధువర్గంతో అకారణంగా కలహాలు రాగలవు. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి.వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.మానసికంగా నిరుత్సాహంగా ఉంటుంది.శారీరక శ్రమ పెరిగి అలసట పొందుతారు.ఆందోళన కలిగించే సంఘటనలు ఎదురవుతాయి.మిత్రులతో సఖ్యంగా వ్యవహరించాలి.
 

Latest Videos


telugu astrology

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2)
నామ నక్షత్రాలు(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వ)
తారాబలం
రోహిణి నక్షత్రం వారికి  (జన్మతార) చేసే పనుల్లో అధిక శ్రమ.అవసరమైన ఖర్చులు.అకారణ కోపం చిరాకు గా ఉంటుంది.భయాందోళన.

మృగశిర నక్షత్రం వారికి (పరమ మిత్ర తార)ధనాదాయ మార్గాలు అన్వేషణ చేస్తారు. తొందరపాటు పనులు వల్ల ఆటంకాలు ఎదురవగలవు.అనవసరమైన ఖర్చులు అదుపు చేసుకోవాలి.

దిన ఫలం:-వ్యాపారంలో పెట్టుబడి తగ్గ ధన లాభం కలుగుతుంది.ఆదాయ మార్గాలు బాగుంటాయి.ఆర్థికంగా బాగుంటుంది.కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చేస్తారు.అనుకున్న విధంగా పనులన్నీ పూర్తి కాగలవు.బంధుమిత్రుల కలయిక ఆనందం కలగజేస్తుంది.విద్యార్థులు చదువు యందు ప్రతిభ కనబరుస్తారు. జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.
 

telugu astrology


మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3)
నామ నక్షత్రములు(కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
తారాబలం
ఆరుద్ర నక్షత్రం వారికి (మిత్ర తార)తలపెట్టిన పనులు పూర్తి చేయగలరు.కుటుంబ సభ్యులతో  ఆనందంగా గడుపుతారు.రావలసిన బాకీలు వసూలు అవును.

పునర్వసు నక్షత్రం వారికి (నైధనతార)చేయు వ్యవహారములో బుద్ధి కుశలత తగ్గి ఆటంకాలు ఏర్పడును. శ్రమ అధికం.  ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.

దిన ఫలం:-అనుకున్న పనులు అనుకున్నట్లు సాధిస్తారు.ఆరోగ్య అన్ని విధాలా బాగుంటుంది. మానసికంగా ఆనందంగా ఉల్లాసంగా గడుపుతారు. ప్రత్యర్థులపై పై చేయి సాధిస్తారు. ఉద్యోగ పరంగా అభివృద్ధి కనపడను.సంసార సౌఖ్యం లభిస్తుంది.సమాజంలో గౌరవ ప్రతిష్టలు పొందుతారు.వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగును.ప్రయాణాలు కలిసి వస్తాయి.
 

telugu astrology

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4)
నామ నక్షత్రాలు(హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
తారాబలం
పుష్యమి నక్షత్రం వారికి (సాధన తార) దైవ సంబంధిత కార్యక్రమాలలో పాల్గొంటారు. శుభవార్తలు వింటారు.ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు.

ఆశ్రేష నక్షత్రం వారికి (ప్రత్యక్తార)వాదోపవాదాలకు దూరంగా ఉండాలి.సమాజంలో అపవాదము రాగలవు. అధికారులు తో వివాదాలు ఏర్పడగలవు.

దిన ఫలం:-బంధు సౌఖ్యం లభిస్తుంది.ఉద్యోగాలలో అధికార అభివృద్ధి.కుటుంబ సభ్యులతో కలిసి వినోదయాత్ర చేస్తారు.అన్ని వర్గాల వారికి అనుకూలంగా ఉంటుంది. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి.క్రయవిక్రయాలు కలిసి వస్తాయి.వ్యవహారాల్లో ఆటంకాలు లేకుండా పూర్తి చేసు కుంటారు.
 

telugu astrology

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ 1 2 3 4, ఉత్తర 1)
నామ నక్షత్రాలు(మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
తారాబలం
మఘ నక్షత్రం వారికి (క్షేమతార)వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగును. గొప్పవారితో పరిచయాలు ఏర్పడతాయి.అధికారుల అభిమానాలు పొందగలరు.

పూ.ఫల్గుణి నక్షత్రం వారికి(విపత్తార) అనుకోని కలహాలు ఏర్పడగలవు. పట్టుదలతో చేసే పనులు పూర్తి అగును.నూతన సమస్యలు ఎదురవుతాయి అనవసరమైన ఖర్చులను అదుపు చేసుకోవాలి.

ఉ.ఫల్గుణి  నక్షత్రం వారికి (సంపత్తార) కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.వృత్తి వ్యాపారాలలో ధన లాభం పొందగలరు.శుభవార్తలు వింటారు.

దిన ఫలం:-జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండాలి .చేయు వ్యవహారంలో కోపాన్ని అదుపు చేసుకుని వ్యవహరించాలి.మానసిక అశాంతి ఏర్పడుతుంది.బంధువర్గము ద్వారా అనేక అవరోధాలు ఏర్పడవచ్చు. అనారోగ్యం కారణంగా ఇబ్బంది కలుగును. జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలు రాగలవు.

telugu astrology

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2)
నామ నక్షత్రాలు(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
తారాబలం
హస్త నక్షత్రం వారికి (జన్మతార)చేసే పనుల్లో అధిక శ్రమ.అవసరమైన ఖర్చు అదుపు చేసుకోవాలి.అకారణ కోపం చిరాకు గా ఉంటుంది.భయాందోళన.

చిత్త నక్షత్రం వారికి(పరమ మిత్ర తార) ధనాదాయ మార్గాలు అన్వేషణ చేస్తారు. తొందరపాటు పనులు వల్ల ఆటంకాలు ఎదురవగలవు. అనవసరమైన ఖర్చులు చేస్తారు.

దిన ఫలం:-వృత్తి వ్యాపారం అనుకూలంగా ఉంటాయి.తలపెట్టిన పనులు సకాలంలో పూర్తగును.ఆర్థికంగా బాగుంటుంది.ఆరోగ్యం చేకూరి ప్రశాంతత లభిస్తుంది. క్లిష్టమైన సమస్యలు ను చాకచక్యంగా ఎదుర్కొంటారు.గృహంలో శుభకార్యములు చేస్తారు. మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి.సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.అన్ని విధాల అభివృద్ధి కనిపించను.

telugu astrology

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3)
నామ నక్షత్రాలు(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
తారాబలం
స్వాతి నక్షత్రం వారికి (మిత్ర తార)తలపెట్టిన పనులు పూర్తి చేయగలరు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.రావలసిన బాకీలు వసూలు అవును.

విశాఖ  నక్షత్రం వారికి  (నైధనతార) చేసే వ్యవహారములో బుద్ధి కుశలత తగ్గి ఆటంకాలు ఏర్పడును.శ్రమ అధికంగా ఉండును. ప్రయాణాలు యందు జాగ్రత్త అవసరం.

దిన ఫలం:-ఆరోగ్యం చేకూరి ప్రశాంతత లభిస్తుంది.కోపాన్ని అదుపు చేసుకుని వ్యవహారాలు చెక్క పెట్టుకోవాలి.పనులలో ఆటంకాలు ఏర్పడతాయి.కుటుంబ సభ్యులతో  అనుకూలమైన మద్దతు లభిస్తుంది.సమస్యలు సామరస్యంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి.వ్యాపారంలో ఆశించిన ఫలితాలు అందుకోలేరు.ప్రతి పనిలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.

telugu astrology

వృశ్చికము(విశాఖ 4, అనూరాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4)
నామ నక్షత్రాలు(తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
తారాబలం
అనూరాధ నక్షత్రం వారికి (సాధన తార)దైవ సంబంధిత కార్యక్రమాలలో పాల్గొంటారు. శుభవార్తలు వింటారు. ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు.

జ్యేష్ట నక్షత్రం వారికి (ప్రత్యక్తార)వాదోపవాదాలకు దూరంగా ఉండవలెను. సమాజంలో అపవాదం.అధికారులు తో వివాదాలు రాగలవు.

దిన ఫలం:-వివాహాది శుభకార్యక్రమాలలో పాల్గొంటారు.వైవాహిక  జీవితం ఆనందంగా గడుపుతారు.దూర ప్రయాణాలు లాభిస్తాయి.ఉద్యోగులకు అనుకూలం.ప్రతి చిన్న సమస్య ను ధైర్యంగా ఎదుర్కొంటారు.అప్రయత్నంగా ధనలాభం కలుగుతుంది. ఆభరణాలు కొనుగోలు చేస్తారు.
 

telugu astrology


ధనుస్సు (మూల 1 2 3 4 పూ.షాఢ 1 2 3 4, ఉ.షాఢ 1)
నామ నక్షత్రాలు(యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
తారాబలం
మూల నక్షత్రం వారికి (క్షేమతార)వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగును. గొప్పవారితో పరిచయాలు ఏర్పడతాయి.అధికారుల అభిమానాలు పొందగలరు

పూ.షా నక్షత్రం వారికి (విపత్తార)అనుకోని కలహాలు ఏర్పడగలవు. పట్టుదలతో చేసే పనులు పూర్తి అగును. నూతన సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.అవసరమైన ఖర్చులు పెరుగుతాయి.

ఉ.షాఢ నక్షత్రం వారికి (సంపత్తార)కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు.వృత్తి వ్యాపారంలో  ధన లాభం కలుగును. శుభవార్తలు వింటారు.

దిన ఫలం:-ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి.జీవిత భాగస్వామితో కొద్దిపాటి మనస్పర్థలు రాగలవు.వ్యాపారం సజావుగా సాగుతాయి.ఉద్యోగస్తులకు అధికారుల యొక్క మన్ననలు పొందగలరు.కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. విద్యార్థులు చదువుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.

telugu astrology

మకరం (ఉ.షాఢ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2)
నామ నక్షత్రాలు:-(భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
తారాబలం
శ్రవణా నక్షత్రం వారికి (జన్మతార) తలపెట్టిన పనులు నిదానంగా పూర్తి కాగలవు.ఆర్థిక విషయాలు కొంతమేర ఇబ్బందులు కలుగును. ఉద్యోగంలో అధిక శ్రమ

ధనిష్ఠ నక్షత్రం వారికి (పరమ మిత్ర తార) ధనాదాయ మార్గాలు అన్వేషణ చేస్తారు. తొందరపాటు పనులు వల్ల ఆటంకాలు ఎదురవగలవు. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి.

దిన ఫలం:-ఆరోగ్యం బాగుంటుంది.అభివృద్ధి కార్యక్రమాల్లో మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి కాగలవు.విలువైన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు.ఆరోగ్యం బాగుంటుంది.చిన్న సమస్యల వలన కోపో ఉద్రేకాలకు గురవుతారు.వివాహాది శుభ కార్యక్రమంలో పాల్గొంటారు.
 

telugu astrology

కుంభం (ధనిష్ట 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3)
నామ నక్షత్రాలు(గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
తారాబలం
శతభిషం నక్షత్రం వారికి(మిత్ర తార) తలపెట్టిన పనులు పూర్తి చేయగలరు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.రావలసిన బాకీలు వసూలు అవును.

పూ.భాద్ర నక్షత్రం వారికి (నైధనతార)చేయు వ్యవహారములో బుద్ధి కుశలత తగ్గి ఆటంకాలు ఏర్పడును. శ్రమ అధికంగా ఉండును.ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి.

దిన ఫలం:-ఆరోగ్య సమస్యల వల్ల ఇబ్బందులు కలుగును.మిత్రులతో విరోధం.ఉద్యోగాలలో  అధికారులు తో సమస్యలు.కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించదు.మానసికంగా ఆందోళన గా ఉంటుంది.శత్రు బాధలు పెరగవచ్చు.కుటుంబంలో ప్రతికూలత వాతావరణం.తలపెట్టిన పనుల్లో అపజయాలు.విద్యార్థులు పట్టుదలతో చదవాలి.
 

telugu astrology

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4)
నామ నక్షత్రాలు(దీ-దూ- ఝ-దా-దే-దో-చా-చి)
తారాబలం
ఉ.భాద్ర నక్షత్రం వారికి (సాధన తార)దైవ సంబంధిత కార్యక్రమాలలో పాల్గొంటారు. శుభవార్తలు వింటారు. ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు.

రేవతి నక్షత్రం వారికి (ప్రత్యక్తార)వాదోపవాదాలకు దూరంగా ఉండాలి.సమాజంలో  అపవాదం.అధికారులు తో వివాదాలు రాగలవు.

దిన ఫలం:-తలపెట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. ఆదాయానికి మించి ఖర్చు చేయాల్సి వస్తుంది.జీవిత భాగస్వామి తో అకారణ కలహాలు రావచ్చు.సమాజంలో ప్రతికూలత వాతావరణం.ఆర్థిక ఇబ్బందులు ఏర్పడి రుణము చేయవలసి వస్తుంది. బంధుమిత్రులతో విరోధం ఏర్పడవచ్చు. ఇతరుల యొక్క విషయాలకు దూరంగా ఉండటం మంచిది.

click me!