Today Horoscope: ఓ రాశివారికి రియల్ ఎస్టేట్, కాంట్రాక్ట్ పనుల్లో లాభాలు

First Published Mar 22, 2024, 5:30 AM IST

Today Horoscope:ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. అన్నదమ్ముల సహాయ సహకారాలు లభిస్తాయి.ఖర్చు విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. నూతన వ్యాపార ఆలోచనలు ఫలిస్తాయి.సంఘంలో గౌరవ ప్రతిష్టలు పొందుతారు.

22-3-2024, శుక్రవారం మీ  రాశి ఫలాలు (దిన ఫలం,తారా ఫలాలు..)

 
జోశ్యుల  రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్ధాంతి, స్మార్త పండితులు - గాయత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్యలు చెప్పండి ...సాయంత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.
 

telugu astrology

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1)
నామ నక్షత్రాలు
(చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
తారా బలము
అశ్విని నక్షత్రం వారికి (జన్మతార)చేసే పనుల్లో అధిక శ్రమ.అవసరమైన ఖర్చు తగ్గించు కోవాలి.కోపం చికాకులు గా ఉంటుంది.

భరణి నక్షత్రం వారికి (పరమైత్రతార)తొందరపాటు పనులు వల్ల ఆటంకాలు ఎదురవగలవు. వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. శారీరక శ్రమ పెరుగుతుంది.

కృత్తిక నక్షత్రం వారికి  (మిత్ర తార) తలపెట్టిన పనులు పూర్తి చేయగలరు.కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. రావలసిన బాకీలు వసూలు అవును.

దిన ఫలం:-శుభ కార్యాలకు శ్రీకారం చుడతారు.నూతన ఆలోచనలు చేస్తారు.నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి.ధనాదాయ మార్గాలు బాగుంటాయి.వృత్తి వ్యాపారాలలో లాభాలు.అన్నదమ్ముల సహాయ సహకారాలు లభిస్తాయి. ఆకస్మిక ధన లాభం.ప్రయాణాలు లాభిస్తాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. గృహంలో సంతోషకరమైన వాతావరణం.తలపెట్టిన పనులు జాప్యం ఏర్పడిన పట్టుదలతో పూర్తి చేస్తారు.

telugu astrology

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2)
నామ నక్షత్రాలు
(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
తారాబలం
రోహిణి నక్షత్రం వారికి (నైధనతార)చేయు వ్యవహారములో బుద్ధి కుశలత తగ్గి ఆటంకాలు ఏర్పడును.శ్రమ అధికంగా ఉంటుంది. ప్రయాణాలు యందు జాగ్రత్తలు తీసుకోవాలి.

మృగశిర నక్షత్రం వారికి  (సాధన తార) దైవ సంబంధిత కార్యక్రమాలలో పాల్గొంటారు. శుభవార్తలు వింటారు.ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు.

దిన ఫలం:-ధనాదాయ మార్గాలు బాగుంటాయి.సంఘంలో తెలివిగా వ్యవహరిస్తారు.అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు.జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.కుటుంబ సౌఖ్యం.వృత్తి వ్యాపారాలలో ధనలాభం.దేవాలయ సందర్శన.మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. నిరుద్యోగులకు శుభవార్త వింటారు.నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు.ఆకస్మిక ధన లాభం.అన్నదమ్ములు సహకారం లభిస్తుంది.

telugu astrology

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3)
నామ నక్షత్రాలు
(కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
తారాబలం
ఆరుద్ర నక్షత్రం వారికి (ప్రత్యక్తార)వాదోపవాదాలకు దూరంగా ఉండాలి.సమాజంలో  అపవాదము .అధికారులు తో వివాదాలు ఏర్పడును.

పునర్వసు నక్షత్రం వారికి  (క్షేమతార)వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగును. గొప్పవారితో పరిచయాలు ఏర్పడతాయి. అధికారుల ప్రశంసలు పొందగలరు

దిన ఫలం:-అన్నదమ్ముల సహాయ సహకారాలు లభిస్తాయి.ఖర్చు విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. నూతన వ్యాపార ఆలోచనలు ఫలిస్తాయి.సంఘంలో గౌరవ ప్రతిష్టలు పొందుతారు.ఇతరులకు ఉపకారం చేస్తారు.మిత్రుల యొక్క ఆదరణ పొందుతారు.శుభ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. జీవిత భాగస్వామితో కలిసి ఆనందంగా గడుపుతారు.పోయిన వస్తువులు తిరిగి లభించును.ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అవసరానికి తగ్గట్టు ధనం లభిస్తుంది.
 

telugu astrology

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4)
నామ నక్షత్రాలు
(హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
తారాబలం
పుష్యమి నక్షత్రం వారికి (విపత్తార) అనుకోని కలహాలు రాగలవు. పట్టుదలతో చేసే పనులు పూర్తి అగును. నూతన సమస్యలు ఎదురవుతాయి.అవసరమైన ఖర్చులు పెరుగుతాయి.

ఆశ్రేష నక్షత్రం వారికి  (సంపత్తార)కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాలలో  ధన లాభం కలుగును.శుభవార్త వింటారు.

దిన ఫలం:-సంతాన మూలకంగా లాభం.దానధర్మాలు చేస్తారు.శుభ కార్యాచరణ వలన ధనవ్యయం. కుటుంబంతో ఆహ్లాదంగా గడుపుతారు.బుద్ధి చాతుర్యంతో మంచి నిర్ణయాలు తీసుకుంటారు.పై అధికారుల ద్వారా లాభం చేకూరును.వివాహ ప్రయత్నాలు ఫలించును. కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్న సమస్యలకు పరిష్కార మార్గం లభించును. అనుకూలమైన జీవన విధానం.ఆదాయ మార్గాలు బాగుంటాయి. వ్యాపార భాగస్వాములు తో తెలివిగా వ్యవహరించాలి.

telugu astrology

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1)
నామ నక్షత్రాలు
(మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
తారాబలం
మఘ నక్షత్రం వారికి (జన్మతార)చేసే పనుల్లో అధిక శ్రమ.అవసరమైన ఖర్చు తగ్గించు కోవాలి.కోపం చికాకులు గా ఉంటుంది.

పూ.ఫ నక్షత్రం వారికి  (పరమైత్రతార) తొందరపాటు పనులు వల్ల ఆటంకాలు ఎదురవగలవు. వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. శారీరక శ్రమ పెరుగుతుంది.

ఉ.ఫల్గుణి  నక్షత్రం వారికి (మిత్ర తార)తలపెట్టిన పనులు పూర్తి చేయగలరు.కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. రావలసిన బాకీలు వసూలు అవును.

దిన ఫలం:-వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరించాలి.ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి.అనవసర ప్రయాణాలు చేయవలసి వస్తుంది.శారీరక బలహీనత ఏర్పడును.ప్రభుత్వ అధికారులు తో కలహాలు రాగలవు.చిన్న పాటి ఆరోగ్య సమస్యలు. సమాజంలో సమయస్ఫూర్తితో మెలగాలి.మరియు ఇబ్బందులు ఎదురవుతాయి. కుటుంబ సభ్యులతో ప్రతికూలత వాతావరణం. ఆయుధాలు మరియు పనిముట్లు తో జాగ్రత్త వహించాలి

telugu astrology


కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2)
నామ నక్షత్రాలు
(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
తారాబలం
హస్త నక్షత్రం వారికి  (నైధనతార)చేయు వ్యవహారములో బుద్ధి కుశలత తగ్గి ఆటంకాలు ఏర్పడును.శ్రమ అధికంగా ఉంటుంది. ప్రయాణాలు యందు జాగ్రత్తలు తీసుకోవాలి.

చిత్త నక్షత్రం వారికి  (సాధన తార)దైవ సంబంధిత కార్యక్రమాలలో పాల్గొంటారు. శుభవార్తలు వింటారు.ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు

దిన ఫలం:-అనుకున్న పనులు లో జాప్యం.ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాలి.ప్రయాణాల్లో తగు జాగ్రత్త వహించాలి.చొర భయం.వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.నూతన ఆలోచనలు విషయంలో నిరాసక్తత.చేతి వృత్తుల వారు కష్టించిన విజయం సాధిస్తారు.ఏ పని చేసినా ఒకటికి రెండు సార్లు ఆలోచించి ముందడుగు వేయాలి.ఆదాయానికి మించిన ఖర్చులు చేస్తారు. ఉద్యోగాలు లో అధికారుల నుంచి ఒత్తిడి.

telugu astrology

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3)
నామ నక్షత్రాలు
(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
తారాబలం
స్వాతి నక్షత్రం వారికి  (ప్రత్యక్తార) వాదోపవాదాలకు దూరంగా ఉండాలి.సమాజంలో  అపవాదము .అధికారులు తో వివాదాలు ఏర్పడును.

విశాఖ  నక్షత్రం వారికి (క్షేమతార)వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగును. గొప్పవారితో పరిచయాలు ఏర్పడతాయి. అధికారుల ప్రశంసలు పొందగలరు

దిన ఫలం:-శత్రువులపై విజయం సాధిస్తారు.అన్నదమ్ముల సహకారంతో అనుకున్న పనులు పూర్తి చేస్తారు. సంఘంలో తెలివి గా వ్యవహరిస్తారు.ఆదాయ మార్గాలు బాగుంటాయి.కుటుంబంలో సమస్యలు తొలగుతాయి.అవివాహితులకు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి.పోగొట్టుకున్న వస్తువు తిరిగి లభించును.జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.గత కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్న వ్యవహారాల నుండి విముక్తి లభిస్తుంది.పోయిన ధనాన్ని తిరిగి రాబట్టుకుంటారు.
 

telugu astrology

వృశ్చికము (విశాఖ 4, అనూరాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4)
నామ నక్షత్రాలు
(తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-య)
తారాబలం
అనూరాధ నక్షత్రం వారికి  (విపత్తార) అనుకోని కలహాలు రాగలవు. పట్టుదలతో చేసే పనులు పూర్తి అగును. నూతన సమస్యలు ఎదురవుతాయి.అవసరమైన ఖర్చులు పెరుగుతాయి.

జ్యేష్ఠ నక్షత్రం వారికి (సంపత్తార)కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాలలో  ధన లాభం కలుగును.శుభవార్త వింటారు.

దిన ఫలం:-గృహంలో పెద్దల యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాలి.జీవిత భాగస్వామితో చికాకులు. గృహంలో ప్రతికూల వాతావరణం.వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. సంఘంలో జాగ్రత్తగా మెలగవలెను.అన్నదమ్ములు మిత్రులతో వివాదాలు.శారీరక శ్రమ అధికంగా ఉంటుంది.తలపెట్టిన పనులు వాయిదా పడతాయి.రక్త సంబంధీకులు తో మనస్పర్థలు ఏర్పడతాయి.వస్తువులు కొనుగోలు విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి

telugu astrology

ధనుస్సు (మూల 1 2 3 4 పూ.షాఢ 1 2 3 4, ఉ.షాఢ 1)
నామ నక్షత్రాలు
(యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
తారాబలం
మూల నక్షత్రం వారికి (జన్మతార)చేసే పనుల్లో అధిక శ్రమ.అవసరమైన ఖర్చు తగ్గించు కోవాలి.కోపం చికాకులు గా ఉంటుంది.

పూ.షాఢ నక్షత్రం వారికి  (పరమైత్రతార)తొందరపాటు పనులు వల్ల ఆటంకాలు ఎదురవగలవు. వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. శారీరక శ్రమ పెరుగుతుంది.

ఉ.షాఢ నక్షత్రం వారికి (మిత్ర తార) తలపెట్టిన పనులు పూర్తి చేయగలరు.కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. రావలసిన బాకీలు వసూలు అవును.

దిన ఫలం:-సంఘంలో తెలివిగా వ్యవహరించాలి.ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆదాయానికి మించిన ఖర్చులు.రుణ శత్రు బాధలు కొద్దిగా ఇబ్బంది పెడతాయి.దైవ చింతన. వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరించాలి.పిల్లల చదువు విషయంలో తగిన శ్రద్ధ తీసుకోవాలి. ఉద్యోగులకు పై అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది.శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఆదాయానికి మించిన ఖర్చులు చేస్తారు. కుటుంబంలో పెద్దలు యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

telugu astrology

మకర (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2)
నామ నక్షత్రాలు
(భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
తారాబలం
శ్రవణా నక్షత్రం వారికి (నైధనతార):- చేయు వ్యవహారములో బుద్ధి కుశలత తగ్గి ఆటంకాలు ఏర్పడును.శ్రమ అధికంగా ఉంటుంది. ప్రయాణాలు యందు జాగ్రత్తలు తీసుకోవాలి.

ధనిష్ఠ నక్షత్రం వారికి (సాధన తార)దైవ సంబంధిత కార్యక్రమాలలో పాల్గొంటారు. శుభవార్తలు వింటారు.ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు

దిన ఫలం:-కుటుంబ వ్యవహారాలు లో జాగ్రత్తలు తీసుకోవాలి.చేయు వృత్తి వ్యాపారాలలో  ఒడిదుడుకులు. అధికారులు తో ఇబ్బందులు.వ్యవహారాలలో ఆచి తూచి వ్యవహరించాలి. మిత్రులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.తలపెట్టిన కార్యక్రమం వాయిదా వేసుకోవడం మంచిది. గృహంలో పెద్ద వారి ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాలి.మానసికంగా శారీరకంగా బలహీనంగా ఉంటుంది.అనుకోని సంఘటన వలన భయాందోళన గా ఉంటుంది.ఖర్చు విషయంలో ఆలోచించండి
 

telugu astrology

కుంభం (ధనిష్ట 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3)
నామ నక్షత్రాలు
(గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
తారాబలం
శతభిషం నక్షత్రం వారికి (ప్రత్యక్తార)వాదోపవాదాలకు దూరంగా ఉండాలి.సమాజంలో  అపవాదము .అధికారులు తో వివాదాలు ఏర్పడును.

పూ.భాద్ర నక్షత్రం వారికి (క్షేమతార)వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగును. గొప్పవారితో పరిచయాలు ఏర్పడతాయి. అధికారుల ప్రశంసలు పొందగలరు

దిన ఫలం:-సంతాన విషయంలో జాగ్రత్త వహించాలి.సంఘంలో తెలివిగా వ్యవహరించాలి.రుణ శత్రు బాధలు కొద్దిగా ఇబ్బంది పెడతాయి.బంధుమిత్రులతో చికాకులు.వృత్తి వ్యాపారులకు సామాన్యంగా ఉంటాయి.ఉద్యోగులకు పై అధికారుల ఒత్తిడి. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపార భాగస్వాములు తో తెలివిగా వ్యవహరించాలి.ఆదాయ మార్గాలు అన్వేషణ సఫలీకృతం అవుతాయి.రావలసిన బాకీలు లో జాప్యం.

telugu astrology

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4)
నామ నక్షత్రాలు (దీ-దూ-ఝ-దా-దే-దో-చా-చి)
తారాబలం
ఉ.భాద్ర నక్షత్రం వారికి (విపత్తార)అనుకోని కలహాలు రాగలవు. పట్టుదలతో చేసే పనులు పూర్తి అగును. నూతన సమస్యలు ఎదురవుతాయి.అవసరమైన ఖర్చులు పెరుగుతాయి.

రేవతి నక్షత్రం  వారికి (సంపత్తార)కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాలలో  ధన లాభం కలుగును.శుభవార్త వింటారు.

దిన ఫలం:-కుటుంబ వృద్ధి.శత్రువుల పై పైచేయి సాధిస్తారు.బంధు మిత్రుల సహకారం లభిస్తుంది.మంచి పనులు కు ధనాన్ని వెచ్చిస్తారు.ఉద్యోగస్తులకు పై అధికారుల  మన్ననలను పొందుతారు.సంఘంలో కీర్తి ప్రతిష్టలు.వృత్తి ఉద్యోగాల్లో అనుకూలమైన వాతావరణం.ఆదాయ మార్గాలు బాగుంటాయి. ఆకస్మిక ధన లాభం.దేవాలయ సందర్శన.ఇతరులకు సహకారం అందిస్తారు.జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.అవివాహితులకు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి.

click me!